అన్వేషించండి

Vaishali Takkar: ప్రముఖ టీవీ నటి ఆత్మహత్య - ఉరేసుకుంటానని ఆ రీల్ వీడియోతో హింట్? సుసైడ్ నోట్ లభ్యం

ప్రముఖ సీరియల్ నటి ఆదివారం తన ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఘటన స్థలం నుంచి పోలీసులు సుసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ప్రముఖ టీవీ నటి వైశాలీ ఠక్కర్ (30) ఆదివారం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. ఘటన స్థలం నుంచి పోలీసులు సుసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు వైశాలి మంచి ఫ్రెండ్. సుశాంత్ ఆత్మహత్య సమయంలో అతడి గురించి ఎంతో ఆందోళన చెందింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకొనేంత పిరికివాడు కాదని, అతడిని ఎవరో హత్య చేశారని అప్పట్లో ఆరోపించింది. కానీ, ఆమె కూడా చివరికి ఆత్మహత్య చేసుకుని మరణించడం అభిమానులను బాధిస్తోంది. 

సూసైడ్ నోట్ ప్రకారం.. వైశాలి మరణానికి ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్‌ కారణం కావచ్చని పోలీసులు తెలిపారు. సుసైడ్ నోట్‌‌లో కూడా ఆమె ఆ విషయాన్నే పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆమె పొరిగింట్లోనే నివసిస్తున్న మాజీ బాయ్ ఫ్రెండ్ వేదింపులు తట్టుకోలేకే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఇండోర్ ఏసీపీ రెహమాన్ తెలిపారు. ‘‘వైశాలి మరో వ్యక్తిని పెళ్లాడనున్నట్లు తెలియడంతో.. ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. పెళ్లిని చెడగొట్టేందుకు ప్రయత్నించాడు. దాని వల్ల ఆమె మానసికంగా కుమిలిపోయింది. రాహుల్ ప్రస్తుతం పరారిలో ఉన్నాడు’’ అని పేర్కొన్నారు. 

 వైశాలి 2016లో కెరీర్ ఆరంభించింది. ‘యే రిష్తా క్యా కెహ్లాతా హై’ సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చిన వైశాలి ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘ససురల్ సిమర్ కా’, ‘సూపర్ సిస్టర్స్’, ‘మన్మోహిని-2’ తదితర టీవీ సీరియల్స్‌తో ప్రేక్షకులకు దగ్గరైంది. కెన్యాలో నివసిస్తున్న అభినందన్ సింగ్ అనే డాక్టర్‌తో వైశాలికి పెళ్లి కుదిరినట్లు కుటుంబికులు తెలిపారు. అయితే, రాహుల్ వల్ల ఆమె ఎలాంటి సమస్యలను ఎదుర్కొందనేది ఇంకా తెలియరాలేదు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. దర్యాప్తు తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో రాహుల్ ఆమెను ఇబ్బంది పెట్టాడనే ఆరోపణలు వాస్తవమేనని తేలింది. 

అయితే, వైశాలి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. వారం రోజుల కిందట వైశాలి తన ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్‌ను చూపిస్తూ.. ‘‘ఆదివారం మీరు ఏం చేస్తుంటారు?’’ అని ప్రశ్నించింది. ఇందుకు సమాధానంగా ఆమె ‘‘ఫ్యాన్‌ను తిప్పుతుంటా’’ అన్నట్లుగా రీల్‌ను పోస్ట్ చేసింది. చివరికి అదే ఫ్యాన్‌కు ఆమె ఈ ఆదివారం ఉరేసుకుని చనిపోయింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vaishali Takkar (@misstakkar_15)

చివరిగా ఐదు రోజుల కిందట ఆమె మరో రీల్ వీడియో పోస్ట్ చేసింది. అందులో ‘‘నీ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తా’’ అంటూ ఓ పాట పాడింది. ఇందుకు అవతలి వ్యక్తి సమాధానంగా రూ.500 బాకీ తిరిగి ఇవ్వు ముందు అంటూ పంచ్ వేశాడు. ఈ వీడియోలన్నీ ఫన్నీగానే ఉండటంతో ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ, అదే నిజమయ్యేసరికి అభిమానులంతా షాక్‌లో ఉన్నారు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తుండే వైశాలి.. ఇలాంటి పని చేస్తూందని ఎన్నడూ అనుకోలేదని అభిమానులు అంటున్నారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Vaishali Takkar (@misstakkar_15)

Also Read: ఈ సిరీస్ చూస్తే గజగజ వణకాల్సిందే! ఎక్కువగా ఉలిక్కిపడే సీన్లతో ‘ది మిడ్ నైట్ క్లబ్’ గిన్నిస్ రికార్డు!

టాప్ హెడ్ లైన్స్

The Taj Story OTT : మూడు ఓటీటీల్లో కాంట్రవర్సియల్ కోర్ట్ రూమ్ డ్రామా - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
మూడు ఓటీటీల్లో కాంట్రవర్సియల్ కోర్ట్ రూమ్ డ్రామా - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో చూడొచ్చంటే?
Jana Nayagan OTT : జన నాయగన్ ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
జన నాయగన్ ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Chandini Chowdary : నీ కమిట్మెంట్ ఏంటో చూస్తా? - క్యాస్టింగ్ కౌచ్‌పై టాలీవుడ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
నీ కమిట్మెంట్ ఏంటో చూస్తా? - క్యాస్టింగ్ కౌచ్‌పై టాలీవుడ్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
Ramayana Release Date : విజువల్ వండర్ రామాయణ రిలీజ్ డేట్ - అదే రోజున మరో స్పెషల్
విజువల్ వండర్ రామాయణ రిలీజ్ డేట్ - అదే రోజున మరో స్పెషల్

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
రూ.2.87 లక్షల నుంచి రూ.4.05 లక్షల వరకు KTM 390 అడ్వెంచర్.. ఒక్కో వేరియంట్‌ది ఒక్కో ప్రత్యేకత
KTM 390 అడ్వెంచర్‌లో ఏ వేరియంట్ బెస్ట్? నాలుగు మోడళ్ల మధ్య పూర్తి తేడాలు ఇవే
YSRCP Protest In Vijayawada: విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
విజయవాడలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
Tarun Tejpal Judgement: అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
అత్యాచారం కేసులో దోషిగా తేలిన తరుణ్ తేజ్‌పాల్! సుప్రీంకోర్టుకు వెళ్లనున్న జర్నలిస్ట్!
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
భువీకి ఛాన్స్.. పంత్కి నో వన్డే వరల్డ్ కప్ 2027 టీమ్ ఇదేనా ?
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
ప్లెమింగ్ మాస్టర్ ప్లాన్ తో సీఎస్ కే కి డబుల్ షాక్
Embed widget