Police Recruitment Cancel: ఒక్క తీర్పుతో 859 సబ్ ఇన్స్‌పెక్టర్ ఉద్యోగాలు పోయాయి - మరి పేపర్ కొని రాస్తే ఉంచుతారా ?
Police Recruitment Exam Cancel: రాజస్థాన్‌లో 859 సబ్ ఇన్స్ పెక్టర్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్‌లో భారీ స్కామ్ జరిగింది. హైకోర్టు ఈ నియామకాలను కొట్టివేసింది.

Rajasthan High Court cancels 2021 police recruitment exam: రాజస్థాన్ హైకోర్టు 2021 పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ పరీక్షను రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. పేపర్ లీక్ ఆరోపణలు , రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల ప్రమేయం కారణంగా ఈ పరీక్ష వివాదాస్పద అంశంగా మారింది. హైకోర్టులో కేసులు పడ్డాయి. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో అక్రమాలు, మోసాలు స్పష్టంగా కనిపించాయని రాజస్తాన్ హైకోర్టు నియామకాలను రద్దు చేసేసింది.
2021లో ఆర్‌పీఎస్‌సీ 859 సబ్-ఇన్‌స్పెక్టర్, ప్లాటూన్ కమాండర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అ పరీక్ష ప్రక్రియలో పేపర్ లీక్ ఆరోపణలు తలెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం దీనిని స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ కి విచారణ కోసం అప్పగించింది. విచారణలో 50 మందికి పైగా ట్రైనీ సబ్-ఇన్‌స్పెక్టర్లు , ఇతరులు అరెస్టయ్యారు. ఆర్‌పీఎస్‌సీ సభ్యులైన బాబూలాల్ కటారా, రాము రైకా ప్రమేయం కూడా బయటపడింది.
ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మొత్తం "కలుషితమైంది" అని హైకోర్టు తేల్చేసింది. దీనిని రద్దు చేయకపోతే రాష్ట్రంలో చట్టం , శాంతిభద్రతలపై తీవ్ర ప్రభావం పడవచ్చని తెలిపింది. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరుపై కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది . సుమోటోగా విచారణ చేయాలని కూడా నిర్ణయించింది. అక్రమాలు మరియు మోసాలు స్పష్టంగా కనిపించాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరం. ఈ తీర్పు యువత భవిష్యత్తుతో ఆడుకునే గ్యాంగ్‌లకు హెచ్చరికగా ఉంటుందని నిరుద్యోగులు సంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.
బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి డాక్టర్ కిరోడీ లాల్ మీనా ఈ తీర్పును స్వాగతించారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో భారీ మోసం జరిగింది. 500 మందికి పైగా అభ్యర్థులు మోసపూరిత మార్గాల ద్వారా ఉత్తీర్ణులయ్యారు. అలాంటి వారు సర్వీసులోకి వస్తే రాష్ట్రంలో చట్టం శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉండేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ హయాంలో ఈ పరీక్షను నిర్వహించారు. 2021లో రాష్ట్ర క్యాబినెట్ సబ్-కమిటీ తన నివేదికలో పరీక్షను రద్దు చేయవద్దని సిఫారసు చేసింది.
#WATCH | Jaipur: Rajasthan High Court cancels SI Recruitment 2021 amid collusion probe.
— ANI (@ANI) August 28, 2025
Petitioner Harendar Neel says, "... The court said that the paper was leaked on WhatsApp, social media, and even the Bluetooth gang was involved in it. The Court said that it would be… pic.twitter.com/Ba4y3LWJt1
రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పుపై చట్టపరమైన సలహా తీసుకుని భవిష్యత్ చర్యలను నిర్ణయించనుంది. ఈ తీర్పు రాజస్థాన్‌లో పరీక్షలలో జరుగుతున్న అక్రమాలను బయట పెట్టినట్లయింది. యువత భవిష్యత్తుతో ఆడుకునే పేపర్ లీక్ గ్యాంగ్‌లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసిందని అక్కడని నిరుద్యోగులు అంటన్నారు.





















