Ginna OTT Release : ఓటీటీలో 'జిన్నా' విడుదల ఎప్పుడంటే? సన్నీ లియోన్, పాయల్‌తో విష్ణు మంచు సినిమా చూడటానికి రెడీనా?
Ginna Movie OTT Release : విష్ణు మంచు హీరోగా... సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించిన సినిమా 'జిన్నా'. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుంది.
![Ginna OTT Release : ఓటీటీలో 'జిన్నా' విడుదల ఎప్పుడంటే? సన్నీ లియోన్, పాయల్‌తో విష్ణు మంచు సినిమా చూడటానికి రెడీనా? Vinshnu Manchu's Ginna Movie OTT Release Starring Sunny Leone Rajput Payal To Stream on Prime Video from Dec 2nd Ginna OTT Release : ఓటీటీలో 'జిన్నా' విడుదల ఎప్పుడంటే? సన్నీ లియోన్, పాయల్‌తో విష్ణు మంచు సినిమా చూడటానికి రెడీనా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/01/deb54c9c17dd9772a9531f8605ae82eb1669893392294313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
విష్ణు మంచు (Vishnu Manchu) కథానాయకుడిగా నటించిన సినిమా 'జిన్నా' (Ginna Movie). థియేటర్లలో కొంత మంది చూశారు. మరి, మిస్ అయిన వాళ్ళ సంగతి ఏంటి? ఓటీటీలో చూడమని వెయిట్ చేసే వాళ్ళ పరిస్థితి? వాళ్ళకు ఓ గుడ్ న్యూస్. మరికొన్ని గంటల్లో ఓటీటీలో ఈ సినిమా విడుదల కానుంది.
డిసెంబర్ 2 నుంచి ఓటీటీలో 'జిన్నా'
Ginna OTT Release : 'జిన్నా' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సొంతం చేసుకుంది. డిసెంబర్ 2 నుంచి సినిమా స్ట్రీమింగ్ కానుందని తెలిసింది. పేరుకు శుక్రవారం అని చెప్పినా... గురువారం (అనగా ఈ రోజు) రాత్రి నుంచి ఓటీటీలో సినిమా వీక్షకులకు అందుబాటులోకి వస్తుంది.
తనకు హిట్స్ అందించిన కామెడీ జానర్‌లో విష్ణు మంచు చేసిన సినిమా కావడం... ఇద్దరు గ్లామరస్ హీరోయిన్లు సన్నీ లియోన్ (Sunne Leone), పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) సినిమాలో ఉండటంతో డిజిటల్ రైట్స్ ద్వారా మంచి అమౌంట్ వచ్చిందట. తెలుగుతో పాటు హిందీ, మలయాళ, తమిళ భాషల్లో 'జిన్నా' ఓటీటీ రిలీజ్ కానుంది.
హిందీ డబ్బింగ్ రైట్స్‌కు 10 కోట్లు?
Ginna Hindi Dubbing Rights : 'జిన్నా'కు కొందరు విమర్శకులు, తెలుగు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా... ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఉందని సోషల్ మీడియాలో కొంత మంది పోస్టులు చేసినా... నాలుగు సినిమాల మధ్య విడుదల కావడం వల్ల ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. 'జిన్నా' కంటే ముందు విడుదల అయిన మంచు విష్ణు సినిమాలు కొన్ని హిందీలో డబ్బింగ్ అయ్యాయి. మంచి వ్యూస్ సొంతం చేసుకున్నాయి. దానికి తోడు హిందీ ప్రేక్షకులకు బాగా తెలిసిన సన్నీ లియోన్ 'జిన్నా'లో ఉన్నారు. పాయల్ రాజ్ పుత్ కూడా గతంలో హిందీ సీరియల్ చేశారు. దాంతో 'జిన్నా' హిందీ డబ్బింగ్ రైట్స్‌కు పది కోట్ల రూపాయలు వచ్చాయని ఇండస్ట్రీ టాక్.
Also Read : 'గోల్డ్' రివ్యూ : పృథ్వీరాజ్, నయనతారతో 'ప్రేమమ్' దర్శకుడు తీసిన సినిమా
'జిన్నా' థియేటర్లలో విడుదల అయ్యే సరికి పదిహేను, పదహారు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని సమాచారం. మూవీ బడ్జెట్ 15 కోట్లు అనుకున్నా... పది కోట్ల రూపాయలు హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా వచ్చేశాయి. డిజిటల్ రైట్స్, థియేట్రికల్ కలెక్షన్స్, ఆడియో రైట్స్ వగైరా వగైరా కలుపుకొంటే బడ్జెట్ రికవరీ అవుతుందని తెలుస్తోంది. థియేట్రికల్ కలెక్షన్స్ కంటే డబ్బింగ్, ఓటీటీ రైట్స్ ద్వారా ఎక్కువ లాభం వచ్చిందట.
'జిన్నా' సినిమాలో అన్నపూర్ణమ్మ, రఘు బాబు, సీనియర్ నరేష్, సునీల్, 'వెన్నెల' కిశోర్, చమ్మక్ చంద్ర, సద్దాం తదితరులు ఇతర తారాగణం. ఈ సినిమాతో తన కుమార్తెలు అరియానా - వివియానాను సింగర్స్‌గా పరిచయం చేశారు విష్ణు మంచు. కోన వెంకట్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ చిత్రానికి ఈషాన్ సూర్య దర్శకత్వం వహించారు. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం అందించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)