By: ABP Desam | Updated at : 12 Feb 2022 08:52 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
కరోనా కేసులు(ప్రతీకాత్మక చిత్రం)
ఏపీలో కరోనా ఉద్ధృతి తగ్గుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 24,066 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 896 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో 6 మంది మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,694కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 8,849 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 22,72,881 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 24,454 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల(Covid positive Cases) సంఖ్య 23,12,029కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 3,28,09,000 నిర్థారణ పరీక్షలు చేశారు.
#COVIDUpdates: 12/02/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) February 12, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,12,029 పాజిటివ్ కేసు లకు గాను
*22,72,881 మంది డిశ్చార్జ్ కాగా
*14,694 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 24,454#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/RjdP0sEe54
తెలంగాణలో కేసులు
తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 52,714 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కొత్తగా 683 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 7,83,019కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో మరణాలు సంభవించలేదు. కోవిడ్ నుంచి నిన్న 2,645 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 13,674 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో తాజాగా 168 కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసులు
భారత్‌లో రోజురోజుకు కరోనా(Corona) కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గత 24 గంటల్లో 50,407 కేసులు నమోదైనట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. రోజువారీ పాజిటివటీ రేటు కూడా భారీగా తగ్గింది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా ఉంది. గత 24 గంటల్లో 804 కరోనా కారణంగా మరణించారు. గత 24 గంటల్లో 97.37 శాతం రికవరీ రేటుతో 1,36,962 మంది కోవిడ్-19(Covid-19) వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,10,443గా ఉన్నాయి. ఇది ఇప్పటివరకు మొత్తం కేసులలో 1.43 శాతం. 15 నుంచి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు టీకాలు వేయడానికి ప్రభుత్వం ఆమోదించిన తర్వాత, దేశంలో దాదాపు 172.29 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు పూర్తయ్యాయి
కేరళ(Kerala)లో ఇప్పటికి కూడా అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 16,012 కేసులు వెలుగు చూశాయి. అదే సమయంలో రాష్ట్రంలో 27 మంది మృతి చెందారు. మహారాష్ట్ర(Maharashtra)లో గత 24 గంటల్లో 5,455 మందికి వైరస్ సోకింది. వైరస్ బారిన పడి 63 మంది చనిపోయారు. ముంబైలో రెండు మరణాలతో 429 కేసులు నమోదయ్యాయి. దిల్లీ(Delhi)లో గడచిన 24 గంటల్లో 977 కోవిడ్ కేసులు గుర్తించారు. 12 మంది మరణించారు. దేశ రాజధానిలో పాజిటివిటీ రేటు 1.73 శాతంగా ఉంది. కర్ణాటక(Karnataka)లో గత 24 గంటల్లో 3,976 కోవిడ్ కేసులు నమోదవ్వగా 41 మంది మరణించారు. పశ్చిమ బెంగాల్(West Bengal)లో గత 24 గంటల్లో 27 మరణాలతో 767 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. కోవిడ్-19 కేసుల తగ్గుదల కారణంగా, అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు సడలిస్తున్నారు. విద్యాసంస్థలు తెరుస్తున్నారు.
Heart Attacks: కోవిడ్ తర్వాత గుండె జబ్బులతోనే అత్యధిక మరణాలు - అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి
Coronavirus: కోవిడ్ సోకిన 18 నెలల తర్వాత చనిపోయే ప్రమాదం? భయపెడుతున్న అధ్యయనం!
China Covid Deaths: షాకింగ్ - చైనాలో నెల రోజుల్లో 60 వేల కరోనా మరణాలు
China on Covid-19: సంచలన నిర్ణయం తీసుకున్న చైనా, విదేశీ ప్రయాణికులకు నో క్వారంటైన్
మొండి కరోనా వైరస్ మెదడులో 8 నెలలు ఉండే అవకాశం - కొత్త అధ్యయనంలో సంచలన విషయాలు
Jagananna Chedodu : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, వారి ఖాతాల్లో రూ.10 వేలు జమ
Lakshmi Parvathi About TarakaRatna: తారకరత్నకు సీరియస్‌గా ఉంటే ఒక్కరోజైనా పాదయాత్ర ఆపలేరా?: లక్ష్మీపార్వతి ఫైర్
Rajinikanth Notice: ఇక నుంచి అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు - రజనీకాంత్ పబ్లిక్ నోటీస్!
Bandi Sanjay: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై బండి సంజయ్ హర్షం, కానీ నియంత పాలన అంటూ ట్విస్ట్