News
News
X

మట్టి పాత్రల్లో వండుకొని తినండి - రుచికి రుచి,పైగా ఎంతో ఆరోగ్యం

మట్టి పాత్రలో వండే ఆహారం వల్ల శరీరానికి పోషకాలు పుష్కలంగా లభిస్తాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

FOLLOW US: 
Share:

కొన్నిసార్లు గతంలోకి వెళ్లడం కూడా ఎంతో మేలు చేస్తుంది. అలా గతంలోకి వెళ్లి కొన్ని జ్ఞాపకాలనే కాదు, అలవాట్లను కూడా మళ్లీ వర్తమానం లోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆహారం విషయంలో. పురాతన కాలంలో పాటించిన పద్ధతులు ఎంతో మంచివి. వాటిల్లో ఒకటి మట్టి పాత్రల్లో వండుకోవడం. మట్టి కుండల్లో ఆహారాన్ని వండి, వడ్డించినప్పుడు మంచి సువాసనలే కాదు, ఆరోగ్యం పై కూడా మంచి ప్రభావం చూపిస్తుంది.  ప్రస్తుతం కాలం మారిపోయి మట్టికుండల్లో వంట చేయడం అనేది పూర్తిగా పోయింది. నాన్ స్టిక్ పాత్రల యుగం నడుస్తోంది. దీంతో స్టైల్ గా కనిపించే నాన్ స్టిక్ పాత్రల్లోనే వండడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. అందులోనూ మట్టి కుండలు కింద పడితే విరిగిపోతాయి అనే భయం కూడా ఉంది. అలాంటి భయాలు ఏవి పెట్టుకోకుండా మట్టి కుండలో వండుకొని తినమని ప్రోత్సహిస్తున్నారు పోషకాహార నిపుణులు. అంతెందుకు రెస్టారెంట్లలో మామూలు బిర్యాని కన్నా హండీ బిర్యానీకి ఎక్కువ ధర చెల్లిస్తాం. హండీ బిర్యానీ అంటే మట్టి కుండలో వండే బిర్యాని అని అర్థం. అదే మట్టికుండను మనమే కొనుక్కొని ఇంట్లో వండుకుంటే సరిపోతుంది కదా. మట్టి కుండలో వండిన ఆహారాన్ని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.  వీటిలో తినడం వల్లే మన పూర్వీకులు అంత శక్తివంతంగా ఉన్నారు మరి. 

1. మట్టి కుండలో వండేటప్పుడు ఆహారంలో ఉండే పోషకాలు నశించవు. అదే అల్యూమినియం, స్టీల్ పాత్రలు ఉపయోగిస్తే చాలా మేరకు పోషకాలు నాశనం అవుతాయి. మట్టి కుండలో మాత్రం పోషకాలన్నీ ఆహారంలోనే పదిలంగా ఉంటాయి. 

2. మట్టి కుండలు ఆల్కలీన్ స్వభావం కలిగి ఉంటాయి. ఇది ఆహారంలోని ఆమ్లత్వంతో తటస్థీకరణ చెందుతుంది. దానివల్ల PH బ్యాలెన్స్ అవుతుంది . దీని వల్ల ఆరోగ్య పరంగా ఎలాంటి సమస్యలు రావు.

3. మట్టి కుండలు మొదట వాడడానికి ముందు నీటిలో పది గంటల పాటు ముంచి ఉంచాలి. ఆ తర్వాతే వండడం మొదలుపెట్టాలి. అలా చేయడంవల్ల నూనె ఎక్కువ వాడాల్సిన అవసరం ఉండదు. తక్కువ నూనెలోనే వంటలు రెడీ అయిపోతాయి. తక్కువ నూనె వేసి వండిన ఆహారం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

4. మట్టి పాత్రలో ఉండే ఆహారం రుచి అద్భుతంగా ఉంటుంది. ఒక భిన్నమైన వాసనను కలిగి ఉంటుంది. మట్టి కుండలో చేసిన టీ ఎంత టేస్టీగా ఉంటుందో అందరికీ తెలుసు. అలాగే కూరలు, బిర్యాని, పులావ్, మటన్, కిచిడి ఇవి కూడా చాలా రుచికరంగా వస్తాయి.

5. మట్టి కుండలో వండిన ఆహారం తినడం వల్ల జీర్ణ ప్రక్రియ కూడా సాఫీగా సాగుతుంది. ఎందుకంటే ఆహారంలో అన్ని రకాల పోషకాలు మంచి పరిమాణంలో లభిస్తాయి. ఇవి పొట్ట సమస్యలను దూరం చేస్తాయి. అజీర్ణం, గ్యాస్ సమస్య వంటివి రావు. మలబద్ధకం సమస్య కూడా దాదాపు రాదు. దీనివల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

6. నాన్ స్టిక్ పాన్లు, స్టీల్ పాత్రలతో పోలిస్తే మట్టికుండల ధర ఎక్కువేమీ కాదు. సామాన్యులు కొనే స్థాయిలోనే ఉంటాయి. కాబట్టి పరోక్షంగా ఆర్థికంగా కూడా మీకు ఎంతో కొంత మిగులుతుంది. 

Also read: కొవ్వు కరిగి బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజు ఉసిరి టీ తాగండి

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 09 Jan 2023 08:02 AM (IST) Tags: Earthen pots Mitti Barthan Health with Earthen pots Matti Pathra

సంబంధిత కథనాలు

Soya Beans: సోయాబీన్స్‌తో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చా? ఏ విధంగా తీసుకోవాలి?

Soya Beans: సోయాబీన్స్‌తో చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చా? ఏ విధంగా తీసుకోవాలి?

AP News : సైకిల్ పై దేశవ్యాప్తంగా యాత్ర - రూ. 10 లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్ !

AP News : సైకిల్ పై దేశవ్యాప్తంగా యాత్ర - రూ. 10 లక్షల సాయం ప్రకటించిన సీఎం జగన్ !

Weight Gain: బరువు పెరగాలా? అయితే ఈ ఆహారాలు మీ డైట్లో చేర్చుకోండి

Weight Gain: బరువు పెరగాలా? అయితే ఈ ఆహారాలు మీ డైట్లో చేర్చుకోండి

బ్రెయిన్ స్ట్రోక్ భయం వెంటాడుతోందా? మీ మొబైల్‌తో ఆ ముప్పును ముందే కనిపెట్టేయొచ్చు!

బ్రెయిన్ స్ట్రోక్ భయం వెంటాడుతోందా? మీ మొబైల్‌తో ఆ ముప్పును ముందే కనిపెట్టేయొచ్చు!

HeadPhones: హెడ్ ఫోన్స్ అధికంగా వాడుతున్నారా? అయితే మెదడు, గుండెకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు

HeadPhones: హెడ్ ఫోన్స్ అధికంగా వాడుతున్నారా? అయితే మెదడు, గుండెకు ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు

టాప్ స్టోరీస్

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?

Majilis Congress :  మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ -  వర్కవుట్ అవుతుందా ?

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Man Marries Triplets: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు- టైం టేబుల్‌ వేసుకొని భర్తతో కాపురం!

Man Marries Triplets: ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు- టైం టేబుల్‌ వేసుకొని భర్తతో కాపురం!