అన్వేషించండి

Date and Walnut Cake Recipe : టేస్టీ, హెల్తీ కేక్​.. నో షుగర్, నో ఎగ్ దీని స్పెషాలిటీ.. రెసిపీ చాలా చాలా సింపుల్

Cake Recipe With No Maida No Sugar : మీరు ఎగ్​ లెస్ కేక్ రెసిపీ గురించి ఆలోచిస్తున్నట్లయితే ఇక్కడ మీకో హెల్తీ కేక్​ రెసిపీ ఉంది. దీనిని తయారు చేయడం కూడా చాలా సింపుల్.

Eggless Cake Recipe : వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్ చేసుకునే కేక్ రెసిపీ ఇక్కడ ఉంది. దాదాపు అన్ని కేక్​లను గుడ్డు ఉపయోగించే చేస్తారు. కానీ ఇప్పుడు మనం తయారు చేసుకునే డేట్స్, వాల్​నట్​ కేక్​ను అసలు గుడ్డే లేకుండా తయారు చేస్తాము. దీనిలో చక్కెర కూడా ఉపయోగించము. మైదా అసలు వేసే ఛాన్సే లేదు. ఇవన్నీ వేయము అంటే తయారు చేయడం చాలా కష్టం అనుకుంటున్నారేమో.. చాలా ఈజీగా ఈ టేస్టీ టేస్టీ కేక్​ను రెడీ చేయవచ్చు. దాదాపు అన్ని కేక్​ల కంటే దీనిని రెసిపీ చాలా సింపుల్​గా, ఈజీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కేక్​ను ఎలా తయారు చేయాలో? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

ఖర్జూరాలు - 25

పాలు - ఒకటిన్నర కప్పులు

గోధుమ పిండి - 1 కప్పు

వెజిటబుల్ ఆయిల్ - అరకప్పు

బేకింగ్ పౌడర్ - అర స్పూన్

బేకింగ్ సోడా - 1 స్పూన్

వాల్​నట్స్ - అరకప్పు

తయారీ విధానం

మీరు కేక్​ చేయాలనుకునే గంట ముందు ప్రాసెస్​ స్టార్ట్ చేయాలి. ముందుగా స్టౌవ్ వెలిగించి పాలను వేడి చేయాలి. అవి పొంగు వచ్చిన తర్వాత కాస్త మరగినిచ్చి స్టౌవ్ ఆపేయాలి. ఆలోపు ఖర్జూరాలను మధ్యలో కోసి గింజలు తీసేయండి. ఇలా రెడీ చేసుకున్న ఖర్జారాలను వేడిపాలల్లో వేసి గంట నానబెట్టండి. ఇలా చేయడం వల్ల డేట్స్ చాలా స్మూత్​గా మారుతాయి. ఖర్జూరాలు గంట నానిన తర్వాత పాలతో సహా వాటిని మిక్సీ జార్​లో వేసి మెత్తని పేస్ట్​గా చేయాలి. ఎంత మెత్తగా ఉంటే అంత మంచింది. 

ఇలా తయారు చేసిన ఖర్జూరాల పేస్ట్​ని ఓ గిన్నెలోకి తీసుకోండి. దానిలో వెజిటేబుల్ ఆయిల్ వేసి బాగా కలపండి. ఇప్పుడు మరో గిన్నె తీసుకుని దానిలో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. పిండి బాగా కలిసిన తర్వాత ఖర్జూర మిశ్రమాన్ని వేసి బాగా కలపండి. పిండిని ఎంత బాగా కలిపితే కేక్ అంత మంచిగా వస్తుంది. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని కేక్ టిన్​కు బదిలీ చేయండి. మీరు ఇదే కొలతలు తీసుకుంటే 6 అంగుళాల టిన్​లోకి ఈ మిశ్రమాన్ని బదిలీ చేయాలి. బదిలి చేసే ముందు టిన్​కి బటర్ పూయండి. లేదంటే బటర్ పేపర్​ అడుగున వేయండి. కేక్ టాప్​ను ముందుగానే తురుమి పెట్టుకున్న వాల్​నట్స్​తో గార్నిష్ చేయండి. 

ఓవెన్​లో 180 డిగ్రీల వద్ద సుమారు 50 నిమిషాలు దీనిని బేక్ చేయండి. కేక్ రెడీ అయిందో లేదో టూత్​ పిక్​ని ఉపయోగించి తెలుసుకోవచ్చు. టూత్​ పిక్​ని కేక్​లో గుచ్చితే పిండి అంటకుండా బయటకు వచ్చేస్తే కేక్ రెడీ అయినట్లు. టూత్​పిక్​కి కేక్ మిశ్రమం అంటుకుంటే దానిని మరికొంత సేపు బేక్ చేయాలని అర్థం. అంతే వేడివేడిగా మీ డేట్స్-వాల్​నట్​ కేక్ రెడీ. దీనిని పెద్దల నుంచి పిల్లలవరకు అందరూ హాయిగా తినొచ్చు. పైగా ఇది ఎగ్​లెస్, షుగర్​ లెస్, మైదా లెస్ కేక్. కాబట్టి వెజిటేరియన్స్​కు కూడా ఈ కేక్ చాలా మంచి ఎంపిక. దీని టేస్ట్ చూస్తే మీరు లొట్టలేసుకుని తింటారు. అంత రుచికరంగా దీని రుచి ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.

ఈ కేక్​లో అన్ని హెల్తీ ఫుడ్స్ మాత్రమే ఉపయోగిస్తాము కాబట్టి అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా దీనిని హాయిగా తినొచ్చు. పిల్లలకు కూడా మీరు హెల్తీగా కేక్​ను పెట్టినవారు అవుతారు. మధుమేహులు కూడా దీనిని తినొచ్చు. కానీ కాస్త తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం ఇంటిల్లీపాది హాయిగా లాగించగలిగే కేక్ రెసిపీ ఉన్నప్పుడు ఓ సారి ట్రై చేసి ఇంట్లో వారికి పెట్టేయండి.

Also Read : టేస్ట్ అదిరిపోయే కోడి పలావ్.. ఇంట్లో చేసుకోగలిగే రెసిపీ

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Scalp Oiling vs Hair Strand Oiling : స్కాల్ప్ ఆయిలింగ్ Vs జుట్టుకు నూనె.. జుట్టు పెరుగుదలకు, పోషణకు నూనె ఎలా రాస్తే మంచిది?
స్కాల్ప్ ఆయిలింగ్ Vs జుట్టుకు నూనె.. జుట్టు పెరుగుదలకు, పోషణకు నూనె ఎలా రాస్తే మంచిది?
Quitting Job in Midlife : 35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
35 ఏళ్లు దాటాక జాబ్ మానేయాలనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు ఆలోచించకపోతే భారీ నష్టం తప్పదు
Cumin Water : జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టాలంటే జీలకర్ర డ్రింక్ ట్రై చేయండి.. ఉదయాన్నే తాగితే ఎన్నో లాభాలు
Bedtime Foods : మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?
మంచి నిద్రకు బెస్ట్ ఫుడ్స్ ఇవే.. పడుకునే ముందు ఏం తినాలో, ఎంత తింటే మంచిదో తెలుసా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DSP Bheem Reddy Remand: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్ రెడ్డికి 14 రోజుల రిమాండ్‌, చంచల్‌గూడ జైలుకు తరలింపు
Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
దక్షిణ కొరియాలో లోకేష్ సెమీకండక్టర్ మిషన్.. విశాఖలో ₹468 కోట్లతో అపాక్ట్ యూనిట్‌కు నిర్ణయం
Modi Cabinet Expansion Postponed: మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
మోదీ క్యాబినెట్ విస్తరణకు బ్రేక్!? మంత్రి పదవుల కంటే రాజ్యాంగ సవరణ బిల్లులకే ప్రధాని తొలి ప్రాధాన్యత!
Ahmedabad Serial Blasts: అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసు.. 38 మందికి ఉరిశిక్ష విధించిన గుజరాత్ హైకోర్టు
Cristiano Ronaldo Retirement: స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఘోర పరాజయం.. కన్నీళ్లతో క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్ కెరీర్ క్లోజ్, సీమోన్ మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్!
Andhra Pradesh Zones: 2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
2 మల్టీ జోన్లు... 6 జోన్లు- 26 జిల్లాల ప్రకారం ఏపీలో ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు
Jangaon Crime News: నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
నగ్నంగా మహిళ ఇంట్లోకి ప్రవేశించిన కౌన్సిలర్.. నోరు మూసి అత్యాచారయత్నం! జనగామలో దారుణం
Pradhan Mantri Fasal Bima Yojana: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. పంట బీమా పథకాల అమలుకు ఉత్తర్వులు
Embed widget