By: ABP Desam | Updated at : 14 Dec 2022 02:45 PM (IST)
Edited By: omeprakash
నర్సింగ్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్
నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మరో వారం రోజుల్లో 4 వేల నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ భావిస్తుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా వైద్యారోగ్యశాఖ సిద్ధం చేసింది. ఈ నోటిఫికేషన్ విడుదలకు ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆమోదం తెలిపారు.
పూర్తిగా రెగ్యులర్ విధానం..
తెలంగాణ మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి పూర్తిగా రెగ్యులర్ విధానంలో భర్తీ చేయనున్నట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రస్తుతం వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) పరిధిలో 4,400, తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో 700, ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో దాదాపు 1,600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు వీటిలో నాలుగు వేల పోస్టులకు పైనే భర్తీ చేయనున్నారు.
2017 నోటిఫకేషన్..
గతంలో 2017లో నర్సుల పోస్టుల భర్తీ జరిగింది. అప్పట్లో విడుదల చేసిన నోటిఫికేషన్‌లో వివిధ చిక్కులున్నాయని చాలా మంది గతంలో కోర్టులో కేసులు వేశారు. వైద్య,ఆరోగ్యశాఖకు కూడా చాలా ఫిర్యాదులు చేసారు. వాటిని పరిష్కరించి రిక్రూట్‌మెంట్ చేయడానికి ప్పభుత్వానికి ఐదేళ్ల సమయం పట్టింది. మొత్తానికి 2021లో సెలక్టైన నర్పులకు పోస్టింగ్ ఇచ్చారు. దీని తర్వాత ఇప్పటి వరకు రెగ్యులర్ విధానంలో నోటిఫికేషన్ విడుదల కాలేదు.
Also Read:
పాలిటెక్నిక్ కాలేజీల్లో 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, వివరాలు ఇలా!
తెలంగాణలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో పోస్టుల వివరాలు అందుబాటులో ఉంచింది. దీనిద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. 19 సబ్జెక్టుల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబర్ 14 నుంచి జనవరి 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో బ్యాచీలర్ డిగ్రీ (ఇంజినీరింగ్/ టెక్నాలజీ) అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏపీలో 1458 సీనియర్ రెసిడెంట్ పోస్టులు, అర్హతలివే!
ఏపీలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వ మెడికల్, డెంటల్ బోధనాస్పత్రుల్లో సీనియర్ రెసిడెంట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడదల చేసింది. దీని ద్వారా మొత్తం 1,458 పోస్టులను భర్తీ చేయనున్నారు. మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ(డీఎం/ ఎంసీహెచ్/ ఎండీ/ ఎంఎస్/ ఎండీఎస్) ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు డిసెంబరు 10లోగా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుచేసుకోవచ్చు.
నోటిపికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్, టీఎస్‌పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ - వివరాలు ఇలా!
తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో తీపి కబురు వినిపించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 18 డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ డిసెంబర్ 8న నోటిఫికేషన్ (నెం.21/2022) విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి డిసెంబర్ 16 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. జనవరి 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
TSPSC Group 4: 'గ్రూప్-4' ఉద్యోగాలకు 9.5 లక్షల దరఖాస్తులు, జులై 1న రాతపరీక్ష!
High Court JCJ Posts: తెలంగాణ హైకోర్టులో సివిల్ జడ్జి పోస్టులు, అర్హతలివే!
TSPSC Group4 Application: 8180 'గ్రూప్-4' ఉద్యోగాల దరఖాస్తుకు నేడే ఆఖరు, ఇప్పటికే 9 లక్షలు దాటిన దరఖాస్తుల సంఖ్య!
TSPSC: 'గ్రూప్-4' రాతపరీక్ష తేదీని వెల్లడించిన టీఎస్పీఎస్సీ! ఎగ్జామ్ ఎప్పుడంటే?
TSSPDCL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్- 1601 'కరెంటు' కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు
YS Viveka Murder case CBI: వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు - వారిద్దరిపై ఆరున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం !
Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!
MLAs Poaching Case : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకా ? సిట్ కా ? సోమవారం తీర్పు చెప్పనున్న హైకోర్టు !
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్