NVS Recruitment: 1377 నవోదయ పోస్టుల దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
NVS: నవోదయ విద్యాలయాల్లో 1377 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును అధికారులు మరోసారి పొడిగించారు. దరఖాస్తు గడువు మే 7తో ముగియాల్సి ఉండగా.. మరోవారంపాటు పొడిగించింది.
NVS Non Teaching Application: నవోదయ విద్యాలయాల్లో 1377 నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును అధికారులు మరోసారి పొడిగించారు. దరఖాస్తు గడువు మే 7తో ముగియాల్సి ఉండగా.. మరోవారంపాటు పొడిగించింది. వాస్తవానికి ఏప్రిల్ 30తో గడువు ముగియగా.. మొదట మే 7 వరకు, ఆ తర్వాత రెండో మే 14 వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులు వెంటనే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. పోస్టులవారీగా విద్యార్హతలు, వయోపరిమితులు నిర్ణయించారు.
దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించి ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు రూ.1500; ఇతర పోస్టులకు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపురం, కర్నూలు; తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మంలో రాతపరీక్ష నిర్వహిస్తారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల హెడ్‌క్వార్టర్స్‌లలో, నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో 1,337 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో హెడ్‌క్వార్టర్స్‌లలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఆడిట్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్, లీగల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, మల్టీటాస్కింగ్ స్టాఫ్ పోస్టులను; నవోదయ విద్యాలయ కార్యాలయాల్లో స్టాఫ్ నర్స్(ఉమెన్), కేటరింగ్ సూపర్‌వైజర్, జూనియర్ సెక్రటేరియట్అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, ల్యాబ్ అటెండెంట్, మెస్ హెల్పర్ పోస్టులను భర్తీచేయనున్నారు.
పోస్టుల వివరాలు..
* నాన్-టీచింగ్ పోస్టులు
ఖాళీల సంఖ్య: 1377.
➥ స్టాఫ్ నర్స్ (ఫీమేల్): 121 పోస్టులు
➥ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్: 05 పోస్టులు
➥ ఆడిట్ అసిస్టెంట్: 12 పోస్టులు
➥ జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్: 04 పోస్టులు
➥ లీగల్ అసిస్టెంట్: 01 పోస్టు
➥ స్టెనోగ్రాఫర్: 23 పోస్టులు
➥ కంప్యూటర్ ఆపరేటర్: 02 పోస్టులు
➥ కేటరింగ్ సూపర్‌వైజర్: 78 పోస్టులు
➥ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(హెడ్‌క్వార్టర్స్/ప్రాంతీయ కార్యాలయాలు): 21 పోస్టులు
➥ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎన్‌వీ): 360 పోస్టులు
➥ ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్: 128 పోస్టులు
➥ ల్యాబ్ అటెండెంట్: 161 పోస్టులు
➥ మెస్ హెల్పర్: 442 పోస్టులు
➥ మల్టీటాస్కింగ్ స్టాఫ్: 19 పోస్టులు
అర్హతలు: పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. పోస్టుల ఆధారంగా డిగ్రీ, పీజీ డిగ్రీ, ఇంటర్, పదోతరగతి అర్హత ఉండాలి.
వయోసడలింపు: ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; దివ్యాంగులకు కేటగిరీలవారీగా 10-15 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది. నవోదయ విద్యాలయ సమితిలో ఉద్యోగులకు నిబంధనల మేరకు వయోసడలింపు వర్తిస్తుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించి ఫిమేల్ స్టాఫ్ నర్స్ పోస్టులకు రూ.1500; ఇతర పోస్టులకు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఏపీలో విజయవాడ, విశాఖపట్నం విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కాకినాడ, అనంతపురం, కర్నూలు; తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం.