IIIT Pune: ట్రిపుల్ ఐటీ పూణెలో నాన్ టీచింగ్ పోస్టులు - పూర్తి వివరాలు ఇవే!
IIITP Recruitment: పూణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) ఒప్పంద ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
![IIIT Pune: ట్రిపుల్ ఐటీ పూణెలో నాన్ టీచింగ్ పోస్టులు - పూర్తి వివరాలు ఇవే! indian institute of information technology pune has released notification for the recruitment of non teaching posts IIIT Pune: ట్రిపుల్ ఐటీ పూణెలో నాన్ టీచింగ్ పోస్టులు - పూర్తి వివరాలు ఇవే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/27/2620420362bdad060eb0f612c59ba80d1708999547499522_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IIITP Recruitment: పూణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ) ఒప్పంద ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 15 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి పీజీ, డిప్లొమా, డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), బ్యాచిలర్ డిగ్రీ(ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) లేదా ఐటీఐ, డిగ్రీ(లైబ్రరీ సైన్స్), బీపీఈడీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతున్నవారు మార్చి 18 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 15
* నాన్ టీచింగ్ పోస్టులు
గ్రూప్-ఎ పోస్టులు..
⏩ అసిస్టెంట్ రిజిస్టర్: 02 పోస్టులు
అర్హత: కనీసం 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా తత్సమానంతో పాటు మంచి అకడమిక్ రికార్డు, పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 45 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.56,100-రూ.1,77,500.
గ్రూప్-బి పోస్టులు..
⏩ జూనియర్ సుపరింటెండెంట్: 04 పోస్టులు
అర్హత: ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు 6 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.35,400-రూ.1,12,400.
⏩ ఫిజికల్ ట్రైనింగ్ కమ్ యోగా ఇన్‌స్ట్రక్టర్: 01 పోస్టు
అర్హత: బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌తో గ్రాడ్యుయేట్(బీపీఈడీ) ఉత్తీర్ణతతో పాటు 3 సంవత్సరాల పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.35,400-రూ.1,12,400.
గ్రూప్-సి పోస్టులు..
⏩ జూనియర్ టెక్నిషియన్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్): 01 పోస్టు
అర్హత: డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ(కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లేదా ఐటీఐతో పాటు 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.21,700-రూ.69,100.
⏩ జూనియర్ టెక్నిషియన్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్): 01 పోస్టు
అర్హత: డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ(ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్/ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) లేదా ఐటీఐతో పాటు 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.21,700-రూ.69,100.
⏩ జూనియర్ అసిస్టెంట్: 05 పోస్టులు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ ఆపరేషన్స్‌పై పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి: 27 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.21,700-రూ.69,100.
⏩ జూనియర్ టెక్నిషియన్ (లైబ్రరీ): 01 పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీతో పాటు డిప్లొమా(లైబ్రరీ సైన్స్) లేదా లైబ్రరీ సైన్స్‌లో 3 సంవత్సరాల డిగ్రీ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 27 సంవత్సరాలు మించకూడదు.
జీతం: రూ.21,700-రూ.69,100.
దరఖాస్తు ఫీజు: గ్రూప్-ఎ: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1180, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.590. గ్రూప్-బి అండ్ గ్రూప్-సి: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.590, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.295.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Director,
Indian Institute of Information Technology (IIIT), Pune
Survey No. 9/1/3, Ambegaon Budruk,
Sinhgad Institute Road,
Pune – 411041, Maharashtra.
దరఖాస్తుకు జతచేయవల్సిన సర్టిఫికెట్లు..
➥ 10వ తరగతి సర్టిఫికెట్ కాపీ.
➥ 12వ తరగతి సర్టిఫికెట్ కాపీ.
➥ అన్ని సంవత్సరాలు/సెమిస్టర్‌లకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ డిగ్రీ సర్టిఫికేట్ & మార్క్-షీట్‌లు.
➥ అన్ని సంవత్సరాలు/సెమిస్టర్‌లకు సంబంధించిన పీజీ సర్టిఫికేట్ & మార్క్-షీట్‌లు.
➥ ప్రస్తుతం జాబ్ చేస్తున్నట్లైతే NOC సర్టిఫికేట్.
➥ క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ / పర్సనల్ ఆఫీసర్ ద్వారా నిర్దేశించిన ప్రో-ఫార్మాలో లేదా అన్ని హోదాలు, పే-స్కేల్‌లు, ఉపాధి రకం మొదలైన వాటితో కూడిన మునుపటి అన్ని ఉద్యోగాలకు సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్.
➥ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఫార్మాట్‌లో ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ సర్టిఫికెట్‌కాపీ(వర్తించే చోటల్లా).
➥ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జారీ చేయబడిన కేంద్ర ప్రభుత్వ ఫార్మాట్‌లో ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ-ఎన్‌సీఎల్ సర్టిఫికేట్(వర్తించే చోటల్లా).
➥ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ-ఎన్‌సీఎల్ అభ్యర్థులకు కాస్ట్ సర్టిఫికేట్.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 18.03.2024.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)