అన్వేషించండి

2025 Resolution : న్యూ ఇయర్ రెజల్యూషన్​గా డిటాచ్​మెంట్.. లైఫ్​లో బెస్ట్ రిజల్ట్స్​ కావాలంటే దీనిని ఫాలో అయిపోండి

Detaching in 2025 : డిటాచ్​మెంట్​ అనేది లైఫ్​లో బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ అని చెప్తారు. ఈ న్యూ ఇయర్​ నుంచైనా ఈ డిటాచ్​మెంట్​ని మీ లైఫ్​స్టైల్​లో పార్ట్ చేసుకోండి. రిజల్ట్స్ మీరే చూస్తారు. 

Detachment for Personal and Professional Growth : డిటాచ్​మెంట్​ అనేది లైఫ్​లో ఉంటే ఎన్నో అద్భుతమైన ఫలితాలు చూడొచ్చని చెప్తున్నారు మానసిక నిపుణులు. న్యూ ఇయర్ 2025లో దీనితో పర్సనల్, ప్రొఫెషనల్ గ్రోత్ చూడవచ్చని చెప్తున్నారు. డిటాచ్​మెంట్​ను తెలుగులో నిర్లిప్తత అంటారు. అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఓ వ్యక్తి తన ఆలోచనలను, భావోద్వేగాలను, భౌతిక అవసరాలనుంచి.. తనని తాను వేరు చేసుకోవడాన్నే డిటాచ్​మెంట్ అంటారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్​ అంటే.. ఇలా డిటాచ్​ కావడం నేర్చుకోకుంటే.. మీరు లోకసంబంధం బాంధవ్యాల్లో చిక్కుకుపోవడం ఖాయం. అది మిమ్మల్ని మానసికంగా కృంగదీస్తుందని చెప్తున్నారు. 

డిటాచ్​మెంట్ ఎన్ని రకాలుగా ఉంటాయంటే.. 

ఎమోషనల్ డిటాచ్​మెంట్ : కోపం, విచారం, ఆందోళన వంటి స్ట్రాంగ్ ఎమోషన్స్​ నుంచి తనను తాను బయటపడేలా చేసుకోవడమే ఎమోషనల్ డిటాచ్​మెంట్. 

మెంటల్ డిటాచ్​మెంట్ : నెగిటివ్ ఆలోచనలు, చింతలు, లోలోపల జరిగే సంఘర్షణల నుంచి మానసికంగా బయటపడడమే మెంటల్ డిటాచ్​మెంట్. 

ఫిజికల్ డిటాచ్​మెంట్ : శారీరకంగా కలిగే నొప్పి నుంచి.. లేదా అసౌకర్యం గురించి ఆలోచించకుండా ఉండగలగడమే ఫిజికల్ డిటాచ్​మెంట్.

ఆధ్యాత్మికంగా డిటాచ్​మెంట్ : మత విశ్వాసాలు, ఆచారాలు, మూఢనమ్మకాలు, వాటివల్ల వచ్చే ఫలితాలకు దూరంగా వెళ్లడమే స్పిర్చ్యువల్ డిటాచ్​మెంట్. 

డిటాచ్​మెంట్ వల్ల కలిగే లాభాలు ఇవే.. 

డిటాచ్​మెంట్​ అనేది కొందరు తప్పుగా తీసుకుంటారు కానీ.. దీనివల్ల కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు. ఇది ఒత్తిడిని, యాంగ్జైటీని దూరం చేస్తుంది. మీ ఎమోషన్స్​ని అతిగా వెళ్లకుండా ఇది హెల్ప్ చేస్తుంది. మానసికంగా మీకు క్లారిటీ పెరుగుతుంది. మిమ్మల్ని డైవర్ట్ చేసే అంశాలు ఎక్కువగా ఉండవు. కాబట్టి మీ గోల్​ మాత్రమే మీకు క్లారిటీగా కనిపిస్తుంది. 

మీ గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. మీ లక్ష్యాలు, మీ విలువలు కాపాడుకోవడంలో అవగాహన మెరుగవుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. బాహ్యా ఫలితాలతో సంబంధం లేకుండా ఎఫర్ట్స్ పెడతారు. ఎలాంటి ఫలితమొచ్చినా దానిని కూల్​గా రిసీవ్ చేసుకోగలుగుతారు. ఇది మెంటల్ బ్రేక్​డౌన్​ కాకుండా హెల్ప్ చేస్తుంది. వ్యక్తిగత ఎదుగుదలకు తోడ్పడుతుంది. 

పాత జ్ఞాపకాలు మిమ్మల్ని వెంటాడకుండా.. మిమ్మల్ని మీరు కొత్తగా మార్చుకోవడంలో హెల్ప్ చేస్తుంది. రిలేషన్​షిప్స్ మెరుగవుతాయి. ఫ్యామిలీ, ఫ్రెండ్ ఇలా ఎవ్వరి మీద ఎక్కువ ఎక్స్​పెక్టేషన్స్ ఉండవు. ఇలాంటప్పుడు అవతలి వ్యక్తికి మీరు భారం కారు. అవతలి వ్యక్తి విలువలని రెస్పెక్ట్​ ఇస్తూ ముందుకు వెళ్లగలుగుతారు. 

ఎలా నేర్చుకోవాలి? 

రోజూ మెడిటేషన్ చేయడం వల్ల డిటాచ్​మెంట్​ అనేది అలవాటు అవుతుంది. మీ శరీరానికి, మనసుకు ఏమి కావాలో తెలుసుకోవచ్చు. అవసరం లేని వాటిని విస్మరించగలిగే శక్తి మీకు అందుతుంది. మైండ్‌ఫుల్‌నెస్ వల్ల ఆలోచనలు, ఎమోషన్స్, ఫిజికల్ సెన్సేషన్స్​ కంట్రోల్ అవుతాయి. ఎక్కువకాలం ఇవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. యోగా నిద్రను మెరుగుపరుస్తుంది. అలాగే మానసిక ప్రశాంతతను అందిస్తుంది. 
జర్నలింగ్ చేస్తూ ఉంటే చేసిన తప్పులను మళ్లీ చేయకుండా ఉండడంలో హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మీ ఎమోషన్స్​ని, ఆలోచనలని రాస్తూ ఉంటే.. మీరు వాటి నుంచి ఈజీగా డిటాచ్ అవ్వగలుగుతారు. అంతేకాకుండా పర్సనల్, ప్రొఫెషనల్​ లైఫ్​కి కూడా ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. 

డీప్ బ్రీతింగ్, స్లో బ్రీతింగ్ వ్యాయామాలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. ఫిజికల్ యాక్టివిటీ కూడా డిటాచ్​లో భాగమే. ఇది మిమ్మల్ని శారీరకంగా కూడా హెల్తీగా మార్చుతుంది. కండరాలను రిలాక్స్ చేసే టెక్నిక్స్ కూడా మంచి ఫలితాలనిస్తాయి. ప్రశాంతమైన వాతావరణంలో.. మీకు నచ్చినప్రదేశంలో మీరు ఉన్నట్లు ఊహించుకోవడం వల్ల కూడా డిటాచ్​మెంట్​లో మీరు సక్సెస్ అవుతారని చెప్తున్నారు నిపుణులు. 

Also Read : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర విజయం
AP MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర విజయం
Revanth Reddy: ఏపీ జలదోపిడిని ఆపాల్సిందే - కేంద్రానికి రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు
ఏపీ జలదోపిడిని ఆపాల్సిందే - కేంద్రానికి రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు
Rashmika Mandanna: 'రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?' - నటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
'రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?' - నటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
YSRCP On Amaravati: 3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Oscar 2025 | 97వ ఆస్కార్‌ అవార్డుల్లో చరిత్ర సృష్టించిన అనోరా సినిమా | ABP DeshamRaksha Khadse Daughter | తన కుమార్తెను వేధించిన పోకిరీలపై కేంద్రమంత్రి పోలీస్ కంప్లైంట్ | ABP DesamSpeaker suggests massage chairs for MLAs in Assembly | MLAలకు సభ తర్వాత విశ్రాంతి కావాలి | ABP DeshamPM Modi Lion Safari | గిర్ అభయారణ్యంలో సఫారీ కి వెళ్లిన ప్రధాని మోదీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర విజయం
AP MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర విజయం
Revanth Reddy: ఏపీ జలదోపిడిని ఆపాల్సిందే - కేంద్రానికి రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు
ఏపీ జలదోపిడిని ఆపాల్సిందే - కేంద్రానికి రేవంత్, ఉత్తమ్ ఫిర్యాదు
Rashmika Mandanna: 'రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?' - నటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
'రష్మికకు సరైన గుణపాఠం నేర్పించాల్సిన అవసరం లేదా?' - నటిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
YSRCP On Amaravati: 3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
3 రాజధానులపై మారిన వైసీపీ విధానం - అమరావతికి జై కొట్టినట్లేనా ?- బొత్స సంచలనం
Uttarandhra Teachers Mlc: కూటమి పార్టీలు మద్దతిచ్చినా రఘువర్మకు ఓటమే - ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి విజయం
కూటమి పార్టీలు మద్దతిచ్చినా రఘువర్మకు ఓటమే - ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీగా పీఆర్టీయూ అభ్యర్థి విజయం
CM Chandrababu: తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు - 2000 మందికి ఉపాధి
తిరుపతిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్, వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం చంద్రబాబు - 2000 మందికి ఉపాధి
Harish Rao Challenges Revanth Reddy: SLBCపై నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా! సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్
SLBC టన్నెల్ పై నిరూపిస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా! సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్
Viral News: ముద్దులు కలిపి ఉంచలేవు - లిప్ కిస్సులో ప్రపంచరికార్డు సృష్టించారు కానీ విడాకులు తీసుకుంటున్నారు !
ముద్దులు కలిపి ఉంచలేవు - లిప్ కిస్సులో ప్రపంచరికార్డు సృష్టించారు కానీ విడాకులు తీసుకుంటున్నారు !
Embed widget