Fact Check: నోబెల్ శాంతి బహుమతి రేసులో ప్రధాని మోదీ - ఈ ప్రచారంలో నిజం ఎంత?
Nobel Peace Prize: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నోబెల్ శాంతిబహుమతి రేసులో ముందు ఉన్నాని ఓ నోబెల్ ఉన్నతాధికారికి చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ అది ఫేక్.

Prime Minister Modi Nobel Peace Prize: నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ కిందా మీదా పడుతున్నారు. తననే నామినేట్ చేయాలని దేశాలను బెదిరిస్తున్నారు. భారత్ పైనా ఆయన అక్కసు.. .నామినేట్ చేయనందుకేనని అంటున్నారు. అయితే కొంత మంది ట్రంప్ కాదని..మోడీనే నోబెల్ ప్రైజ్ రేసులో ముందున్నారని ప్రచారం చేస్తున్నారు.
నార్వేజియన్ నోబెల్ కమిటీ డిప్యూటీ లీడర్ అస్లే టోజే ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నోబెల్ శాంతి బహుమతికి "ప్రధాన అభ్యర్థి" అని పేర్కొన్నారని వీడియో వైరల్ అవుతోంది.
Deputy Leader of Nobel Peace Prize says, "PM @narendramodi is the biggest contender for the #NobelPeacePrize. pic.twitter.com/eMrKI5H8Sh
— IDU (@defencealerts) September 9, 2025
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు, ముఖ్యంగా X (పూర్వం ట్విట్టర్), ఫేస్‌బుక్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లలో ఒక వీడియో క్లిప్ విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ వీడియోలో అస్లే టోజే ప్రధాని మోదీని ప్రశంసిస్తున్నట్లు కనిపిస్తుంది. వార్తా సంస్థలు , సోషల్ మీడియా యూజర్లు దీనిని "మోదీ నోబెల్ శాంతి బహుమతికి ప్రధాన అభ్యర్థి" అని ప్రచారం చేస్తున్నారు. ఈ క్లిప్ 2023 మార్చి 16న భారత్‌లో జరిగిన ఒక ఇంటర్వ్యూకు చెందినది, అప్పుడు టోజే భారత్‌ను సందర్శించారు. మోదీని అభినందించారు కానీ మోదీని "నోబెల్ శాంతి బహుమతికి ప్రధాన అభ్యర్థి" అని చెప్పలేదు.
🚨GREAT NEWS FOR INDIA 🇮🇳
— Amitabh Chaudhary (@MithilaWaala) September 9, 2025
Prime Minister Narendra Modi has been nominated for the Nobel Peace Prize ; News Reports
Congratulations to @narendramodi ji. From sending Free COVID Vaccines to relief materials , from sending war ships to pull out people stuck in war zones to… pic.twitter.com/ahLsK33Ss0
2023 మార్చి నుంచి తరచూ వైరల్ అవుతూనే ఉంది. ఇటీవల మళ్లీ వైరల్ అయింది. ఇది పూర్తిగా తప్పుడు సమాచారం అని అస్లే టోజే స్వయంగా "ఫేక్ న్యూస్" అని తోసిపుచ్చారు.
The "fake" quote attributed to Asle Toje. By @timesofindia and other news outlets. And Mr. Toje busting it himself.
— Rahul Mukherji (@RahulMukherji5) March 16, 2023
Who planted this? And why?
I think we know the answers to both.
What we don't know is, for how long would Indian media continue to shame itself in this manner. pic.twitter.com/u3WFUnd44l
నోబెల్ శాంతి బహుమతి నార్వేజియన్ నోబెల్ కమిటీ నిర్ణయిస్తారు. నామినేషన్లు రహస్యంగా ఉంచుతారు. కమిటీ సభ్యులు ఎవరూ అభ్యర్థులు లేదా షార్ట్‌లిస్ట్ గురించి పబ్లిక్‌గా మాట్లాడరు. ఎవరైనా నామినేట్ చేయవచ్చు, కానీ అది అవార్డు గెలుచుకునే అర్హతను హామీ ఇవ్వదు.
అస్లే టోజే, కమిటీ డిప్యూటీ లీడర్‌గా, ఈ నియమాలకు కట్టుబడి ఉండాలి. అతను మోదీని ప్రశంసించినప్పటికీ, అభ్యర్థిత్వం గురించి ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. కొన్ని పోస్టులు మోదీని "నామినేట్ చేయబడ్డారు" అని చెబుతున్నాయి, కానీ నామినేషన్లు రహస్యం కాబట్టి, ఇది ఊహాగానాలు మాత్రమే.






















