అన్వేషించండి

Operation Valentine Song: వాఘా బోర్డర్‌లో ‘వందేమాతరం’- ‘ఆపరేషన్ వాలంటైన్’ టీమ్ అదిరిపోయే ప్లాన్!

Operation Valentine Song: ‘ఆపరేషన్ వాలంటైన్’ మూవీ ప్రమోషన్స్ సరికొత్తగా మొదలు పెట్టబోతున్నారు మేకర్స్. వాఘా సరిహద్దులో ఈ సినిమాకు సంబంధించిన ‘వందేమాతరం’ పాటను విడుదల చేయబోతున్నారు.

Operation Valetine Movie First Song  Launch At Wagah Border:  మెగా హీరో వరుణ్ తేజ్ కథానాయకుడిగా వస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలంటైన్’. ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్స్ కు సంబంధించిన స్టోరీతో ఈ మూవీ రూపొందుతోంది. వైమానిక దాడులు, దేశభక్తి కలబోతగా తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ నిర్మితమవుతోంది. బాలీవుడ్ నటి, మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ ఈ చిత్రంలో హీరోయిన్. శక్తి ప్రతాప్ సింగ్  ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.  త్వరలో ఈ సినిమా విడుదలకు రెడీ అవుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రచార కార్యక్రమాలను ముమ్మరంగా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు.

వాఘా బార్డర్ లో ‘వందేమాతరం’ పాట విడుదల

‘ఆపరేషన్ వాలంటైన్’ మూవీ ఫిబ్రవరి 16, 2024న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో సుఖ్వీందర్ సింగ్ పాడిన ‘వందేమాతరం’ అనే పాటను వాఘా బార్డర్ లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా వాఘా బార్డర్ లో భారత్, పాక్ సైనికుల కవాతు నిర్వహిస్తారు. ఈ వేడుకలో పాల్గొనున్న చిత్రబృందం, అక్కడే ‘వందేమాతరం’ పాటను విడుదల చేయనున్నారు. వాఘా సరిహద్దులో ఓ సినిమా పాటను విడుదల చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. మిక్కి జే మేయర్ ఈ పాటను స్వరపరిచారు. తెలుగులో అనురాగ్ కులకర్ణి పాడగా, హిందీలో సుఖ్వీందర్ సింగ్ పాడారు.

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న‘ఆపరేషన్ వాలంటైన్’

ఈ సినిమాను భారత వైమానికి దాడులకు సంబంధించిన కొన్ని యథార్థ సంఘటనలను బేస్ చేసుకుని రూపొందిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇటీవల విడుదలైన టీజర్ సైతం ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది.  పాక్ ఉగ్ర స్థావరాలు, లాంఛ్ ప్యాడ్స్ మీద దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన సర్జికల్ స్ట్రైక్స్ ఆధారంగా రూపొందించినట్లు అర్థం అవుతోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్  సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. “మన దేశం గాంధీజీతో పాటు సుభాష్ చంద్రబోస్‍ది కూడా” అంటూ ఎయిర్ ఫోర్స్ కమాండర్ గా వరుణ్ తేజ్ చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.  

ఫిబ్రవరి 16న ‘ఆపరేషన్ వాలంటైన్’ విడుదల

శక్తి ప్రతాప్ సింగ్ ఈ మూవీతోనే దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 16న విడుదలకానుంది.కొంతకాలంగా సరైన హిట్ లేక బాధపడుతున్న వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలంటైన్’ మీద భారీగా అంచనాలు పెట్టుకున్నాడు. ఆయన గత చిత్రాలు వరుసగా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ‘గని’, ‘గాండీవధారి అర్జున’ సినిమాలు దారుణ ఫలితాలను ఇచ్చాయి. ఈ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి ఎక్కాలని ఆయన భావిస్తున్నారు. 

Read Also: హాలీవుడ్ మూవీలో తెలుగమ్మాయి, 'మీన్ గర్ల్స్’తో సూపర్ సక్సెస్ కొట్టిన మహేశ్ 'బ్రహ్మోత్సం' చిన్నారి

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 21th:ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
జగద్ధాత్రి సీరియల్: ఒక్కరోజులోనే కేదార్ ఆనందం ఆవిరి...పద్మతల్లిని గన్‌తో కాల్చివేసిన మినిస్టర్‌ మనుషులు
Illu Illalu Pillalu Serial Today August 21st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: అల్లుడి వెనక పరుగులు పెట్టిన వేద! చందు దగ్గర లక్షలు కొట్టేసిన భాగ్యం!
Life Of Suma: బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్షలో లైఫ్ ఆఫ్ సుమ.. బిగినర్ నుండి బిగ్ బాస్ వరకు!
Nindu Manasulu Serial Today August 21st: నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!
నిండు మనసులు: ఎమ్మెల్యే కొడుకుని అరెస్ట్ చేయించిన సిద్ధూ! షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget