అన్వేషించండి

Chocolate Benefits: మీకు చాక్లెట్ అంటే ఇష్టం లేదా? అయితే.. మీరు ఏం మిస్ అవుతున్నారో తెలిస్తే షాకవుతారు

చాక్లెట్లు తింటే పళ్లు పుచ్చుపోతాయని అంటారు. అందులో వాస్తవం లేకపోలేదు. కానీ, తాజా అధ్యయనం మాత్రం ఇందుకు భిన్నమై ప్రయోజనం చెప్పింది. అదేంటో చూడండి.

చాక్లెట్స్ అంటే ఇష్టంలేనివారు ఎవరుంటారు చెప్పండి. తియ్యగా, క్రిమీగా ఉండే చాక్లెట్‌ను అలా నోటిలో పెట్టుకోగానే కరిగిపోతుంది. మనసు ఆనందాన్ని కూడా ఇస్తుంది. అయితే, ఇప్పటికే చాలా అధ్యయనాలు చాక్లెట్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనని స్పష్టం చేశాయి. చాక్లెట్ హార్ట్‌కు కూడా మేలు చేస్తుందని పరిశోధకులు చెప్పారు. తాజా అధ్యయనంలో మరో ఆసక్తికర విషయం వెలుగు చూసింది. అది తెలిస్తే ఎగిరి గంతేస్తారేమో, అదేంటో చూసేయండి. 

చిగుళ్లకు మంచిదే 

చాక్లెట్లు తినడం వల్ల మీ దంతాల చిగుళ్లకు కూడా మేలు జరుగుతుందటే నమ్ముతారా? సాధారణంగా చాక్లెట్లు ఎక్కువగా తింటే పళ్లు పుచ్చుపోతాయని అంటారు. కానీ, తాజా అధ్యయనం మాత్రం చాక్లెట్లు తినడం వల్ల చిగుళ్ల వ్యాధి వచ్చే అవకాశాలు తగ్గుతాయని పేర్కొంది. ఔనండి, మీరు విన్నది కరక్టే. ముఖ్యంగా డార్క్ చాక్లెట్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయట. డార్క్ చాక్లెట్‌లో ఉండే కోకోబీన్స్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు చిగుళ్లకు మేలు చేయవచ్చని పేర్కొన్నారు. సుమారు 50 శాతం వరకు చాక్లెట్లు చిగుళ్లకు మేలు చేయొచ్చని చెప్పారు. అయితే, సుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండే చాక్లెట్లు తింటే మాత్రం మొదటికి మోసం వస్తుంది. అవి దంతాలను తినేస్తాయి. దంతక్షయం ఏర్పడి.. భవిష్యత్తులో చాక్లెట్లను చూస్తేనే భయపడే పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి, చాక్లెట్లు మంచివే కదా అని అదే పనిగా తినొద్దు. ఒక వేళ తినాలి అనిపిస్తే.. డార్క్ చాక్లెట్లు తినండి. 

చిగుళ్లకు ఏవీ మేలు? ఏవి మంచివి కాదు?

అధిక సుగర్ లేదా సాల్ట్ కంటెంట్ ఉన్న ఆహారాలేవీ చిగుళ్ల ఆరోగ్యానికి మంచివి కాదు. చీజ్ చిగుళ్లకు మంచిదే. అలాగే తక్కువ ఉప్పు కలిపిన వేరే శనగలు కూడా మేలు చేస్తాయి. ఉడకబెట్టిన లేదా వేపిన శనగలైతే బెస్ట్. ఫిల్టర్ కాఫీలు, తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారాలు చిగుళ్లకు మంచివి కాదు. చెక్లెట్, చీజ్ 54 శాతం వరకు చిగుళ్లకు మేలు కలిగిస్తాయి. వేరు శనగలై 71 శాతం వరకు మంచివి. మనం డైలీ తినే రైస్ వల్ల కూడా చిగుళ్లకు ఎలాంటి ప్రమాదం ఉండదు. కనీసం 58 శాతం వరకు మేలు జరుగుతుంది. ఫిల్టర్ కాఫీ వల్ల 42 శాతం, తక్కువ క్యాలరీలు కలిగిన పానీయాల వల్ల చిగుళ్లకు 57 శాతం వరకు నష్టం కలగవచ్చని చైనాలోని చాంగ్‌కింగ్ మెడికల్ యూనివర్సిటీ అధ్యయనం వెల్లడించింది. కాబట్టి.. పై వాటిలో మీ చిగుళ్లకు మేలు చేసే ఆహారాన్నే ఇకపై ఎంచుకోండి.

Also Read: ఆ ఫాస్టింగ్​‌తో 21 రోజులలో 13 కిలోలు తగ్గాడట.. నిజంగానే బరువు తగ్గుతారా? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Loose Motions : వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
వాతావరణం మారగానే విరేచనాలు అవుతున్నాయా? అయితే ఈ జాగ్రత్తలతో పాటు ఈ ఫుడ్స్ తీసుకోండి
Tofu vs Paneer : టోఫు vs పనీర్.. దేనిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది? బరువు తగ్గేందుకు దేనిని తినాలి?
టోఫు vs పనీర్.. దేనిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది? బరువు తగ్గేందుకు దేనిని తినాలి?
First Foreign Trip: తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
తొలిసారి ఫారిన్ వెళ్తున్నారా? ఈ 4 తప్పులు చేయకండి, లేదంటే మీ ట్రిప్ పాడైపోవచ్చు
Dinner Timings : సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే
సాయంత్రం 5 గంటలకే డిన్నర్ ముగించేయాలా? నిద్ర, గట్ హెల్త్​పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిపుణుల సలహాలివే

వీడియోలు

Salman Ali Agha Controversial Run-Out | బంగ్లాదేశ్ ప్లేయర్ తీరుపై సల్మాన్ అఘా ఫైర్
Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Reshuffle: ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
ఏపీ కేబినెట్ విస్తరణ - వాస్తవమా? కూటమి పార్టీల్లో ఆశావహుల రాజకీయమా?
Rythu Bharosa Funds: తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
తెలంగాణ రైతులకు శుభ‌వార్త.. రైతుభ‌రోసా నిధులు జమ అయ్యేది ఎప్పుడంటే..
Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
CM Chandrababu: డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
డ్రగ్స్ కేసులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్‌.. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదన్న సీఎం చంద్రబాబు
Election Dates 2026: తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు.. బెంగాల్‌లో 2 దశల్లో పోలింగ్
CM Revanth Reddy: మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
మన మధ్య మంట పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు... ఇఫ్తార్ విందులో సీఎం రేవంత్ రెడ్డి
KTR Drugs Test: మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
మహేష్ గౌడ్ సూచన స్వీకరిస్తా.. డ్రగ్స్ కేసులోకి లాగితే మాత్రం నోటీసులు: కేటీఆర్
Trump Targets Kharg Island: సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
సరదా కోసం దాడి చేయవచ్చు.. ఇరాన్ ఖర్గ్ ద్వీపాన్ని టార్గెట్ చేస్తూ ట్రంప్ వార్నింగ్
Embed widget