అన్వేషించండి

TS DSC: ముగిసిన డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ, 2 లక్షలు కూడా దాటలేదు!

తెలంగాణలో డీఎస్సీ(టీఆర్‌టీ)-2023 ఆన్‌లైన్ దరఖాస్తు గడువు అక్టోబరు 28 అర్ధరాత్రితో ముగిసింది. చివరిరోజైన శనివారం ఉదయం కొంత సేపు సర్వర్‌ డౌన్‌ కావడంతో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు.

తెలంగాణలో డీఎస్సీ(టీఆర్‌టీ)-2023 ఆన్‌లైన్ దరఖాస్తు గడువు శనివారం(అక్టోబరు 28) అర్ధరాత్రితో ముగిసింది. చివరిరోజైన శనివారం ఉదయం కొంత సేపు సర్వర్‌ డౌన్‌ కావడంతో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. చివరికి గడువు ముగిసే సమయానికి మొత్తం 1,76,527 దరఖాస్తులు అందినట్లు అధికారులు ప్రకటించారు. వాస్తవానికి డీఎస్సీ దరఖాస్తు గడువు అక్టోబరు 21తో ముగియగా.. అభ్యర్థుల డిమాండ్‌ మేరకు అక్టోబర్‌ 28 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. నవంబరు 20 నుంచి 30 వరకు నిర్వహించాల్సి డీఎస్సీ పరీక్షలను ఎన్నికల కారణంగా ప్రభుత్వం వాయిదావేసిన సంగతి తెలిసిందే. పరీక్షలు వాయిదాపడటంతో.. దరఖాస్తు గడువును కూడా అధికారులు తాజాగా పొడిగించారు. 

దరఖాస్తు గడువు ముగిసే సమయానికి మొత్తంగా 1,79, 297 మంది ఫీజు చెల్లించగా, సాయంత్రం వరకు 1,76,527 లక్షల అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్  టీచర్స్(ఎస్‌జీటీ), పీఈటీ, భాషా పండితులు, తదితర పోస్టులు మొత్తం 43 విభాగాల్లో 5,089 కొలువుల భర్తీకి విద్యాశాఖ దరఖాస్తులు స్వీకరించింది. అత్యధికంగా ఎస్‌జీటీ తెలుగు మీడియం కోసం 60,190 మంది దరఖాస్తులు సమర్పించారు. అత్యల్పంగా లాంగ్వే్జ్ పండిట్ (ఉర్దూ) పోస్టులకు 328 దరఖాస్తులు మాత్రమే అందాయి. పరీక్షలను జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. 

2 లక్షలు దాటని దరఖాస్తులు..
డీఎస్సీ దరఖాస్తులు ఈసారి కనీసం రెండు లక్షలు కూడా దాటకపోవడం గమనార్హం. అదే గతంలోనైతే డీఎస్సీ అంటే భారీ స్థాయిలో దరఖాస్తులు వచ్చేవి. కానీ ఈసారి 5,089 పోస్టులు మాత్రమే ఉండడంతోపాటు ఎస్జీటీ పోస్టులకు బీఎడ్‌ అభ్యర్థులకు అర్హత లేకపోవడం లాంటి కారణాలతో ఈసారి దరఖాస్తు చేసుకునేవారి సంఖ్య చాలా తగ్గిందని అధికారులు చెబుతున్నారు.

తెలంగాణలోని ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సెప్టెంబరు 7న నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిద్వారా మొత్తం 5089 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో ఎస్‌జీటీ - 2,575 పోస్టులు; స్కూల్‌ అసిస్టెంట్‌ -1,739 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్ - 611 పోస్టులు, పీఈటీ - 164 పోస్టులు ఉన్నాయి. డీఎస్సీ ద్వారానే ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల్లో అత్యధికంగా హైదరాబాద్​ జిల్లాలో 358, నిజామాబాద్​ జిల్లాలో 309 ఖాళీలున్నాయి. పెద్దపల్లి జిల్లాలో అతి తక్కువగా 43, హన్మకొండలో 53 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. పాత ఉమ్మడి జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. 

పోస్టులవారీగా అందిన దరఖాస్తుల వివరాలు..

➥ ఎస్‌జీటీ తెలుగు మీడియం - 60,190

➥ ఎస్‌జీటీ ఇంగ్లిష్ మీడియం - 2,735

➥ ఎస్‌జీటీ ఉర్దూ - 3,004

➥ స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్ తెలుగు మీడియం) - 27,872

➥ స్కూల్ అసిస్టెంట్ (సోషల్ స్టడీస్ ఇంగ్లిష్ మీడియం) - 1,401

➥ స్కూల్ అసిస్టెంట్ (బయోలాజికల్ సైన్స్ తెలుగు మీడియం) - 22,531

➥ స్కూల్ అసిస్టెంట్ (బయోలాజికల్ సైన్స్ ఇంగ్లిష్ మీడియం) - 1,769

➥ స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమెటిక్స్ తెలుగు మీడియం) - 12,610

➥ స్కూల్ అసిస్టెంట్ (మ్యాథమెటిక్స్ ఇంగ్లిష్ మీడియం) - 1,927

➥ స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ సైన్సెస్ తెలుగు మీడియం) - 3,141

➥ స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్ తెలుగు మీడియం) - 1,619

➥ స్కూల్ అసిస్టెంట్ (తెలుగు) - 11,144

➥ స్కూల్ అసిస్టెంట్ (ఇంగ్లిష్) - 3,282

➥ స్కూల్ అసిస్టెంట్ (హిందీ) - 1,868

➥ లాంగ్వే్జ్ పండిట్ (తెలుగు)  -9,620

➥ లాంగ్వే్జ్ పండిట్ (హిందీ)  - 2,300

➥ లాంగ్వే్జ్ పండిట్ (ఉర్దూ)  - 328

➥ పీఈటీ (తెలుగు మీడియం) - 6,253

➥ ఇతర పోస్టులకు అందిన దరఖాస్తులు - 2933.

పరీక్ష స్వరూపం ఇలా..

➥ పరీక్షల తేదీలతోపాటు, పరీక్ష స్వరూపాన్ని కూడా విద్యాశాఖ వెల్లడించింది.  ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌, పీఈటీ పరీక్షలకు సంబంధించిన డిటైయిల్డ్‌ ఎగ్జామ్‌ ప్యాటర్న్‌ను విడుదల చేసింది. ఏయే సబ్జెక్టుల నుంచి ఎన్ని మార్కులు ఉంటాయనే వివరాలను తెలిపింది.

➥ ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 80 మార్కులు, 160 ప్రశ్నలకు గానూ పరీక్ష నిర్వహిస్తారు. మిగతా 20 మార్కులు టెట్‌లో వచ్చిన స్కోర్‌ను వెయిటేజీగా పరిగణిస్తారు. 

➥ పీఈటీ, పీఈడీ అభ్యర్థులకు మాత్రం 100 మార్కులు, 200 ప్రశ్నలతో ప్రశ్నపత్రం ఉండనుంది. 

Notification

TS DSC 2023 Details

Website

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

టాప్ హెడ్ లైన్స్

AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
ప్రధాని మోదీపై అభినందన తీర్మానం.. 12 అజెండా అంశాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Naman Dhir Debut Impact: న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
న‌మ‌న్ రాక‌తో ఆ ప్లేయ‌ర్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్..!! అరంగేట్రంలోనే 3 వికెట్లతో ధీర్ ప్రకంపనలు
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Embed widget