అన్వేషించండి

Corona New Variant: విజృంభిస్తోన్న కరోనా కొత్త వేరియంట్ 'Eris'- లక్షణాలు ఎలా ఉంటాయంటే?

కరోనా కేసులు తగ్గిపోతున్నాయి ఇక రాదులే అని రిలాక్స్ అవుతున్నారా? జాగ్రత్త కొత్త వేరియంట్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది.

మూడేళ్ళ పాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా తగ్గిపోయిందని ఊపిరి పీల్చుకునే తరుణంలో ఏదో ఒక మూలం కొత్త వేరియంట్ కేసులు వెలుగులోకి వస్తూ కలవరపెడుతున్నాయి. తాజాగా EG.5.1 వేరియంట్‌కు మారుపేరు అయిన Eris తో కరోనా మళ్ళీ వార్తల్లోకి వచ్చింది. మునుపటి నివేదికలతో పోలిస్తే ఈ కొత్త వేరియంట్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. యూకేలో Eris కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తుందని అక్కడి హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏజెన్సీ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. జులై రెండో వారంలో 11.8 శాతం Eris కేసులు బయట పడ్డాయి.

ప్రజల ఆరోగ్యం కోసం అంతర్జాతీయ ప్రజారోగ్య పరిస్థితులని దృష్టిలో పెట్టుకుని 2023 మే 5న కోవిడ్ పెద్ద ముప్పుగా మిగిలిపోతుందని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక ప్రకారం XBB.1.5, XBB.1.16 పర్యవేక్షణలో ఏడు రకాలు (VUMలు) వేరియంట్లు ఉన్నాయి. వాటి ఉప వేరియంట్లు BA.2.75, CH.1.1, XBB, XBB.1.9.1, XBB.1.9.2, XBB.2.3, EG.5. WHO తాజా నివేదిక ప్రకారం EG.5 దాదాపు 45 దేశాల్లో కనుగొనబడింది.

యూకేలో కేసుల పెరుగుదలకి కారణం ఏంటి?

కరోనా కొత్త వేరియంట్ ఎరిస్ వ్యాప్తి చెందటానికి “బార్బీ”, “ఓపెన్ హైమర్” సినిమా విడుదల అని అక్కడి మీడియా నివేదికలు వెల్లడిస్తున్నాయి. వీటి విడుదల కారణంగా ప్రజలు అధిక సంఖ్యలో ఒక చోట చేరడంతో కేసుల సంఖ్య పెరగడానికి దోహదపడుతుంది. చెడు వాతావరణం, రోగనిరోధక శక్తి క్షీణించడం కూడ కేసు పెరుగుదలకి ఇతర కారణాలుగా చెప్తున్నారు.

యూఎస్ లో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్

యూఎస్ సీడీసీ కోవిడ్ ట్రాకర్ నివేదిక ప్రకారం డిసెంబర్ నుంచి కరోనాతో ఆస్పత్రిలో చేరుతున్న వారి రేటులో 10 శాతం పెరుగుదల నమోదు చేసుకున్నాయి. కరోనా కారణంగా 8,035 మంది హాస్పిటల్ పాలయ్యారు. జూన్ నుంచి ఈ కేసులు పెరుగుదల ఎక్కువగా ఉన్నట్టు అక్కడి ఆరోగ్య ఏజెన్సీలు చెబుతున్నాయి. వేడి వాతావరణం కారణంగా ప్రజలు గాలి ప్రసరణ సరిగా లేని ఇంటి లోపల ఎక్కువగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. అటువంటి వాతావరణం వల్ల శ్వాసకోశ వైరస్లు వ్యాప్తి ఎక్కువగా ఉంది.

లక్షణాలలో తేడా ఉందా?

మునుపటి వేరియంట్లలో కనిపించే కోవిడ్ లక్షణాలే ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి. తలనొప్పి, జ్వరం, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. కరోనా వ్యాప్తి జరగకుండా ఉండటం కోసం చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, బయటకి వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం ముఖ్యం. అవసరం లేకపోతే రద్దీగా ఉండే ప్రదేశాలకి వెళ్లకపోవడమే మంచిది. ఇంటి లోపల వెంటిలేషన్ సరిగా ఉండేలా చూసుకోవాలి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: బంగాళాదుంపలు ఆరోగ్యకరమేనా? రోజూ తింటే ఏమవుతుంది?

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్

వీడియోలు

Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని
Ravichandran Ashwin Criticizes Gambhir | గంభీర్‌పై రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Varshini Gowda Biography & Remuneration | వర్షిణి గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
జీవితంలో మొదటి కారు కొనేవారికి మహీంద్రా XUV 3XO ఎందుకు ఉత్తమ ఎంపిక?, రూ.10 లక్షల్లో వచ్చేస్తుంది
రూ.10 లక్షల బడ్జెట్‌లో ఫస్ట్‌ కార్‌ కొనాలనుకుంటున్నారా? డిజైర్‌, నెక్సాన్‌, పంచ్‌, XUV 3XOలో బెస్ట్ ఛాయిస్ ఇదే!
AP Local Body Direct Elections: ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
ఏపీ స్థానిక సంస్థల్లో డైరెక్ట్ ఎలక్షన్స్? - క్యాంప్ రాజకీయాలకు చెక్ పెట్టేలా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్!
Chittoor Crime News: రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
రైలు కింద పడి ఎమ్మార్వో ఆత్మహత్య.. చిత్తూరు జిల్లాలో ఘటన- అంత కష్టం ఏమొచ్చిందో!
Embed widget