అన్వేషించండి

Chicken Pulao: కుక్కర్‌లో సులువుగా ఇలా చికెన్ పులావ్ చేసేయండి, అదిరిపోతుంది

కుక్కర్లో చికెన్ పులావ్ వండడం చాలా సులువు.

కొత్తగా వంట చేసే వారికి సింపుల్‌గా చికెన్ పలావ్ చేసేయచ్చు. దీన్ని త్వరగా వండేయచ్చు, పైగా సులువుగా అయిపోతుంది. రుచిలో బిర్యానీతో పోటీ పడేలా ఉంటుంది. చిన్న పిల్లలకు కూడా ఇది బాగా నచ్చేస్తుంది. దీన్ని స్పైసీగా వండుకుంటే పెద్ద వాళ్లకు కూడా నచ్చుతుంది. దీన్ని ఎలా చేయాలో ఓసారి చూడండి. 

కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం - ఒక కప్పు
చికెన్ - పాలు కిలో
లవంగాలు - అయిదు
బిర్యానీ ఆకు - రెండు
ఉల్లిపాయ - ఒకటి
యాలకులు - నాలుగు
షాజీరా - అర స్పూను
దాల్చిన చెక్క - చిన్న ముక్క
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
పసుపు - పావు స్పూను
కారం - ఒక స్పూను
గరం మసాలా - ఒక స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
టమోటా - ఒకటి
నీళ్లు - సరిపడా
కొత్తి మీర తరుగు - రెండు స్పూన్లు
పెరుగు - పావు కప్పు
పుదీనా  తరుగు - రెండు స్పూన్లు
పచ్చిమిర్చి - రెండు

తయారీ ఇలా
ముందుగా బియ్యాన్ని అరగంట ముందే నానబెట్టాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఆయిల్ వేయాలి. ఆ నూనెలో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క షాజీరా, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయలను సన్నగా, నిలువుగా తరిగి నూనెలో వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేసి కలపాలి. తరువాత కారం, పసుపు, గరం మసాలా, టమోటా తరుగు వేసి బాగా కలపాలి. అవి వేగాక చికెన్ ముక్కలను వేయాలి. అయిదు నిమిషాల పాటూ చికెన్ ముక్కలను వేసి ఉడకించాలి.అందులో ముందుగా నానబెట్టిన బియ్యాన్ని వేయాలి. బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లను వేయాలి. అలాగే పెరుగు, పచ్చిమిర్చి, పుదీనా తరుగు, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. తరువాత అరగంట పాటూ వదిలేయండి. తరువాత మూత తీసి కలపాలి. చికెన్ పులావ్ రెడీ అయినట్టే. 

 చికెన్ పులావ్‌లో మాంసం ముక్కలను నీటిలో ఉడికిస్తాం. కాబట్టి తింటే మంచిదే. ఎందుకంటే చికెన్ వేపుడు కన్నా, ఇలా ఉడికించిన చికెన్ తినడం ఆరోగ్యకరం. నూనెలో వండిన వేయించిన చికెన్ ఆరోగ్యానికి హానికరం. కాబట్టి ఉడికించిన తినడమే మంచిది. చికెన్ కర్రీ, బిర్యానీలలో చికెన్ ను నీటిలో ఉడికిస్తే ఎంతో మంచిది. అన్ని రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. చికెన్ లో ప్రొటీన్ చాలా అవసరం. ఇది ఎముకలకు బలాన్ని అందిస్తుంది. శరీరానికి శక్తినిచ్చే విటమిన్ బి6, విటమిన్ బి12, జింక్, ఇనుము వంటివి దీనిలో పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి.  

Also read: ఆ నది నిండా బంగారమే, గుప్పెడు ఇసుకలోను ఎంతో కొంత బంగారం దొరికే ఛాన్స్

Also read: జ్ఞాపకశక్తిని పెంచే అద్భుత ఆయుర్వేద మూలిక ఇదే, పిల్లలకు తినిపిస్తే చదువులో దూసుకెళ్తారు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
Hair Oiling Tips : జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలంటే.. ఈ నూనెలను ట్రై చేయండి
Bugs in Rice : బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
బియ్యంలో పురుగులు ఉన్నాయా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి, పోవడమే కాకుండా మళ్లీ రావు
Room Fresheners : రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
రూమ్ ఫ్రెషనర్లు వాడుతున్నారా? ఆరోగ్యానికి ఎంతవరకు సేఫ్.. నిపుణులు ఏం చెబుతున్నారంటే

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
20-08-2026 గురువారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలాలు!
Japanese Beauty Tips : జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
జపనీస్ స్కిన్‌కేర్ సీక్రెట్స్.. మెరిసే, Glossy Skin కావాలంటే ఈ రొటీన్ ఫాలో అయిపోండి
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Embed widget