మధ్యప్రదేశ్‌లో మరో వ్యాపమ్ తరహా స్కామ్! ఒకే కేంద్రం నుంచి ఏడుగురు టాపర్లు!
ఇటీవల జరిగిన ఓ నియామక పరీక్షలో టాపర్లుగా నిలిచిన వారిలో ఏడుగురు ఒకే కేంద్రంలో పరీక్ష రాయడం అనుమానాలకు తావిస్తోంది ఒకే చోట పరీక్ష రాసిన దాదాపు 1,700 మంది అభ్యర్థుల్లో ఏడుగురు టాప్-10 జాబితాలో నిలిచారు

పదేళ్ల క్రితం మధ్యప్రదేశ్‌ను కుదిపేసిన వ్యాపమ్ తరహా కుంభకోణం మళ్లీ జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ నియామక పరీక్షలో టాపర్లుగా నిలిచిన వారిలో ఏడుగురు ఒకే కేంద్రంలో పరీక్ష రాయడం అనుమానాలకు తావిస్తోంది. అది స్థానిక భాజపా ఎమ్మెల్యేకు చెందిన కళాశాల కావడంతో మరింత వివాదాస్పదమైంది. మధ్యప్రదేశ్‌లో గ్రూప్-2, గ్రూప్-4 పట్వారీ పరీక్ష ఫలితాలను జూన్ 30న విడుదల చేశారు. ఆ తర్వాత మూడు రోజులకు టాపర్లుగా నిలిచిన 10 మంది జాబితాను విడుదల చేశారు. వారిలో ఏడుగురు గ్వాలియర్‌లోని ఎన్‌ఆర్‌ఐ కాలేజీలో ఈ పరీక్ష రాసినట్లు సమాచారం.
టాపర్లుగా నిలిచిన వారి రోల్ నంబర్లు 2488 7991 నుంచి 2488 9693 మధ్యే ఉన్నాయి. అంటే ఒకే చోట పరీక్ష రాసిన దాదాపు 1,700 మంది అభ్యర్థుల్లో ఏడుగురు టాప్-10 జాబితాలో నిలిచారు. వీరు జవాబు పత్రంలో హిందీలో సంతకం చేసి.. పరీక్ష మాత్రం ఆంగ్లంలో రాసినట్లు తెలిసిందని పలు మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో ఈ పరీక్ష నిర్వహణపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరీక్ష నిర్వహించిన సంస్థను కేంద్ర ప్రభుత్వం గతంలోనే బ్లాక్‌లిస్ట్ చేసినందనీ, అయినప్పటికీ మధ్యప్రదేశ్ ఎంప్లాయిస్ సెలక్షన్ బోర్డు.. పరీక్ష నిర్వహణ కోసం ఆ సంస్థకే టెండర్ అప్పగించినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
మరోవైపు టాపర్లు రాసిన పరీక్షా కేంద్రం భాజపా ఎమ్మెల్యే సంజీవ్ కుశ్వాహాకు చెందినదిగా తెలుస్తోంది. దీంతో ఇది రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. భాజపా హయాంలో మరోసారి వ్యాపమ్ కుంభకోణం జరిగిందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. 2013లో భాజపా హయాంలో చోటుచేసుకున్న వ్యాపమ్ కుంభకోణం సంచలనం సృష్టించింది. ఈ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన పలు నియామక పరీక్షల్లో రాజకీయ నాయకులు, అధికారులు డబ్బు కోసం అక్రమాలకు పాల్పడ్డారని బయటపడింది.
పదేళ్ల క్రితం ఇలాగే..
వ్యాపం కుంభకోణం 2013లో వెలుగులోకి వచ్చింది. వ్యాపం నిందితుల్లో అనేకమంది అనుమానాస్పద స్థితిలో చనిపోవటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మధ్యప్రదేశ్ వ్యవసాయిక్ పరీక్ష మండలి నిర్వహించిన ఉద్యోగ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని, ఫలితాల్ని తారుమారు చేసేందుకు..బీజేపీ నేతలకు పెద్ద మొత్తంలో డబ్బులు అందాయని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలకు సంబంధించి పోలీసులు 1000కిపైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేశారు. వివిధ కోర్టులో చార్జ్‌షీట్‌లు నమోదయ్యాయి.
ALSO READ:
టెన్త్' అర్హతతో 1558 ఉద్యోగాలు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది!
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జూన్ 30న విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్రప్రభుత్వ విభాగాల్లో 1558 మల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్), హవిల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పదోతరగతి లేదా తత్సమాన అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జూన్ 30 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 21లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఉద్యోగ ఎంపికలు చేపడతారు.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
డిగ్రీ కాలేజీల్లో 2,858 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు, వివరాలు ఇలా!
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఖాళీల భర్తీకి జులై 6న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 2,858 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నారు. వీటిలో కాంట్రాక్ట్ పద్ధతిలో 527 మంది లెక్చరర్ పోస్టులను, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో 341 పోస్టులను, హోనరేరియం కింద 50 టీఎస్‌కేసీ ఫుల్ టైమ్ మెంటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అదేవిధంగా 1,940 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను కూడా భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఈ పోస్టుల కాలపరిమితి వచ్చే ఏడాది మార్చి 31తో ముగియనుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial





















