అన్వేషించండి

Fourth Wave Warning Bells-భాారత్‌లో త్వరలోనే కరోనా ఫోర్త్ వేవ్ రానుందా..?

కరోనా ఫోర్త్‌ వేవ్‌పై హెచ్చరికలు చేసిన కేంద్ర ప్రభుత్వం. ఐదు రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్ర ఆరోగ్య కార్యదర్శి.

కరోనా ఫోర్త్ వేవ్‌పై కేంద్రం హచ్చరికలు

కరోనా కథ ముగిసిపోయిందనుకుంటున్నారా..? మరో వేవ్ రాదని రిలాక్స్ అవుతున్నారా..? ఫోర్త్ వేవ్ ఎప్పుడైనా రావచ్చు. అప్రమత్తంగా ఉండండి అంటూ ఐదు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. వారం రోజులుగా దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు పెరుగుతున్నందున జాగ్రత్తలు పాటించాలని సూచించింది. చాలా రోజుల నుంచి కరోనా కేసుల్లో పెరుగుదల కనిపించటం లేదు. పాజిటివిటీ రేటు చాలా వరకు పడిపోయింది. అక్కడో ఇక్కడో ఒకటి అర కేసులు బయటపడినా రికవరీ రేటు బాగానే ఉంది. అంతా ప్రశాంతమే 
అనుకుంటున్న తరుణంలో దాదాపు 84 రోజుల తరవాత దేశవ్యాప్తంగా 24 గంటల్లో 4 వేల కేసులు నమోదయ్యాయి. ముంబయిలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దిల్లీ కూడా కొవిడ్ ఆంక్షల్ని కఠినతరం చేయనుంది. విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి సారించింది. 

ఈ ఐదు రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి: కేంద్రం


తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. ఈ రాష్ట్రాల్లో మరోసారి వైరస్ వ్యాప్తి అధికమయ్యే ప్రమాదముందని లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రమాదాన్ని ముందుగానే ఊహించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజారోగ్య విభాగాలు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. మూడు నెలలుగా కొవిడ్ కేసుల్లో పెరుగుదల కనిపించనప్పటికీ మే చివరి వారం నుంచి పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతుండటాన్ని గమనించాలని లేఖలో ప్రస్తావించారు రాజేశ్ భూషణ్. తెలంగాణలో మే 27 నాటికి 287 కొత్త కేసులు వెలుగులోకి రాగా, జూన్ 3న తేదీ నాటికి ఆ సంఖ్య 375కి పెరిగిందని లెక్కలతో సహా వివరించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు పెరుగుతున్నందున కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ముంబయిలో ఫోర్త్ వేవ్ వస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కొవిడ్ టెస్ట్‌ల సంఖ్య పెంచాలని  ఆరోగ్య విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాలు, పాఠశాలలు, ఆసుపత్రుల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించింది. ప్రతి జిల్లాలో కనీసం 60% మందికి ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని సూచించింది. 

ఈ వేరియంట్లతో ముప్పు తప్పదా..? 


ఒమిక్రాన్‌కు సబ్‌ వేరియంట్లుగా పిలుచుకునే BA.4,BA.5 కారణంగా మరోసారి కేసులు పెరిగే ప్రమాదముందన్న ఆందోళన మొదలైంది. కానీ వైరాలజిస్ట్‌లు మాత్రం ఇవేమీ అంత ప్రమాదకరమైన వేరియంట్లు కావని తేల్చి చెబుతున్నారు. నిర్లక్ష్యంగా ఉండటం సరికాదని, అలా అని భయపడాల్సిన పని లేదని అంటున్నారు. ఇప్పటికే చాలా మంది వ్యాక్సిన్లు వేయించుకున్నందున ఏ వేరియంట్ వచ్చినా ప్రభావం తక్కువగానే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Benefits Of Walk After Dinner: రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
WHO Global Cancer Report 2026:ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
ప్రతి ఐదుగురిలో ఒకరికి క్యాన్సర్‌ ముప్పు! ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన రిపోర్ట్‌!
Why To Avoid Salads In Monsoon:వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
వర్షాకాలంలో ఆకుకూరలు, కూరగాయలు, సలాడ్స్ తినకూడదా? తింటే ఏం జరుగుతుంది?
When Is Hepatitis An Emergency?: హెపటైటిస్ ఎప్పుడు ప్రాణాంతకమవుతుంది? లీవర్ ఫెయిల్యూర్‌ ప్రమాదాన్ని చెప్పే ఆరు రెడ్‌ఫ్లాగ్స్ ఇవే!
హెపటైటిస్ ఎప్పుడు ప్రాణాంతకమవుతుంది? లీవర్ ఫెయిల్యూర్‌ ప్రమాదాన్ని చెప్పే ఆరు రెడ్‌ఫ్లాగ్స్ ఇవే!

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Rag Mayur: రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
Benefits Of Walk After Dinner: రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Embed widget