News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

IBPS RRB Results: ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

IBPS RRB Results: గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్ స్కేల్-1 (గ్రూప్-ఎ) పోస్టుల భర్తీకి నిర్వహించిన కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XII ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఐబీపీఎస్‌ ఆగస్టు 23న విడుదల చేసింది.

FOLLOW US: 
Share:

IBPS RRB Results: దేశవ్యాప్తంగా ఉన్న గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్ స్కేల్-1 (గ్రూప్-ఎ) పోస్టుల భర్తీకి నిర్వహించిన కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XII (సీఆర్‌పీ) ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌(ఐబీపీఎస్‌) ఆగస్టు 23న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు తర్వాతి దశలో మెయిన్‌ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగాలకు తుది ఎంపిక చేస్తారు. ఆఫీసర్ స్కేల్-2, స్కేల్-3తోపాటు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల ఫలితాలు వెల్లడించాల్సి ఉంది.

ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ఆఫీసర్ గ్రూప్- ఫలితాల కోసం క్లిక్ చేయండి..

దేశంలోని గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీల భర్తీకి 'ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ-సీఆర్‌పీ XII' నోటిఫికేషన్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్‌ మే 31న విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 8612 గ్రూప్‌-ఎ ఆఫీస‌ర్ (స్కేల్‌-1, 2, 3), గ్రూప్‌-బి ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌) పోస్టులను భర్తీ చేయనుంది. తాజా నియామకాల్లో ఏపీలో 939 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో  678 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు, 261 ఆఫీసర్ స్కేల్-1 పోస్టులు ఉన్నాయి. అయితే తెలంగాణకు మాత్రం ఎలాంటి పోస్టులను మంజూరు చేయలేదు.

పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్‌ 1న ప్రారంభమైంది. సరైన అర్హతలున్న అభ్యర్థులు జూన్‌ 21 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆగస్టులో ప్రిలిమినరీ పరీక్ష, సెప్టెంబరు మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.

వివరాలు..

* ఐబీపీఎస్‌ ఆర్‌ఆర్‌బీ - సీఆర్‌పీ-XII, 2023

ఖాళీల సంఖ్య: 8612

1) ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీ ప‌ర్పస్‌): 5538 పోస్టులు

ఏపీలో ఖాళీలు: 678.

2) ఆఫీస‌ర్ (స్కేల్‌-1): 2485 పోస్టులు

ఏపీలో ఖాళీలు: 261.

3) ఆఫీస‌ర్ (స్కేల్‌-2): 516 పోస్టులు

విభాగాలు: అగ్రికల్చర్ ఆఫీసర్-60, మార్కెటింగ్ ఆఫీసర్-03, ట్రైజరీ మేనేజర్-08, లా ఆఫీసర్-24, సీఏ-21, ఐటీ-68, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్-332, 

4) ఆఫీస‌ర్ (స్కేల్‌-3): 73

అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

అనుభవం: ఆఫీసర్ స్కేల్-2 పోస్టులకు 1-2 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఆఫీసర్ స్కేల్-2 పోస్టులకు కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.

వయోపరిమితి (01.06.2023 నాటికి):

➥ ఆఫీసర్ స్కేల్-III (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21-40 సంవత్సరాల మధ్య ఉండాలి. 03.06.1983 - 31.05.2002 మధ్య జన్మించి ఉండాలి. 

➥ ఆఫీసర్ స్కేల్-II (మేనేజర్) పోస్టులకు 21- 32 సంవత్సరాల మధ్య ఉండాలి. 03.06.1991 - 31.05.2002 మధ్య జన్మించి ఉండాలి. 

➥ ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. 03.06.1993 - 31.05.2005 మధ్య జన్మించి ఉండాలి. 

➥ ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18-28 సంవత్సరాల మధ్య ఉండాలి.  02.06.1995 - 01.06.2005 మధ్య జన్మించి ఉండాలి. 

➥ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3-8 సంవత్సరాలు, ఇతరులకు 5 సంవత్సరాల వరకు, వితంతు-ఒంటరి మహిళలకు జనరల్/ఈడబ్ల్యూఎస్-35, ఓబీసీ-38, ఎస్సీ-ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తి్స్తుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది. 

ఎంపిక విధానం: ప్రిలిమినరీ; మెయిన్ పరీక్షల ఆధారంగా.

పరీక్ష విధానం:

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.06.2023. 

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 21.06.2023.

➥ ఫీజు చెల్లింపు, దరఖాస్తుల సవరణ: 01.06.2023 - 21.06.2023.

➥ ప్రీ ఎగ్జామ్‌ ట్రెయినింగ్‌(పీఈటీ) తేదీలు: 17.07.2023 - 22.07.2023.

➥ ప్రిలిమినరీ పరీక్ష తేదీ: ఆగస్టు, 2023.

➥ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు: ఆగస్టు/సెప్టెంబర్‌, 2023.

➥ ఆన్‌లైన్ ఎగ్జామ్ - మెయిన్స్‌/సింగిల్: సెప్టెంబర్‌, 2023.

➥ ఇంటర్వ్యూ నిర్వహణ: నవంబర్‌, 2023.

Notification

Published at : 23 Aug 2023 09:44 PM (IST) Tags: RRB Regional Rural Banks Jobs IBPS RRB XII Prelims Results 2023 IBPS RRB Results IBPS RRB XII Officer Scale-1 Prelims Results Officer Scale-1 Results IBPS RRB Officer Scale-1 Results IBPS RRB 2023 Recruitment

ఇవి కూడా చూడండి

ECIL: ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే

ECIL: ఈసీఐఎల్‌లో 484 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు, అర్హతలివే

TREIRB: గురుకుల అభ్యర్థులకు 'ఆప్షన్ల' నమోదు తప్పనిసరి, నియామక బోర్డు కీలక సూచన

TREIRB: గురుకుల అభ్యర్థులకు 'ఆప్షన్ల' నమోదు తప్పనిసరి, నియామక బోర్డు కీలక సూచన

Singareni Jobs: సింగరేణిలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి హైకోర్టు అనుమతి, ఆ తీర్పు రద్దు

Singareni Jobs: సింగరేణిలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి హైకోర్టు అనుమతి, ఆ తీర్పు రద్దు

UPSC Notification: కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టుల వివరాలు ఇలా

UPSC Notification: కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2024 నోటిఫికేషన్ వచ్చేసింది, పోస్టుల వివరాలు ఇలా

Teacher Transfers - 2023: టీచర్ల బదిలీలు, పదోన్నతులకు మళ్లీ బ్రేక్‌ - హైకోర్టు 'స్టే'తో 13 జిల్లాల్లో నిలిచిపోయిన బదిలీలు

Teacher Transfers - 2023: టీచర్ల బదిలీలు, పదోన్నతులకు మళ్లీ బ్రేక్‌ - హైకోర్టు 'స్టే'తో 13 జిల్లాల్లో నిలిచిపోయిన బదిలీలు

టాప్ స్టోరీస్

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Minister KTR: బీజేపీ నుంచి BRSలోకి వలసలు, కేటీఆర్ సమక్షంలో చేరిన కీలక నేత

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

Chandrayaan 3 Reactivation: చంద్రయాన్ రీయాక్టివేషన్ కోసం ఇస్రో కసరత్తులు, ఇప్పటిదాకా నో సిగ్నల్స్ - ఇస్రో

iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?

iPhone 15 Series: ఐఫోన్ 15 సిరీస్ కోసం స్టోర్ల దగ్గర పడిగాపులు మొదలు - డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభం కావచ్చు?

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279

IND vs AUS 1st ODI: షమి 'పంచ్‌'తో కంగారు - టీమ్‌ఇండియా టార్గెట్‌ 279