Corona Cases: దేశంలో 24 గంటల్లో లక్షా యాభై కేసులు నమోదు ముందురోజుతో పోలిస్తే పెరిగిన కేసులు
ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం కేసుల సంఖ్య తగ్గింది. సుమారు పదమూడు శాతం తగ్గాయి. బుధవారం కేసులతో పోల్చుకుంటే నిన్న కేసులు సంఖ్య కాస్త పెరిగింది. కానీ ఇవాళ తగ్గడం కాస్త ఊరట ఇచ్చింది
24గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 1, 49, 394 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ముందు రోజుతో పోలిస్తే ఈ కేసుల సంఖ్య పదమూడు శాతం తగ్గింది.
ఇరవై నాలుగు గంటల్లో 1.072 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. 2, 46, 674 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు.
కొత్తగా వెలుగు చూసిన కేసులతో కలిసి దేశవ్యాప్తంగా 14,35,569 యాక్టివ్ కేసులు ప్రస్తుతం ఉన్నాయి. ఇప్పటి వరకు డెత్ టోల్ 5,00,055లుగా ఉంది.
రోజూవారిగా ఉండే పాజిటివిటీ రేటు 9.27శాతం ఉంటే వీక్లీ పాజిటివిటీ రేటు 12.03 శాతంగా ఉంది.
దేశవ్యాప్తంగా నిన్న 16,11,666 పరీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు 168.47కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు వేశారు.
ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో గత 24 గంటల్లో 1,956 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో క్రియాశీల కేస్‌లు 15,632. మిజోరంలో రోజువారీ పాజిటివిటీ రేటు 30.91%కి చేరుకుంది.
మహారాష్ట్రలో 15,252 కొత్త కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ గురువారం తెలిపింది. 75 మరణించారు.
తమిళనాడులో 11,993 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 33,87,322కి చేరుకుంది. 30 మరణాలతో మొత్తం మృతులు సంఖ్య 37,666కి చేరుకుంది.
కేరళలో గురువారం కోవిడ్-19 కేసులు తగ్గుముఖం పట్టాయి. 42,677 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 61,72,432కి చేరుకుంది.