AP Jobs: ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో 331 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు, వివరాలు ఇలా!
ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 331 సెషలిస్ట్ డాక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఏపీ వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 331 సెషలిస్ట్ డాక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. శాశ్వత, ఒప్పందం విధానంలో గిరిజన, గ్రామీణ ఆస్పత్రుల్లో ఈ నియామకాలు చేపట్టనున్నారు. మొత్తం 14 స్పెషాలిటీ విభాగాల్లో నియామకానికి జులై 5, 7, 10 తేదీల్లో వాకిన్ నిర్వహిస్తారు. అర్హులైన వైద్యులు విజయవాడ, గొల్లపూడిలోని ఏపీవీవీపీ కమిషన్ కార్యాలయంలో హాజరుకావాల్సి ఉంటుంది. నియామకాల్లో కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి స్థానికత, రోస్టర్ విధానంలో ప్రభుత్వం సడలింపు ఇచ్చింది.
వివరాలు..
మొత్తం ఖాళీలు: 331
* సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టులు
విభాగాల వారీగా ఖాళీలు..
1) గైనకాలజీ: 39
2) అనస్థీషియా: 38
3) పీడియాట్రిక్స్: 27
4) జనరల్ మెడిసిన్: 73
5) జనరల్ సర్జరీ: 31
6) ఆర్థోపెడిక్స్: 12
7) అఫ్తాల్మొలజీ: 20
8) రేడియాలజీ: 44
9) పాథాలజీ: 09
10) ఈఎన్‌టీ: 23
11) డెర్మటాలజీ: 08
12) మైక్రోబయాలజీ: 01
13) ఫోరెన్సిక్ మెడిసిన్: 05
14) సైకియాట్రీ: 01
అర్హతలు: పీజీ డిగ్రీ/ డిప్లొమా/ డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి. A.P. మెడికల్ కౌన్సిల్‌లో నమోదు చేసుకోవాలి.
గరిష్ట వయోపరిమితి: 01.07.2023 నాటికి 42 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోసడలింపులు వర్తిస్తాయి.
ఎంపిక విధానం: మెరిట్ జాబితా, వెయిటేజీ, వాక్-ఇన్-రిక్రూట్‌మెంట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
పే స్కేల్: రూ.61,960 - రూ.1,51,370. గిరిజన ప్రాంతంలో రూ.2,50,000.; గ్రామీణ ప్రాంతంలో రూ.2,00,000. పట్టణ ప్రాంతంలో రూ.1,30,000.
ముఖ్యమైన తేదీలు..
నోటిఫికేషన్ వెలువడిన తేదీ: 28.06.2023.
వాక్-ఇన్-రిక్రూట్‌మెంట్ తేదీలు: 05.07.2023, 07.07.2023, 10.07.2023.
ALSO READ:
ఐటీబీపీలో 458 కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టులు, ఈ అర్హతలుండాలి!
భారత హోంమంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ), కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా 458 కానిస్టేబుల్ ఖాళీలను భర్తీ చేయనుంది. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా పోస్టుల భర్తీ చేపడతారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 27 నుంచి జులై 26 వరకు ఆన్‌లైన్‌లో తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 239 టీచింగ్ పోస్టులు, అర్హతలివే!
తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ(టీఎస్‌ఈఎస్) 2023-24 విద్యా సంత్సరానికి రాష్ట్రంలోని 23 ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి తాత్కాలిక ప్రాతిపదికన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బోధనతో పాటు రెసిడెన్షియల్ పాఠశాల విధులకు హాజరుకావడం తప్పనిసరి. షేరింగ్ ప్రాతిపదికన బోర్డింగ్, లాడ్జింగ్ పాఠశాల క్యాంపస్‌లో అందుబాటులో ఉండేలా సదుపాయం ఉంటుంది. ఎంపికైన ఉపాధ్యాయులు సీబీఎస్‌ఈ సిలబస్‌ను ఆంగ్లభాషలో బోధించాల్సి ఉంటుంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు జులై 02వ తేదీలోగా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, బీఈడీ, పీహెచ్‌డీ, ఎంఫిల్, ఎంఈడీ, టెట్ ఉత్తీర్ణతతో పాటు బోధననానుభవం కలిగి ఉండాలి.
నోటిఫికేషన్, పోస్టుల వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
Join Us on Telegram: https://t.me/abpdesamofficial