అన్వేషించండి

అంతరిక్షంలో సంతానోత్పత్తి సాధ్యమేనా? కోతులను స్పేస్‌లోకి పంపి మరీ ప్రయోగాలు - నెక్ట్స్ ఏంటీ?

భూమి మీద సంతానోత్పత్తి సాధ్యమే. మరి అంతరిక్షంలో అది సాధ్యమేనా? గురుత్వాకర్షణ లేని వాతావరణంలో సంభోగం సులభమేనా? అక్కడికి పంపే కోతులు.. పిల్లలకు జన్మనివ్వగలవా?

అంగారక గ్రహం, చంద్ర గ్రహం మీద మనుగడ సాగించడం సాధ్యమేనా అనే విషయం గురించి ప్రపంచంలో చాలా దేశాలు ప్రయోగాలు జరుపుతున్నాయి. చైనా ఈ మధ్య కాలంలో అంతరిక్ష పరిశోధనల్లో ఒక ముందుడుగు వెయ్యడానికి సిద్ధపడుతోంది. కోతుల మనుగడ అంతరిక్షంలో ఎలా ఉంటుంది? వాటిలో ప్రత్యుత్పత్తి సామర్థ్యం వంటివన్నీ అధ్యయనం చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు శాస్త్రవేత్తలు. అందుకు సంబంధించిన వివరాలు ఈ మధ్య వెలువరించారు. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

చైనా అంతరిక్షంలో కొత్త ప్రయోగాలు ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. కొత్తగా ఏర్పాటు చేసిన టియాంగాంగ్ అంతరిక్ష కేంద్రానికి కోతులను పంపాలని ప్రణాళికలు వేస్తోంది. అక్కడ జీరో గ్రావిటి వాతావరణంలో కోతులు ఎలా మనుగడ సాగిస్తాయి? పునరుత్పత్తి ఏవిధంగా ఉంటుంది వంటి విషయాల మీద పరిశోధనలు చెయ్యాలని యోచిస్తున్నట్టు సమాచారం. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ లో ప్రచురితమైన సమాచారం ప్రకారం ఇదివరకు అంతరిక్ష పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త జాంగ్ పర్యవేక్షణలో ఈ అతి పెద్ద మాడ్యూల్ నిర్వహించబోతున్నారట. ఈ మాడ్యూల్ ప్రధానంగా లైఫ్ సైన్సెస్ ప్రయోగాల కోసం ఉపయోగిస్తారు.

ముందుగా చేపలు, నత్తల వంటి చిన్నచిన్న జీవులను అధ్యయనానికి ఉపయోగించిన తర్వాత ఇప్పుడు ఎలుకలు, మాకాక్ (కోతులు)లతో అంతరిక్షంలో మనుగడ, పునరుత్పత్తి వంటి వాటిని పర్యవేక్షించడం కోసం ఈ ప్రయోగాలు నిర్వహిస్తారని జాంగ్ వివరించారు.  ఈ ప్రయోగాలు మైక్రోగ్రావిటితోపాటు ఇతర అంతరిక్ష వాతావరణ పరిస్థితుల్లో జీవుల మనుగడను అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయని అనుకుంటున్నారు.

ఎలుకల వంటి ప్రైమేట్స్ జీవులపై ఇటువంటి అధ్యయనాలు చెయ్యడంలో ఇంకా చాలా అడ్డంకులు అధిగమించాల్సి ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సోవియట్ పరిశోధకులు 18 రోజుల పాటు అంతరిక్ష ప్రయాణంలో ఎలుకలు శారీరకంగా ఎదురైన సవాళ్ళను అదిగమించి సంభోగించడాన్ని గమనించారు. కానీ వాటిలో ఒక్కటి కూడా గర్భం దాల్చిన దాఖలాలు లేవు. భూమికి తిరిగి వచ్చిన తర్వాత కూడా అవి పిల్లలను పుట్టించలేదు.

అంతరిక్షంలో లైఫ్ సైన్సెస్ కు చెందిన ప్రయోగాల విషయంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని, వ్యోమగాములు వాటికి ఆహారం అందించాలి, వాటి వ్యర్థాలను మేనేజ్ చెయ్యల్సి ఉంటుందని సింగువా విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్ ప్రొఫెసర్ కెహ్కూయ్ కీ తెలిపారు. గురుత్వాకర్షణ శక్తి లేకపోవడం వల్ల వృషణాలతోపాటు మరికొన్ని రిప్రొడక్టివ్ అవయవాలు దెబ్బతింటాయని, ఈ ప్రయోగంలో భాగం పంచుకున్న జంతువుల్లో గణనీయంగా సెక్స్ హార్మోన్లు తగ్గడానికి కారణం అవుతుందని భూమి మీద జరిపిన కొన్ని ప్రయోగాలు రుజువు చేశాయి. 

చంద్రుడు, అంగారక గ్రహాల మీద మనుగడ గురించి ప్రపంచంలో చాలా దేశాలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ఈ తరుణంలో మనుషులతో సారూప్యం కలిగిన కోతుల వంటి పెద్ద జంతువుల ప్రవర్తన అంతరిక్షంలో ఎలా ఉంటుందో నిర్ధారించే ఈ ప్రయోగాలు చాలా అవసరం అని కీ పేర్కొన్నారు. మరి, కోతులు.. సక్సెస్ ఫుల్‌గా అంతరిక్షంలో తమ లైంగిక జీవితాన్ని ఎంజాయ్ చేసి.. పండంటి బిడ్డతో తిరిగి వస్తాయో లేదో చూడాలి. మరి, అక్కడ ఆ ప్రయోగం విజయవంతమైతే.. తర్వాత ఏమిటనేది చైనా ఇంకా వెల్లడించలేదు. 

Also Read: పురుషత్వానికి సవాల్, స్పెర్మ్ కౌంట్ భారీగా పతనం - షాకింగ్ న్యూస్ చెప్పిన కొత్త అధ్యయనం

టాప్ హెడ్ లైన్స్

Omelette Curry : 5 నిమిషాల్లో చేసుకోగలిగే ఆమ్లెట్ కర్రీ.. టేస్టీగా చేసుకోగలిగే సింపుల్ రెసిపీ ఇదే
5 నిమిషాల్లో చేసుకోగలిగే ఆమ్లెట్ కర్రీ.. టేస్టీగా చేసుకోగలిగే సింపుల్ రెసిపీ ఇదే
Heart Attack vs Cardiac Arrest : గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, అయోర్టిక్ డిసెక్షన్.. మూడింటి తేడాలివే, ఏది ఎక్కువ ప్రమాదం?
గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్, అయోర్టిక్ డిసెక్షన్.. మూడింటి తేడాలివే, ఏది ఎక్కువ ప్రమాదం?
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
Ginger Turmeric Tea : వాతావరణం మారితే అల్లం-పసుపు టీ తాగండి.. మిరియాలు కూడా వేసి రోజూ తాగితే కలిగే లాభాలివే
వాతావరణం మారితే అల్లం-పసుపు టీ తాగండి.. మిరియాలు కూడా వేసి రోజూ తాగితే కలిగే లాభాలివే

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Human Trafficking Case: బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు మానవ అక్రమ రవాణా.. 9 మందికి NIA కోర్టు జీవిత ఖైదు
AP Congress : ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
ఏపీ కాంగ్రెస్ ఆపరేషన్ రీ-ఎంట్రీ - రఘువీరారెడ్డి సారథ్యంలో హైపవర్ కమిటీ! స్థానిక పోరులో మార్పు సాధ్యమేనా?
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
భారత్‌లో iPhone 18 సేల్స్ ప్రారంభం.. అర్ధరాత్రి నుంచే యాపిల్ సెంటర్ల వద్ద భారీ క్యూ లైన్లు
Irumudi OTT : థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి ఇరుముడి - 250 కోట్ల కలెక్షన్స్... ఎందుకు ఈ మూవీ చూడాలంటే?
Hyderabad Crime News: వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
వనస్థలిపురంలో దారుణం.. కత్తితో నరికి పాల వ్యాపారిని హత్య చేసిన దుండగులు
యువతకు నచ్చేలా అపాచీ, రోనిన్‌లో కొత్త టెక్నాలజీ ఫీచర్లు.. ధరలు ఎంతంటే?
యూత్‌ఫుల్‌ Apache, Ronin బైకుల్లో కొత్త వేరియంట్లు, కొత్త టెక్నాలజీ
Laptop Keyboard Cleaning : ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
ల్యాప్‌టాప్ కీబోర్డ్ క్లీన్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన TTD!
శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కొబ్బరి పీచు ఉందంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించిన TTD!
Embed widget