BOB: బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్, సీనియర్ మేనేజర్ ఉద్యోగాలు - ఈ అర్హతలుండాలి
ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా రెగ్యులర్ ప్రాతిపదికన రిస్క్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్లో మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
BOB Recruitment: ముంబయిలోని బ్యాంక్ ఆఫ్ బరోడా రెగ్యులర్ ప్రాతిపదికన రిస్క్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్లో మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 20 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో సీఏ, ఎంబీఏ/ పీజీడీఎం, పీజీ, సర్టిఫికెట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు మార్చి 8వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉద్యోగ ఎంపిక ఉంటుంది.
వివరాలు..
ఖాళీల సంఖ్య: 20
1) మేనేజర్ - పోర్ట్‌ఫోలియో మానిటరింగ్ &ఎక్స్‌పోజర్ మేనేజ్‌మెంట్: 01పోస్టు
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) లేదా ఎంబీఏ/ పీజీడీఎం తప్పనిసరిగా ఉండాలి. ప్రసిద్ధ సంస్థ నుంచి సీఎఫ్‌ఏ(సీఎఫ్‌ఏ ఇన్‌స్టిట్యూట్-USA), ఎఫ్‌ఆర్‌ఎం(GARP), పీఆర్ఎం (PRMIA) లేదా ఏదైనా క్రెడిట్ / రిస్క్ సంబంధిత కోర్సులు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
అనుభవం: సంబంధిత విభాగం, బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్‌లో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 24-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
2) సీనియర్ మేనేజర్ -సెక్టార్/ఇండస్ట్రీ అనలిస్ట్: 01
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) లేదా ఎంబీఏ/ పీజీడీఎం తప్పనిసరిగా ఉండాలి. ప్రసిద్ధ సంస్థ నుంచి సీఎఫ్‌ఏ(సీఎఫ్‌ఏ ఇన్‌స్టిట్యూట్-USA), ఎఫ్‌ఆర్‌ఎం(GARP), పీఆర్ఎం(PRMIA) లేదా ఏదైనా క్రెడిట్ / రిస్క్ సంబంధిత కోర్సులు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
అనుభవం: బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్‌లో కనీసం 5 సంవత్సరాల అనుభవం, సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 26-37 సంవత్సరాల మధ్య ఉండాలి.
3) మేనేజర్ -ఎంటర్‌ప్రైజ్ రిస్క్ మేనేజ్‌మెంట్: 02
అర్హత: అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి చార్టర్డ్ అకౌంటెంట్(CA) లేదా ఎంబీఏ/ పీజీడీఎం తప్పనిసరిగా ఉండాలి. సీఎఫ్‌ఏ(సీఎఫ్‌ఏ ఇన్‌స్టిట్యూట్-USA),
ఎఫ్‌ఆర్‌ఎం(GARP), పీఆర్ఎం(PRMIA), ఈఎస్‌జీ(సీఎఫ్‌ఏ ఇన్‌స్టిట్యూట్- USA), ఎస్‌సీఆర్(GARP) సంబంధిత కోర్సులు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 24-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
4) సీనియర్ మేనేజర్ -ఎంటర్‌ప్రైజ్ రిస్క్ మేనేజ్‌మెంట్: 01
అర్హత: చార్టర్డ్ అకౌంటెంట్(CA) లేదా ఎంబీఏ/ పీజీడీఎం తప్పనిసరిగా ఉండాలి. సీఎఫ్‌ఏ(సీఎఫ్‌ఏ ఇన్‌స్టిట్యూట్-USA),
ఎఫ్‌ఆర్‌ఎం(GARP), పీఆర్ఎం(PRMIA), ఈఎస్‌జీ(CFA ఇన్స్టిట్యూట్- USA), ఎస్‌సీఆర్(GARP) సంబంధిత కోర్సులు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
అనుభవం: సంబంధిత విభాగంలో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 26-37 సంవత్సరాల మధ్య ఉండాలి.
5) సీనియర్ మేనేజర్ -క్లైమేట్ రిస్క్: 01
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ / జియోగ్రఫీ/ సస్టైనబిలిటీలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ తప్పనిసరి, ప్రసిద్ధ సంస్థ నుంచి సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ రిస్క్ (ఎస్‌సీఆర్), ఏదైనా క్లైమేట్ రిస్క్ సంబంధిత కోర్సులు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
అనుభవం: రిస్క్ మేనేజ్‌మెంట్/క్రెడిట్‌లో కనీసం 5 సంవత్సరాలు, క్లైమేట్ రిస్క్ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్ రిస్క్ మేనేజ్‌మెంట్ లేదా ESGలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 26-37 సంవత్సరాల మధ్య ఉండాలి.
6) చీఫ్ మేనేజర్ -క్లైమేట్ రిస్క్: 01
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ / జియోగ్రఫీ/ సస్టైనబిలిటీ లేదా ఎంబీఏ/ పీజీడీఎంలో పోస్ట్-గ్రాడ్యుయేషన్ తప్పనిసరి, ప్రసిద్ధ సంస్థ నుంచి సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ రిస్క్ (ఎస్‌సీఆర్), ఏదైనా క్లైమేట్ రిస్క్ సంబంధిత కోర్సులు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
అనుభవం: రిస్క్ మేనేజ్‌మెంట్‌లో కనీసం 7 సంవత్సరాలు, క్లైమేట్ రిస్క్ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్‌మెంటల్ రిస్క్ మేనేజ్‌మెంట్ లేదా ESGలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28-40 సంవత్సరాల మధ్య ఉండాలి.
7) మేనేజర్ - మోడల్ వాలిడేషన్: 02
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి(కంప్యూటర్ సైన్స్/ డేటాసైన్స్/ గణితం/ స్టాటిస్టిక్స్/ఎకనామిక్స్/ఫైనాన్స్ లేదా సంబంధిత క్వాంటిటేటివ్ ఫీల్డ్)లో మాస్టర్స్ తప్పనిసరి. ప్రఖ్యాత సంస్థల నుంచి డేటా అనలిటిక్స్/డేటా సైన్స్/మెషిన్ లెర్నింగ్/ఎస్‌ఏఎస్/పైథాన్/ఆర్‌లో సర్టిఫికేట్ కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
అనుభవం: క్వాంటిటేటివ్/రిస్క్ అనలిటిక్స్ ఫంక్షన్‌లో కనీసం 3 సంవత్సరాల అనుభవం, మోడల్ వాలిడేషన్/డెవలప్‌మెంట్‌లో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 24-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
8) సీనియర్ మేనేజర్ -మోడల్ వాలిడేషన్: 01
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి(కంప్యూటర్ సైన్స్/ డేటాసైన్స్/ గణితం/ స్టాటిస్టిక్స్/ఎకనామిక్స్/ఫైనాన్స్ లేదా సంబంధిత క్వాంటిటేటివ్ ఫీల్డ్)లో మాస్టర్స్ తప్పనిసరి. ప్రఖ్యాత సంస్థల నుంచి డేటా అనలిటిక్స్/డేటా సైన్స్/మెషిన్ లెర్నింగ్/ఎస్‌ఏఎస్/పైథాన్/ఆర్‌లో సర్టిఫికేట్ కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
అనుభవం: క్వాంటిటేటివ్/రిస్క్ అనలిటిక్స్ ఫంక్షన్‌లో కనీసం 5 సంవత్సరాల అనుభవం, మోడల్ వాలిడేషన్/డెవలప్‌మెంట్‌లో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 26-37 సంవత్సరాల మధ్య ఉండాలి.
9) మేనేజర్ - అనలిటిక్స్: 03
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి(కంప్యూటర్ సైన్స్/ డేటాసైన్స్/ మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్/ఎకనామిక్స్/ఫైనాన్స్ లేదా సంబంధిత క్వాంటిటేటివ్ ఫీల్డ్)లో మాస్టర్స్ తప్పనిసరి. ప్రఖ్యాత సంస్థల నుంచి డేటా అనలిటిక్స్/డేటా సైన్స్/మెషిన్ లెర్నింగ్/ఎస్‌ఏఎస్/పైథాన్/ఆర్‌లో సర్టిఫికేట్ కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
అనుభవం: క్వాంటిటేటివ్/రిస్క్ అనలిటిక్స్ ఫంక్షన్‌లో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి, అందులో డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ లేదా సంబంధిత ఫీల్డ్‌లో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 24-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
10) సీనియర్ మేనేజర్ -అనలిటిక్స్: 02
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి(కంప్యూటర్ సైన్స్/ డేటాసైన్స్/ మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్/ఎకనామిక్స్/ఫైనాన్స్ లేదా సంబంధిత క్వాంటిటేటివ్ ఫీల్డ్)లో మాస్టర్స్ తప్పనిసరి. ప్రఖ్యాత సంస్థల నుంచి డేటా అనలిటిక్స్/డేటా సైన్స్/మెషిన్ లెర్నింగ్/ఎస్‌ఏఎస్/పైథాన్/ఆర్‌లో సర్టిఫికేట్ కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
అనుభవం: క్వాంటిటేటివ్/రిస్క్ అనలిటిక్స్ ఫంక్షన్‌లో కనీసం 5 సంవత్సరాల అనుభవం, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ లేదా సంబంధిత ఫీల్డ్‌లో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 26-37 సంవత్సరాల మధ్య ఉండాలి.
11) మేనేజర్ - మోడల్ డెవలప్‌మెంట్ : 02
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి(కంప్యూటర్ సైన్స్/ డేటాసైన్స్/ మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్/ఎకనామిక్స్/ఫైనాన్స్ లేదా సంబంధిత క్వాంటిటేటివ్ ఫీల్డ్)లో మాస్టర్స్ తప్పనిసరి. సీఎఫ్‌ఏ/ఎఫ్‌ఆర్‌ఎం/పీఆర్‌ఎం సర్టిఫికేట్ కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
అనుభవం: క్వాంటిటేటివ్/రిస్క్ ఫంక్షన్‌లో కనీసం 3 సంవత్సరాల అనుభవం. మోడల్ డెవలప్‌మెంట్, మోడల్ వాలిడేషన్ లేదా సంబంధిత ఫీల్డ్‌లో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 24-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
12) సీనియర్ మేనేజర్ -మోడల్ డెవలప్‌మెంట్: 01
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి(కంప్యూటర్ సైన్స్/ డేటాసైన్స్/ మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్/ఎకనామిక్స్/ఫైనాన్స్ లేదా సంబంధిత క్వాంటిటేటివ్ ఫీల్డ్)లో మాస్టర్స్ తప్పనిసరి. సీఎఫ్‌ఏ/ఎఫ్‌ఆర్‌ఎం/పీఆర్‌ఎం సర్టిఫికేట్ కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
అనుభవం: క్వాంటిటేటివ్/రిస్క్ ఫంక్షన్‌లో కనీసం 5 సంవత్సరాల అనుభవం. మోడల్ డెవలప్‌మెంట్, మోడల్ వాలిడేషన్ లేదా సంబంధిత ఫీల్డ్‌లో 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 26-37 సంవత్సరాల మధ్య ఉండాలి.
13) సీనియర్ మేనేజర్ -బ్యాంక్, NBFC మరియు FI సెక్టార్ క్రెడిట్ రిస్క్ మేనేజ్‌మెంట్: 01
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) లేదా ఫుల్ టైమ్ ఎంబీఏ/ పీజీడీఎం లేదా తత్సమానం తప్పనిసరిగా ఉండాలి. సీఎఫ్‌ఏ(సీఎఫ్‌ఏ ఇన్‌స్టిట్యూట్-USA), ఎఫ్‌ఆర్‌ఎం(GARP), పీఆర్ఎం(PRMIA), ఈఎస్‌జీ(CFA ఇన్స్టిట్యూట్- USA), ఎస్‌సీఆర్(GARP) సంబంధిత కోర్సులు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
అనుభవం: క్రెడిట్ రిస్క్‌తో వ్యవహరించే కార్పొరేట్ & ఇన్‌స్టిట్యూషనల్ బ్యాంకింగ్/రిస్క్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో కనీసం 3 సంవత్సరాలతో BFSI సెక్టార్‌లో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27-40 సంవత్సరాల మధ్య ఉండాలి.
14) సీనియర్ మేనేజర్ -MSME క్రెడిట్ రిస్క్ మేనేజ్‌మెంట్: 01
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి చార్టర్డ్ అకౌంటెంట్(సీఏ) లేదా ఫుల్ టైమ్ ఎంబీఏ/ పీజీడీఎం లేదా తత్సమానం తప్పనిసరిగా ఉండాలి. సీఎఫ్‌ఏ(సీఎఫ్‌ఏ ఇన్‌స్టిట్యూట్-USA), ఎఫ్‌ఆర్‌ఎం(GARP), పీఆర్ఎం(PRMIA), ఈఎస్‌జీ(CFA ఇన్స్టిట్యూట్- USA), ఎస్‌సీఆర్(GARP) సంబంధిత కోర్సులు కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
అనుభవం: క్రెడిట్ రిస్క్‌తో వ్యవహరించే MSMECredit/రిస్క్ మేనేజ్‌మెంట్ విభాగంలో కనీసం 3 సంవత్సరాలతో బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్‌లో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 27-40 సంవత్సరాల మధ్య ఉండాలి.
విభాగాలు: ఫోర్ట్‌ఫోలియో మానిటరింగ్ అండ్ ఎక్స్‌పోజర్ మేనేజ్‌మెంట్, సెక్టార్/ ఇండస్ట్రీ అనలిస్ట్, ఎంటైర్‌ప్రైజ్ రిస్క్ మేనేజ్‌మెంట్, క్లైమెట్ రిస్క్, మోడల్ వ్యాలిడేషన్, అనలిటిక్స్, మోడల్ డెవలప్‌మెంట్, ఎన్‌బీఎఫ్‌సీ అండ్ ఎఫ్‌ఐ సెక్టార్ క్రెడిట్ రిస్క్ మేనేజ్‌మెంట్, ఎంఎస్‌ఎంఈ క్రెడిట్ రిస్క్ మేనేజ్‌మెంట్.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600; ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100 ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుచేసుకోవాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 08.03.2024.