Police Recruitment: పోలీసు నియామకాల్లో ఎన్‌సీసీ కోటాపై హైకోర్టు కీలక తీర్పు, ఏమందంటే?
తెలంగాణలో స్టయిపెండరీ క్యాడెట్ ట్రైనీ, ఎస్‌ఐ, అగ్నిమాపకశాఖ, డిప్యూటీ జైలర్ తదితర పోస్టుల నియమాక ప్రక్రియలో ఎన్‌సీసీ కోటా నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను హైకోర్టు సమర్థించింది.
![Police Recruitment: పోలీసు నియామకాల్లో ఎన్‌సీసీ కోటాపై హైకోర్టు కీలక తీర్పు, ఏమందంటే? Telangana highcourt issued judgment on NCC quota police recruitment Police Recruitment: పోలీసు నియామకాల్లో ఎన్‌సీసీ కోటాపై హైకోర్టు కీలక తీర్పు, ఏమందంటే?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/03/00ca035b495e688507946c8283b55efd1691072234771522_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
High Court Judgement on Police Recruitment: తెలంగాణలో పోలీసు నియామకాలకు సంబంధించి హైకోర్టుల కీలక తీర్పు వెల్లడించింది. రాష్ట్రంలో స్టయిపెండరీ క్యాడెట్ ట్రైనీ, ఎస్‌ఐ, అగ్నిమాపకశాఖ, డిప్యూటీ జైలర్ తదితర పోస్టుల నియమాక ప్రక్రియలో ఎన్‌సీసీ కోటా నిబంధనలను సవరిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను హైకోర్టు సమర్థించింది. పోలీసు నియామకాల్లో NCC రిజర్వేషన్లను A, B, C సర్టిఫికెట్ల వారీగా కాకుండా అన్ని సర్టిఫికెట్లకు సమాన ప్రాధాన్యమిస్తూ 3 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.
NCCలో A, B, C సర్టిఫికెట్లను సమానంగా పరిగణిస్తూ ప్రభుత్వం జారీ చేసిన సవరణ జీవో 14ను సవాలు చేస్తూ ముగ్గులరు అభ్యర్థులు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది.
సుప్రీంకోర్టు వెలువరించిన పలు తీర్పుల ప్రకారం NCC సర్టిఫికెట్ ఉన్నవారి అర్హతను నిర్ణయించే అధికారం రిక్రూట్‌మెంట్ బోర్డుల పరిధిలో ఉంటుంది.
NCC రిజర్వేషన్ల అర్హతలపై ప్రత్యేక కేటగిరీ కింద పేర్కొంటూ నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నందున 2015 నాటి నియామక ప్రక్రియను పాటించలేదని పిటిషనర్లు అభ్యంతరం లేవనెత్తడం సరికాదని హైకోర్టు తెలిపింది. NCC 'C' సర్టిఫికెట్‌కు 'B' సర్టిఫికేట్ కంటే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని, అదేవిధంగా 'A' కంటే 'B'కి ప్రాధాన్యం ఇవ్వాలన్న కేంద్ర హోంశాఖ సర్క్యులర్ కేవలం సలహా మాత్రమే అని వెల్లడించింది. అయితే పిటిషనర్లు ప్రాథమిక, ఫిజికల్ ఈవెంట్ పరీక్షల్లో విఫలమైనట్లు తెలుసుకున్న తర్వాత దాఖలు చేసిన పిటిషన్లను తిరస్కరిస్తున్నామంటూ హైకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ALSO READ:
హోంగార్డు నియామకాలు చేపట్టండి, డీజీపీని ఆదేశించిన సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో వెంటనే హోంగార్డుల నియామకాలు (Home Guard Recruitment) చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీని ఆదేశించారు. హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక అవసరాలు తీరేలా చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు హోంగార్డుల సేవలు వినియోగించుకోవాలని సూచించారు. పోలీసు, వైద్యారోగ్యశాఖలో నియామకాలపై డిసెంబరు 15న సీఎం సమీక్ష నిర్వహించారు. పోలీసు నియామక ప్రక్రియ వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నియామకాలను పారదర్శకంగా, అవకతవకలు లేకుండా చేపట్టాలని సూచించారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..
టీఎస్‌పీఎస్‌సీ వైఫల్యాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)లో ప్రశ్నపత్రాల లీకేజీ సహా పోటీ పరీక్షల నిర్వహణలో వైఫల్యాలపై హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ చేయించనున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. ఇందుకోసం సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. శాసనసభలోని తన కార్యాలయంలో సీఎం గురువారం విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. TSPSC పేపర్ లీకేజీలు, పోటీ పరీక్ష నిర్వహణలో వైఫల్యాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరపాలన్నది తమ ప్రభుత్వ వైఖరి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)