Yami Gautam: సమంత అవుట్ ఫిట్ లో యామీ గౌతమ్, వైరలవుతోన్న పోస్ట్
తాజాగా యామీ గౌతమ్ 'elle india' అనే మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. దీనికి సంబంధించి ఫొటోషూట్ లో కూడా పాల్గొంది.

బాలీవుడ్ నటి యామీ గౌతమ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది. ఇటీవల 'ఉరి' చిత్ర దర్శకుడిని పెళ్లాడింది ఈ బ్యూటీ. పెళ్లైనప్పటికీ నటిగా అవకాశాలు అందుకుంటూ.. కెరీర్ పరంగా దూసుకుపోతుంది. రీసెంట్ గా ఈమె నటించిన 'A Thursday' అనే సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకుంది.
ఇదిలా ఉండగా.. తాజాగా యామీ గౌతమ్ 'elle india' అనే మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. దీనికి సంబంధించి ఫొటోషూట్ లో కూడా పాల్గొంది. దీనికోసం యామీ వేసుకున్న కాస్ట్యూమ్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కొన్ని రోజుల క్రితం జరిగిన 'క్రిటిక్స్ చాయిస్ ఫిలిం అవార్డ్స్' అనే ఈవెంట్ లో నటి సమంత అచ్చం ఇలాంటి కాస్ట్యూమ్సే ధరించింది. ఇప్పుడు యామీ కూడా అలాంటి డ్రెస్సే వేసుకోవడంతో నెటిజన్లు ఆమెని ట్రోల్ చేస్తున్నారు.
ఇది సమంత అవుట్ ఫిట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సమంత స్టైల్ ని కాపీ చేసిన యామీ అంటూ క్యాప్షన్స్ ఇస్తున్నారు. ఇక ఈ డ్రెస్ లో యామీ కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. బ్లాక్ కలర్ హీల్స్, సింపుల్ యాక్సెసరీస్ తో ఆకట్టుకుంటుంది.
View this post on Instagram
View this post on Instagram
Before You Go
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















