అన్వేషించండి

Diabetes: పొట్టిగా ఉండే వారికి మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువా?

Diabetes: మధుమేహం చాప కింద నీరులా పాకేస్తోంది, ఎంతోమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు.

Diabetes: ప్రపంచంలోని ఎంతో మంది శాస్త్రవేత్తలు మధుమేహంపై అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. కొత్త విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు జర్మనీ చేసిన అధ్యయనంలో మధుమేహం వచ్చే అవకాశం పొట్టిగా ఉండే వారిలో ఎక్కువని తేలింది. ఎత్తుగా ఉండే వారితో పోలిస్తే పొట్టిగా ఉండేవారు త్వరగా షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు ఉన్నట్టు ఆ కొత్త అధ్యయనంలో తెలిసింది. ఎత్తు తక్కువగా ఉన్న మగవారికి 41 శాతం మధుమేహం వచ్చే అవకాశాలు పెరిగితే, ఆడవారికి 33 శాతం వరకు పెరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. మధుమేహానికి, ఎత్తుకు సంబంధం ఏమిటో కూడా వివరిస్తున్నారు.

ఎత్తు తక్కువగా ఉండే వారిలో కాలేయం కొవ్వును అధికంగా స్టోర్ చేస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, శరీరంలో వాపు, జీవక్రియ సంబంధ జబ్బులు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మధుమేహంతో సంబంధం కలిగినవే. కాలేయంలో కొవ్వు పెరిగే కొద్దీ మధుమేహం వచ్చే అవకాశం పెరుగుతూ ఉంటుంది. శరీరం చిన్నగా ఉండే వారిలో జీవక్రియల్లో మార్పులు అధికంగా ఉంటాయి. ఆ మార్పుల వల్లే ఇలాంటి రోగాలు వచ్చే అవకాశం పెరుగుతుంది. పొడవుగా ఉన్న వారిలో కాలేయంలో కొవ్వు స్థాయిలు తక్కువగా ఉంటాయి. కాలేయంలో కొవ్వు పేరుకు పోవడం అనేది నెమ్మదిగా జరుగుతుంది. అందుకే అలాంటి వారికి మధుమేహం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని చెబుతోంది ఈ కొత్త అధ్యయనం.

డయాబెటిస్ అనేది ఒక్కసారి వచ్చిందంటే... జీవితాంతం కొనసాగే ఒక అనారోగ్య సమస్య. ఇది ఎప్పుడైనా, ఎవరికైనా రావచ్చు. ప్రతి ఏటా 10 లక్షల మంది కేవలం ఈ మధుమేహం కారణంగా వచ్చే అనారోగ్యాల వల్లే మరణిస్తున్నారు. రక్త ప్రవాహంలో చక్కెర శాతం పెరిగిపోవడమే ఈ మధుమేహానికి కారణం. ఇది అదుపులో లేకపోతే గుండెపోటు, మూత్రపిండాలు ఫెయిల్ అవ్వడం, బ్రెయిన్ స్ట్రోక్, కళ్ళు కనిపించకపోవడం వంటి సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు పాదాలు, కాళ్లు కూడా తొలగించాల్సి రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 42 కోట్ల మందికి పైగా మధుమేహం ఉందని అంచనా. 40 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఈ సంఖ్య ఇప్పుడు నాలుగు రెట్లకు పెరిగింది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లే మధుమేహం బాధితులను పెంచుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.

మనం తిన్న ఆహారం శరీరంలోకి చేరాక కొంత చక్కెరగా మారుతుంది. దీన్నే గ్లూకోజ్ అని కూడా పిలుస్తారు. ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ అనే హార్మోను ఉత్పత్తి అవుతుంది. ఇది శక్తిగా మార్చే ప్రక్రియలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుందో... అప్పుడు చక్కెర శక్తిగా మారకుండా రక్తంలో పేరుకుపోతుంది. ఇదే మధుమేహ వ్యాధికి కారణం అవుతుంది. మధుమేహంలో టైప్1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్, జెస్టేషనల్ డయాబెటిస్ అని మూడు రకాలు ఉన్నాయి. టైప్ 1 డయాబెటిస్ పుట్టుకతోనే వచ్చేది లేదా పిల్లల్లో కనిపించేది. ఇక టైప్ 2 డయాబెటిస్ పెద్దవారిలో ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. జెస్టేషనల్ డయాబెటిస్ అనేది గర్భంతో ఉన్న సమయంలో మహిళలకు వచ్చే వ్యాధి.

దాహం వేయడం, ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లడం, ప్రత్యేకంగా రాత్రిపూట రెండు కన్నా ఎక్కువసార్లు మూత్ర విసర్జనకు వెళ్లడం, తీవ్రంగా అలసిపోయినట్టు అనిపించడం, బరువు తగ్గుతూ ఉండడం, నోట్లో పుండ్లు రావడం, చూపు అ స్పష్టంగా మారడం, శరీరం మీద తగిలిన గాయాలు త్వరగా మానకపోవడం... అనేవి డయాబెటిస్ లక్షణాలుగా చెప్పుకుంటారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TS Inter Supplementary Exam Date 2026: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రకియ వివరాలు
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రకియ వివరాలు
AP Matsyakara Bharosa 2026: మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థిక సాయం.. మత్స్యకార భరోసా పథకం అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే
మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థిక సాయం.. మత్స్యకార భరోసా పథకం అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే
Asha Bhosle Net Worth: సింగర్ మాత్రమే కాదు.. బిజినెస్ ద్వారా ఆశా భోంస్లేకు భారీగా ఆధాయం.. ఆమె ఆస్తుల విలువ ఎంతంటే
సింగర్ మాత్రమే కాదు.. బిజినెస్ ద్వారా ఆశా భోంస్లేకు భారీగా ఆధాయం.. ఆమె ఆస్తుల విలువ ఎంతంటే
Hyderabad ATM Scam: హైదరాబాద్‌లో ఏటీఎంలో పెట్టాల్సిన 1.2 కోట్ల నగదు మాయం, పరారీలో ఇద్దరు ఉద్యోగులు!
హైదరాబాద్‌లో ఏటీఎంలో పెట్టాల్సిన 1.2 కోట్ల నగదు మాయం, పరారీలో ఇద్దరు ఉద్యోగులు!

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TS Inter Supplementary Exam Date 2026: తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రకియ వివరాలు
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలు వచ్చేసింది.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రకియ వివరాలు
AP Matsyakara Bharosa 2026: మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థిక సాయం.. మత్స్యకార భరోసా పథకం అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే
మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థిక సాయం.. మత్స్యకార భరోసా పథకం అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే
Asha Bhosle Net Worth: సింగర్ మాత్రమే కాదు.. బిజినెస్ ద్వారా ఆశా భోంస్లేకు భారీగా ఆధాయం.. ఆమె ఆస్తుల విలువ ఎంతంటే
సింగర్ మాత్రమే కాదు.. బిజినెస్ ద్వారా ఆశా భోంస్లేకు భారీగా ఆధాయం.. ఆమె ఆస్తుల విలువ ఎంతంటే
Hyderabad ATM Scam: హైదరాబాద్‌లో ఏటీఎంలో పెట్టాల్సిన 1.2 కోట్ల నగదు మాయం, పరారీలో ఇద్దరు ఉద్యోగులు!
హైదరాబాద్‌లో ఏటీఎంలో పెట్టాల్సిన 1.2 కోట్ల నగదు మాయం, పరారీలో ఇద్దరు ఉద్యోగులు!
Nitish Rana Fined: ప్లేయింగ్ 11లో లేకున్నా నితీష్ రాణాకు భారీ జరిమానా, BCCI నిర్ణయానికి రీజన్ ఏంటి?
ప్లేయింగ్ 11లో లేకున్నా నితీష్ రాణాకు భారీ జరిమానా, BCCI నిర్ణయానికి రీజన్ ఏంటి?
TS Inter 1st Year Results 2026: తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్‌లో 66.20 శాతం విద్యార్థులు పాస్.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణలో ఇంటర్ ఫస్టియర్‌లో 66.20 శాతం విద్యార్థులు పాస్.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
US Iran Peace Talks: అమెరికా, ఇరాన్ చర్చలు విఫలం.. ఇస్లామాబాద్ నుంచి మధ్యలోనే తిరిగి వెళ్తున్న జేడీ వాన్స్ టీం
అమెరికా, ఇరాన్ చర్చలు విఫలం.. ఇస్లామాబాద్ నుంచి మధ్యలోనే తిరిగి వెళ్తున్న జేడీ వాన్స్ టీం
Jana Nayagan : విజయ్ జన నాయగన్ లీక్ - సెన్సార్ బోర్డ్ రియాక్షన్ ఇదే...
విజయ్ జన నాయగన్ లీక్ - సెన్సార్ బోర్డ్ రియాక్షన్ ఇదే...
Embed widget