అన్వేషించండి

ఆఫీస్‌ కప్పుల్లో టీ, కాఫీలు తాగుతున్నారా? ఇక అంతే సంగతులు!

రోజూ మీరు ఆఫీసుల్లో టీ, కాఫీలు తాగుతున్నారా? అయితే, మీరు ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాలి.

ఆఫీసులో పని ఒత్తిడి నుంచి కాస్త రిలీఫ్ ఇచ్చేవి టీ, కాఫీలు మాత్రమే. కొందరికి కాఫీ సిప్ చేస్తేగానీ పని చేయడానికి మూడ్ రాదు. అయితే, తాజా పరిశోధనలో బయటపడిన విషయాలు గురించి తెలిసిన తర్వాత.. కాఫీ కప్పులను ముట్టుకోవాలంటేనే భయపడిపోతారు. 

ఆఫీసుల్లో కమ్యూనల్ కిచెన్‌లో ఉపయోగించే వస్తువుల్లో చాలా ప్రమాదకరమైన బాక్టీరియా ఉంటుందని తేలింది. ఈ నేపథ్యంలో ఆఫీస్ కిచెన్స్‌ను చాలా పరిశుభ్రంగా ఉంచాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లేకపోతే ఉద్యోగులు అనారోగ్యాలకు గురై ప్రొడక్టివిటీ తగ్గిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. 

ఆఫిసుల్లోని కెటిల్స్, ప్రిజ్ డోర్ హ్యాండిల్స్, కాఫీ మెషిన్లు, మైక్రోవేవ్ బటన్ల ద్వారా సూక్ష్మక్రిములు వ్యాపిస్తున్నాయని బ్రిటన్ పరిశోధకులు కనుగొన్నారు. లివర్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్‌కు చెందిన చీఫ్ రీసెర్చర్ డాక్టర్ ఆడమ్ రాబర్ట్ చెప్పిన దాన్ని బట్టి ‘‘టాయిలెట్లకు వెళ్లి వచ్చిన తర్వాత చేతులు సరిగ్గా కడుక్కోక పోవడం వంటి కారణాలతో ప్రమాదకర బ్యాక్టీరియా కిచెన్‌లోనూ వ్యాపిస్తోంది’’ అని తెలిపారు. 

ఇన్ఫెక్షన్ కలిగిన వ్యక్తి తాకిన ప్రదేశాలను తాకిన వారంతా కూడా అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఎప్పుడూ ఉంటుందని డాక్టర్ రాబర్ట్స్ తెలిపారు. కమ్యూనల్ కిచెన్స్, నడిచే ప్రాంతాలు, ఆఫీస్ స్పేస్‌లు తదితర పబ్లిక్ ప్లేసుల నుంచి సేకరించిన స్వాబ్‌లలో ఎస్చేరిషియా కోలీ (ఈకోలీ) అనే ప్రమాదకర బ్యాక్టీరియాను కనుగొన్నారు. ఇది సాధారణ బ్యాక్టీరియా. దీని ద్వారా అతిసారం, యూరీనరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, గ్యాస్ట్రో ఇన్ఫెక్షన్లు వస్తాయి.

న్యూమోనియా వంటి శ్వాసకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు కలిగించే సుడోమోనాస్ కూడా పైన చెప్పిన వస్తువుల మీద కనిపించింది. క్లేబ్సీయెల్లా అనే సూక్ష్మజీవి న్యూమోనియాకు కారణం అవుతుంది. ఇది మలం ద్వారా వ్యాపిస్తుంది. దీన్ని దాదాపు 11 కిచెన్ వస్తువల మీద కనిపించింది. ప్రతి వస్తువు మీద ఫంగైతో నిండి ఉన్నట్టు మైక్రోబయాలజిస్టులు చెబుతున్నారు. ప్రిజ్ డోర్ హ్యాండిల్స్ మీద కూడా సూక్ష్మ క్రిములు కనిపించాయట. ఈ ఇన్ఫెక్షన్ నుంచి తప్పించుకోవడానికి ఉన్న సులభమైన మార్గం.. చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడమేనని వైద్యులు అంటున్నారు.

బ్యాక్టీరియా కంటికి కనిపించదు. వస్తువులు శుభ్రంగా కనిపించినప్పటికీ చాలా సూక్ష్మజీవులు వాటిపై ఉంటాయని నిపుణులు వివరించారు. ఫ్లూ, నోరోవైరస్ వంటి సాధారణ జలుబు కలిగించే వ్యాధుల వ్యాప్తిని తగ్గించాలంటే.. అవి వ్యాపించే తీరును అర్థం చేసుకుని అవగాహన కల్పించడం అవసరం. దశాబ్ద కాలంలో నోరోవైరస్ కేసులు బాగా పెరిగాయి. 

నోరోవైరస్ చాలా వేగంగా తేలికగా వ్యాపిస్తుంది. ఇన్ఫెక్షన్ సోకిన వారితో కాస్త దూరం పాటించడం ద్వారా దీన్ని అరికట్టడం సాధ్యమవుతుంది. వైరస్ కలిగిన వస్తువులను తాకిన తర్వాత నోరు, ముక్కు, ముఖాన్ని ముట్టుకోవడం వల్ల కూడా వైరస్ శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. కనుక పర్సనల్ హైజీన్ లో చేతుల శుభ్రత అనేది చాలా కీలకం అనే విషయం అందరూ గుర్తుంచుకోవాలని ఈ అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. వీలైనంత వరకు కమ్యూనల్ కిచెన్ లకు దూరంగా ఉండడం కూడా ఆరోగ్యానికి మేలు చేసే విషయం అని గుర్తుంచుకోవాలి.

Also Read: వీటిని నీటిలో వేసుకుని స్నానం చేశారంటే అదృష్టం మీ వెంటే!

టాప్ హెడ్ లైన్స్

Hepatitis B in Pregnancy : గర్భిణీలకు హెపటైటిస్ బి ఉంటే బిడ్డకు కూడా వస్తుందా? బిడ్డకు ఇన్ఫెక్షన్ రాకుండా డాక్టర్ ఇస్తోన్న సూచనలివే
గర్భిణీలకు హెపటైటిస్ బి ఉంటే బిడ్డకు కూడా వస్తుందా? బిడ్డకు ఇన్ఫెక్షన్ రాకుండా డాక్టర్ ఇస్తోన్న సూచనలివే
Desk Job Health Risks : డెస్క్ జాబ్ చేస్తూ గంటల తరబడి కూర్చుంటున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలపై జాగ్రత్త
డెస్క్ జాబ్ చేస్తూ గంటల తరబడి కూర్చుంటున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలపై జాగ్రత్త
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Bone Density : ఎముకలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి? బోన్ డెన్సిటీ తగ్గకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
ఎముకలు బలంగా ఉండాలంటే ఏం చేయాలి? బోన్ డెన్సిటీ తగ్గకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

వీడియోలు

Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Ravindra Jadeja for 2027 World Cup | జడేజా స్థానంపై స్పష్టతనిచ్చిన కోచ్ బహుతులే
Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Flydubai Flight 1073 Attack: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
Khairatabad Assembly Bypoll 2026: ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
ఖైరతాబాద్ కాంగ్రెస్ ప్లాన్-బి - దానంకు షాక్.. పిజెఆర్ కుమార్తె విజయారెడ్డి రేసులోకి?
KTR Arrogance Allegations: కేటీఆర్ పొలిటికల్ ఇమేజ్‌‌పై వ్యతిరేక ప్రచారం - అహంకారమా? ఆత్మవిశ్వాసమా?
కేటీఆర్ పొలిటికల్ ఇమేజ్‌‌పై వ్యతిరేక ప్రచారం - అహంకారమా? ఆత్మవిశ్వాసమా?
Shubman Gill Double Century: గిల్ ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ రికార్డు .. రోహిత్ సెంచ‌రీ.. ఇండియా రికార్డు ఛేజింగ్.. 406 ర‌న్స్ టార్గెట్ ఉఫ్ మ‌ని ఊదేసిన భార‌త్.. సిరీస్ సొంతం
గిల్ ఫాస్టెస్ట్ డ‌బుల్ సెంచ‌రీ రికార్డు .. రోహిత్ సెంచ‌రీ.. ఇండియా రికార్డు ఛేజింగ్.. 406 ర‌న్స్ టార్గెట్ ఉఫ్ మ‌ని ఊదేసిన భార‌త్.. సిరీస్ సొంతం
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో అధికారుల సంచలన వాంగ్మూలాలు.. జగన్ A1గా మారతారా? వాంగ్మూలాలు నిలుస్తాయా?
ఏపీ లిక్కర్ స్కాంలో అధికారుల సంచలన వాంగ్మూలాలు.. జగన్ A1గా మారతారా? వాంగ్మూలాలు నిలుస్తాయా?
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో ED దూకుడు - రూ. 40 కోట్ల సుపారీ గుట్టు విప్పేందుకేనా? సీబీఐ వదిలిన లింక్ పట్టేసుకుందా?
వైఎస్ వివేకా హత్య కేసులో ED దూకుడు - రూ. 40 కోట్ల సుపారీ గుట్టు విప్పేందుకేనా? సీబీఐ వదిలిన లింక్ పట్టేసుకుందా?
Vijayasai Reddy About YSRCP: ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఇండీ కూటమిలో వైసీపీ విలీనంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Rajinikanth : ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
ఆటోలో షూటింగ్ సెట్‌కు రజనీ కాంత్ - వాట్ ఏ సింప్లిసిటీ తలైవా... ఫ్యాన్స్ ఫిదా
Embed widget