అన్వేషించండి

Fact Check: చైనాలో 450 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం పెట్టారంటూ ప్రచారం - అసలు నిజం ఇదే

Fact Check: చైనాలో 450 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేశారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది.

Fact Check: 450 అడుగుల పొడవైన బి.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని చైనాలో ఏర్పాటు చేస్తున్నారని, ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన, ఖరీదైన కాంస్య విగ్రహంగా నిలుస్తుందని చెప్తూ నిర్మాణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం యొక్క ఫోటో ఉన్న పోస్టు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. 

Fact Check: చైనాలో 450 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం పెట్టారంటూ ప్రచారం - అసలు నిజం ఇదే

ఈ పోస్టుని ఇక్కడ  చూడవచ్చు

క్లెయిమ్: 450 అడుగుల పొడవైన బి.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని చైనాలో ఏర్పాటు చేస్తున్నారు. 

ఫాక్ట్: చైనా ప్రభుత్వం తమ దేశంలో 450 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అయితే ముంబైలో ఏర్పాటు చేస్తున్న 450 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం యొక్క కొన్ని భాగాలని చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే చెప్పారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా చైనాలో భారీ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు గురించి ఇంటర్నెట్లో వెతకగా చైనా మరియు భారత మీడియాలో మాకు ఎటువంటి కథనాలు లభించలేదు. 

ఇక వైరల్ పోస్టులోని నిర్మాణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇది 2023లో విజయవాడలోని అంబేద్కర్ విగ్రహ నిర్మాణ సమయంలో తీసిన ఫోటోగా ది హిందూ (ఆర్కైవ్) వెబ్సైట్ పేర్కొంది. 125 అడుగుల ఎత్తైన ఈ విగ్రహాన్ని హైదరాబాద్‌కు చెందిన కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనే సంస్థ విజయవాడలో ఏర్పాటు(ఇన్స్టాల్) చేసింది. విగ్రహ తయారీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చైనా కంపెనీలను సంప్రదించినట్లుగా బిబిసి పేర్కొంది. 

Fact Check: చైనాలో 450 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం పెట్టారంటూ ప్రచారం - అసలు నిజం ఇదే

అయితే ముంబైలో నిర్మాణంలో ఉన్న 450 అడుగుల(350 అడుగుల విగ్రహం, 100 అడుగుల పీఠం) అంబేద్కర్ కాంస్య విగ్రహం యొక్క కొన్ని భాగాలని చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే చెప్పారు. ఈ విగ్రహం నిర్మాణం పూర్తయితే ‘ఐక్యతా ప్రతిమ’ (స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ) తర్వాత దేశంలోనే రెండో ఎత్తైన విగ్రహంగా నిలుస్తుంది. 

Fact Check: చైనాలో 450 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం పెట్టారంటూ ప్రచారం - అసలు నిజం ఇదే

చివరిగా, చైనా ప్రభుత్వం తమ దేశంలో 450 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. 

This story was originally published by factly.in, as part of the Shakti Collective. Except for the headline/excerpt/opening introduction para, this story has not been edited by ABP Desam staff.

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget