(Source: ECI/ABP News/ABP Majha)
Queensland Court: కక్కుర్తి జంట, కోర్టులోనే ఆ పని కానిచ్చేశారు.. తగిన శిక్షే పడింది!
ఎక్కడా చోటులేనట్లు ఆ జంట కోర్టులోనే లైంగిక చర్యకు పాల్పడ్డారు. ఇందుకు కోర్టు వారికి తగిన శిక్షే విధించింది.
‘కామాతురాణం నభయం, నలజ్జ’ చందంగా.. ఆ జంట ప్రవర్తించారు. కామంతో రగిలిపోతూ కోర్టులోనే ఆ పని కానిచ్చేశారు. కళ్లు మూసుకుని పాలు తాగుతున్న పిల్లిలా.. తమని ఎవరూ చూడటం లేదని వారు అనుకున్నారు. కానీ, వారి పాడుపని మొత్తం సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. సెక్యూరిటీ గార్డులు వారించినా వారు.. తమ పని ఆపలేదు. సుమారు మూడుసార్లు ఆ చర్యకు పాల్పడంతో సెక్యూరిటీ సిబ్బంది న్యాయమూర్తి ముందుకు తీసుకెళ్లి.. జరిగినదంతా చెప్పారు. ఇందుకు జడ్జి వారికి తగిన శిక్షే విధించారు.
ఆస్ట్రేలియాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయంగా మారింది. క్వీన్‌ల్యాండ్‌కు చెందిన 19 ఏళ్ల షమేకా జూలీ జూన్ 28, 2022న ఓ కేసు నిమిత్తం టూవూంబా మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లింది. బాయ్ ఫ్రెండ్ జేక్ జేమ్స్ క్విన్ (20) కూడా ఆమెకు తోడుగా వచ్చాడు. వారి కేసు హియరింగ్‌కు ఇంకా సమయం ఉండటంతో వారిద్దరు కోర్టు ప్రాంగణంలోనే జనాల్లేని చోట కూర్చున్నారు.
వారికి అక్కడ టైంపాస్ కాలేదో ఏమిటో.. ఒకరినొకరు ముద్దులు పెట్టుకోవడం ప్రారంభించారు. గాఢంగా ముద్దులు పెట్టుకోవడం మొదలుపెట్టారు. దీంతో వారిద్దరూ పరిసరాలను మరిచిపోయారు. జూలీ అతడిపై కూర్చొని లైంగిక చర్యకు పాల్పడింది. సీసీటీవీ కెమేరాలో వారి చర్యను చూసి షాకైన సెక్యురిటీ గార్డులు వెంటనే అక్కడికి వెళ్లి వార్నింగ్ ఇచ్చారు. వారు అలా పక్కకి వెళ్లారో లేదో.. మళ్లీ వారు సెక్స్ చేసుకోవడం మొదలుపెట్టారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది మరోసారి హెచ్చరించారు. కాసేపు బుద్ధిగానే కూర్చున్నట్లు కనిపించినా.. ఈ సారి రెట్టింపు ఉత్సాహంతో అక్కడే పనికానిచ్చేశారు. ఇక లాభం లేదనుకుని సెక్యూరిటీ గార్డులు వారిద్దరి విడివిడిగా కూర్చోబెట్టాడు.
ఈ ఘటనపై విచారణ జరిపిన కోర్టు.. వారి చర్యను చాలా సీరియస్‌గా తీసుకుంది. పోలీస్ ప్రాసిక్యూటర్ కామెరాన్ ప్రాన్సిన్.. జడ్జికి ఆ ఫూటేజ్ చూపించారు. దీంతో న్యాయమూర్తి ఆ జంటపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇద్దరూ చాలా అనుచితంగా ప్రవర్తించారంటూ చివాట్లు పెట్టారు. తమకు ఎలాంటి శిక్ష విధించవద్దని, ప్రస్తుతం తాను ఉద్యోగం కోసం రెండు ఇంటర్వ్యూలకు హాజరుకావల్సి ఉందని ఆమె ప్రియుడు వేడుకున్నాడు. మేజిస్ట్రేట్ క్లేర్ కెల్లీ స్పందిస్తూ.. కోర్టులో ఇలాంటివి జరగడం గురించి తాను ఎప్పుడూ వినలేదని, ఇది చాలా అగౌరవమైన చర్య అని తెలిపారు. ఇందుకు శిక్షగా ఇద్దరు 60 గంటలు సమాజ సేవ చేయాలంటూ శిక్ష విధించారు. వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారిపై కేసు నమోదు చేయలేదు. అయితే, పవిత్రమైన న్యాయస్థానంలో అలాంటి చర్యకు పాల్పడినందుకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై మీరు ఏమంటారు?
Also Read: ఈ వయస్సు వచ్చాక మగాళ్ల లైంగిక శక్తి మటాష్, ఇలా చేస్తే సేఫ్!
Also Read: ఎలోన్ మస్క్ తండ్రి వీర్యానికి అంత డిమాండా? 76 ఏళ్ల వయస్సులోనూ అదేపని!