UPSC: ఈపీఎఫ్‌వోలో 323 పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
UPSC EPFO Recruitment: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది.
![UPSC: ఈపీఎఫ్‌వోలో 323 పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం union public service commission has released notification for the recruitment of 323 posts in epfo check vacancies details here UPSC: ఈపీఎఫ్‌వోలో 323 పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/13/a2df690bbb2dc80c43833cdc157a1b2c1710337212900522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
UPSC EPFO Recruitment: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 323 పర్సనల్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీ (ఇంగ్లిష్ లేదా హిందీ) నైపుణ్యం కలిగిన వారు దరఖాస్తు చేసుకవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 27 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. రిక్రూట్‌మెంట్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 323
* పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు
రిజర్వేషన్ కేటగిరీ: యూఆర్- 132, ఈడబ్ల్యూఎస్- 32, ఓబీసీ- 87, ఎస్సీ- 48, ఎస్టీ- 24.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు స్టెనోగ్రఫీ (ఇంగ్లిష్ లేదా హిందీ) నైపుణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి: కనిష్ఠంగా 18 సంవత్సరాలు; గరిష్ఠంగా యూఆర్/ ఈడబ్ల్యూఎస్‌లకు 30 సంవత్సరాలు, ఓబీసీలకు 33 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీలకు 35 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీలకు 40 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.25. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్షా విధానం:
➥ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
➥ అన్ని ప్రశ్నలకు సమాన మార్కులు ఉంటాయి.
➥ ఇంగ్లీషు భాషలోని ప్రశ్నలు మినహా ప్రశ్నపత్రం ఇంగ్లీష్ మరియు హిందీ మాధ్యమంలో ఉంటుంది.
➥ తప్పు సమాధానాలకు నెగిటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులలో 1/3 వంతు కోత ఉంటుంది. ఒక ప్రశ్నకు సమాధానం గుర్తించబడకపోతే, ఆ ప్రశ్నకు ఎటువంటి కోత ఉండదు.
➥ సమయం: పరీక్ష 2 గంటల పాటు ఉంటుంది.
సిలబస్:
➥ ఆంగ్ల భాష.
➥ జనరల్ అవేర్‌నెస్.
➥ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్.
➥ రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, అనంతపురం, హైదరాబాద్.
ముఖ్యమైన తేదీలు..
🔰 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27.03.2024.
🔰 దరఖాస్తు సవరణ తేదీలు: 28.03.2024 నుంచి 03.04.2024 వరకు.
🔰 రిక్రూట్‌మెంట్ టెస్ట్‌ల తేదీ: 07.07.2024.
ALSO READ:
నిరుద్యోగులకు అలర్ట్, రైల్వేల్లో 9,144 టెక్నీషియన్ పోస్టుల దరఖాస్తు ప్రారంభం - చివరితేది ఎప్పుడంటే?
RRB Technician Recruitment 2024: దేశవ్యాప్తంగా ఉన్న 21 రైల్వే రీజియన్ల పరిధిలో మొత్తం 9,144 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఫిబ్రవరి 17న సంక్షిప్త ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తిస్థాయి నోటిఫికేషన్ మార్చి 8న విడుదలకాగా.. మార్చి 9న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దీనిద్వారా అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్ రీజియన్ల పరిధిలోని ఖాళీలను భర్తీచేయనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)