అన్వేషించండి

Etv Serials: ఈటీవీలో ఒకేరోజు రెండు సీరియ‌ల్స్ ప్రారంభం.. టెలికాస్ట్‌ టైమింగ్స్ ఏంటంటే?

Etv Serials: ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు ఈటీవీ స‌రికొత్త సీరియల్స్ ని ప్రారంభించింది. ఒకేరోజు ఆ రెండు సీరియ‌ల్స్ టెలికాస్ట్ ప్రారంభం అయ్యాయి. వాటి టైమింగ్స్ త‌దిత‌ర వివ‌రాలు చూద్దాం.

Two New Sereials Started in ETV Today: ఈటీవీ త‌న ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు స‌రికొత్త సీరియ‌ల్స్ తో సిద్ధ‌మైంది. రెండు సీరియ‌ల్స్ ఒకేరోజు రెండు సీరియ‌ల్స్ టెలికాస్ట్ అయ్యాయి. అవే 'వ‌సంత కోకిల‌', 'కాంతార‌. ఈ రెండు సీరియ‌ల్స్ ఒక దాని త‌ర్వాత ఒక‌టి ప్ర‌సారం కానున్నాయి. వ‌సంత కోకిల మ‌ధ్యాహ్నం 1.30 నుంచి 2 గంట‌ల వ‌ర‌కు కాగా.. ఆ త‌ర్వాత వెంట‌నే 2 గంట‌ల నుంచి 2.30 నిమిషాల వ‌ర‌కు కాంతార ప్ర‌సారం కానుంది. సోమ‌వారం నుంచి శ‌నివారం వ‌ర‌కు ఈ సీరియ‌ల్స్ ని ఈటీవీలో చూడొచ్చు ప్రేక్ష‌కులు. జులై 2 నుంచి ఈ సిరియ‌ల్స్ ప్రారంభ‌మ‌య్యాయి.   
 
విధి ఆడిన వింత నాట‌కంలో.. 

'వ‌సంత కోకిల' సీరియ‌ల్ ప్రోమో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. సీరియ‌ల్ చూడాల‌నే ఇంట్రెస్ట్ క‌లిగిస్తుంది. దాని స్టోరీ లైన్ విష‌యానికొస్తే.. సంధ్యకి అందం, తెలివితేట‌లు అన్ని ఇచ్చాడు దేవుడు. కానీ సౌభాగ్యాన్ని దూరం చేస్తాడు. ఎన్నో ఆశ‌ల‌తో మంచి జీవితం ఊహించుకుని సూర్యాన్ని పెళ్లి చేసుకుంటుంది సంధ్య. అయితే, విధి కార‌ణంగా పెళ్లి జ‌రిగిన కొద్ది రోజుల‌కే సూర్యం క‌న్నుమూస్తాడు. భ‌ర్త‌కు ఇచ్చిన మాటకు క‌ట్టుబ‌డి సూర్య త‌ల్లిదండ్రులు మాధ‌వ‌రావు, ల‌క్ష్మీల‌ను త‌న సొంత అమ్మ‌నాన్న‌లుగా ప్రేమ‌గా చూసుకుంటుంది సంధ్య. కోడ‌లిని త‌మ కూతురిగానే భావిస్తుంటారు మాధ‌వ‌రావు, ల‌క్ష్మి. ఆమెకు మ‌ళ్లీ పెళ్లి చేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.

సంధ్య మాత్రం రెండో పెళ్లికి అంగీక‌రించ‌దు. త‌న మ‌న‌సులో సూర్యానికి త‌ప్ప మ‌రొక‌రికి చోటు లేద‌ని అంటుంది. అలాంటి సంధ్య జీవితంలోకి అనుకోకుండా ఆకాశ్ వ‌స్తాడు. సంధ్యను ప్రేమిస్తాడు. ఆమెను పెళ్లిచేసుకోవాల‌ని ఆశ‌ప‌డ‌తాడు. సంధ్య కోసం మాధ‌వ‌రావు, ల‌క్ష్మీల‌తో ఆకాష్ స్నేహంగా ఉండ‌టం మొద‌లుపెడ‌తాడు. ఇక ఈ సీరియ‌ల్ లో సంధ్య పాత్ర‌లో ప‌ద్మ ల‌క్ష, ర‌వి రాథోడ్ ఆకాశ్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. సూర్యంగా మ‌ధు క‌నిపించ‌బోతున్నాడు. ఈ సీరియ‌ల్‌కు అనిల్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అరుణ్ కుమార్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. 

'కాంతార' సీరియ‌ల్‌

జులై 2న ప్రారంభ‌మైన రెండో సీరియ‌ల్ 'కాంతార‌'. గౌర‌వ్‌, అక్ష‌య‌, ప‌వ‌న్ ర‌వీంద్ర త‌దిత‌రులు ఈ సీరియ‌ల్ లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇక క‌థ విష‌యానికొస్తే.. బుట్టాయ గూడేనికి చెందిన 'కాంతార‌', గోపి ఒక‌రినొక‌రు ప్రాణంగా ప్రేమించుకుంటారు. పెద్ద‌ల‌ను ఒప్పించిపెళ్లి పీట‌లు ఎక్కాల‌ని ఆశ‌ప‌డ‌తారు. కానీ అనుకోని ప‌రిస్థితుల్లో యువ‌రాజు తో కాంతార పెళ్లి జ‌రుగుతుంది. గోపిని కాద‌ని యువ‌రాజును కాంతార ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? ప్రియురాలికి మ‌రో యువ‌కుడితో పెళ్లి జ‌రిగింద‌నే నిజం తెలిసి గోపి ఏం చేశాడు. మ‌న‌సుకు మాంగ‌ల్యానికి మ‌ధ్య కాంతార ఎలా న‌లిగిపోయింది అనేది 'కాంతార' సీరియ‌ల్ క‌థ‌. 'కాంతార' సీరియ‌ల్‌కు శ‌ర‌త్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: జున్ను నీ కొడుకే అని మిత్రతో చెప్పిన వివేక్.. లక్ష్మీని చూసేసిన జాను!

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 30th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన జాను! సింహాద్రి చెంప పగొలగొట్టిన శారద!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన జాను! సింహాద్రి చెంప పగొలగొట్టిన శారద!
Karthika Deepam 2 Serial Today July 30th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పేరు 108 సార్లు రాసిన సూరజ్.. ఆ కామెంట్స్ వైరల్! కోడలికి పెద్దాయన స్ట్రాంగ్‌ వార్నింగ్!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పేరు 108 సార్లు రాసిన సూరజ్.. ఆ కామెంట్స్ వైరల్! కోడలికి పెద్దాయన స్ట్రాంగ్‌ వార్నింగ్!
Nindu Manasulu Serial Today July 30th: నిండు మనసులు: నీ కొడుకు ఫొటోకి దండ వేసేస్తావ్.. సారీ చెప్పిన ఎమ్మెల్యేకే సిద్ధూ సెన్సేషనల్ వార్నింగ్! గణ ఫైర్!
నిండు మనసులు: నీ కొడుకు ఫొటోకి దండ వేసేస్తావ్.. సారీ చెప్పిన ఎమ్మెల్యేకే సిద్ధూ సెన్సేషనల్ వార్నింగ్! గణ ఫైర్!
Nuvvu leka Neanu Lenu Serial Today July 30th: సుందరి చిట్టి కాదేమోనని అనుమానపడిన రాధ...విక్కీకి చెబితే ఏం చేశాడు...?
నువ్వులేక నేను లేను: సుందరి చిట్టి కాదేమోనని అనుమానపడిన రాధ...విక్కీకి చెబితే ఏం చేశాడు...?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Embed widget