అన్వేషించండి
Vijay Deverakonda: 'థమ్స్ అప్' బ్రాండ్ అంబాసిడర్ గా రౌడీ హీరో..
టాలీవుడ్ లో మహేష్ బాబు తరువాత ఆ రేంజ్ లో బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్న హీరో విజయ్ అనే చెప్పాలి.

'థమ్స్ అప్' బ్రాండ్ అంబాసిడర్ గా రౌడీ హీరో..
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండకి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. హీరోగా ఆయన చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ.. నేషనల్ వైడ్ గా ఇమేజ్ సంపాదించారు. ఇప్పుడు 'లైగర్' సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారు. ఈ సినిమా విడుదలకు ముందే విజయ్ కి బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నాయి. సినిమా షూటింగ్స్ తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తుంటారు విజయ్ దేవరకొండ.
టాలీవుడ్ లో మహేష్ బాబు తరువాత ఆ రేంజ్ లో బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తున్న హీరో విజయ్ అనే చెప్పాలి. ఇప్పటికే పలు బ్రాండ్స్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ హీరో ఇప్పుడు మరో ప్రెస్టీజియస్ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్నారు. చాలా ఏళ్లుగా 'థమ్స్ అప్' యాడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్నారు. అంతకముందు మెగాస్టార్ చిరంజీవి నటించారు.
అలాంటి బ్రాండ్ ఇప్పుడు విజయ్ దేవరకొండ చేతుల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని 'థమ్స్ అప్' కంపెనీ అఫీషియల్ గా వెల్లడించింది. చేతిలో సాఫ్ట్ డ్రింక్ పట్టుకొని ఉన్న విజయ్ ఫొటోను షేర్ చేస్తూ.. 'థమ్స్ అప్.. సాఫ్ట్ డ్రింక్ కాదు.. ఇది తుఫాన్' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ.. విజయ్ దేవరకొండ కూడా తన ట్విట్టర్ పేజ్ లో పేరు చివరన తుఫాన్ అని యాడ్ చేశారు. త్వరలోనే ఈ యాడ్ ను టీవీల్లో టెలికాస్ట్ చేయనున్నారు.
View this post on Instagram
Before You Go
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















