Trinayani Serial Today September 16th: 'త్రినయని' సీరియల్: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లిపోవడానికి మారు వేషంలో వచ్చిన గంటలమ్మ, గజగండ!
Trinayani Today Episode సుంకమ్మ, వెంకన్నల రూపంలో గజగండ, గంటలమ్మలు విశాల్ ఇంటికి వచ్చి పాపని ఎత్తుకెళ్లిపోవడానికి ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode గాయత్రీ పాప సంగతి చూడటానికి గజగండ, గంటలమ్మ ఇంటికి వస్తారని తిలోత్తమ అంటుంది. దానికి వల్లభ నయని వాళ్లు ఇద్దరినీ చితక్కొట్టి పంచకమణి ఇచ్చే వరకు వదలరని చెప్తాడు. గజగండ వాళ్లు ఏదో రకంగా వస్తామని చెప్పారని తిలోత్తమ అంటుంది. దానికి వల్లభ వాళ్లు వచ్చినా మనం వాళ్ల విషయంలో ఇన్వాల్వ్ అవ్వొద్దని దూరంగా ఉండి జరిగింది చూద్దామని వల్లభ తిలోత్తమతో చెప్తాడు.
గజగండ, గంటలమ్మ ఇద్దరూ విశాల్ ఇంటికి సోదామె సుంకమ్మగా గంటలమ్మ, వెంకన్నగా గజగండ వేషం వేసుకొని వస్తారు. వాళ్లని గాయత్రీ పాప మేడ మీద నుంచి చూస్తుంది. తమ కొడుకుని చంపిన గాయత్రీదేవి ఆత్మని తీసుకెళ్లే వరకు నిద్రపోకూడదని గంటలమ్మ భర్తతో చెప్తుంది. గాయత్రీ పాప శరీరంలోకి గాయత్రీ దేవి ఆత్మ పంపించి అంతు చూడాలని అనుకుంటారు. తమ మీద అనుమానం వచ్చేలోపే అంతా జరిగిపోవాలని అంటుంది. ముందు గంటలమ్మ సోదామెగా ఇంటికి వెళ్తుంది. సోది చెప్తానని ఇంట్లో అందరూ బయటకు వచ్చేలా అరుస్తుంది. అందరూ ఆమెను బయటకు పంపేయ్ మంటే వల్లభ పోమ్మంటాడు. దాంతో గంటలమ్మ వల్లభకు కన్ను కొడుతుంది. అది తిలోత్తమ చూస్తుంది.
తిలోత్తమ: వల్లభకు కన్ను కొడుతుందంటే కొంపతీసి ఈమె మారు వేషంలో వచ్చిన గంటలమ్మ అయింటుందా ఏంటి. ఇంతలో గజగండ కూడా వెంకన్న అంటూ వస్తుంది. వీళ్లు ఇద్దరూ గజగండ, గంటలమ్మలే వీళ్లు వచ్చారు అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది.
సంకమ్మ: గృహలక్ష్మీ ఇంట్లో లేదు అనుకుంటా.
పావనా: భలే కరెక్ట్‌గా చెప్పిందే సుంకమ్మ.
వెంకన్న: భర్త చేయి బాగు పడాలి అని గుడికి వెళ్లినట్లుంది.
తిలోత్తమ: చూస్తుంటే మహానుభావులులా ఉన్నారు. వీళ్ల వల్ల అయినా నా కొడుకు విశాల్ చేయి బాగు పడుతుందేమో చూడాలి.
సుమన: ఏంటి అత్తయ్య మీరు నాలుగు రూపాయల కోసం ఇంటింటికి తిరిగే వీళ్లని మీరు దేవుళ్లా చూస్తున్నారు.
విశాల్: క్షమించండి మా సుమన ముక్కు సూటిగా మాట్లాడుతుంది.
తిలోత్తమ: ఒకరికి ఇద్దరు అన్నట్లు వచ్చారు విశాల్ చేతిని బాగు చేయడానికి ఏం చెప్తారో చూద్దాం.
వల్లభ: అది పంచకమణి
విశాల్: అన్నయ్య ఆగు. ఆ విషయాలు ఎందుకు.
వెంకన్న: రత్నాలతో డబ్బు సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం కాదు బాబు.
సుంకమ్మ: మీ చేతికి పురుగు కుట్టిందనుకుంటా.
వెంకన్న: మీరు అంటున్న పంచకమణి చేతులు మారిందే కానీ ఈ స్వామి చేతికి రాలేదు స్వామి.
సుమన: కరెక్టే.
తిలోత్తమ: అది లేకపోయినా విశాల్కి నయం అయ్యే మార్గం ఉందా స్వామి.
వెంకన్న: ఎందుకు ఉండదు తల్లి ఉండనే ఉంటుంది.
సుంకయ్య: ఈ తండ్రిని కన్న తల్లిని పిలవండి దారి చూపిస్తాం.
పావనా: వెళ్లండి మీ దారిన మీరు వెళ్లండి అల్లుడిని కన్న తల్లి ఎలా వస్తుంది ఎప్పుడో కాలం చేసింది.
సుంకయ్య: పునర్జన్మ ఎత్తే ఉండాలి కదా స్వామి.
విశాల్: నిజమే అమ్మ మా అమ్మ పునర్జన్మ ఎత్తింది.
వెంకన్న: ఆ తల్లి పేరును ఇంకెవరికీ పెట్టలేదా స్వామి.
ఇంతలో గాయత్రీ పాప అక్కడికి వస్తుంది. ఆ పాపే గాయత్రీ దేవి అని చెప్పేస్తారేమో అని హాసిని విశాల్ వాళ్లు టెన్షన్ పడతారు. పాపని దత్తత తీసుకున్నామని అంటారు. ఇక చేయి తగ్గే మార్గం చెప్తామని పాపని, విశాల్‌ని దగ్గరకు రమ్మని పిలుస్తారు. దుప్పటి కూడా తీసుకురమ్మని చెప్తారు. నయని రాలేదు వద్దని విశాల్ అంటాడు. దానికి అందరూ ఒకసారి ప్రయత్నించమని చెప్తారు. గంటలమ్మ, గజగండలు విశాల్‌ని మూర్ఛపోయేలా చేసి పాపని ఎత్తుకెళ్లిపోవాలి అనుకుంటారు.
విశాల్ పాప కూర్చొంటారు. వారి ముందు సుంకమ్మ, వెంకన్నలగా వచ్చిన గజగండ, గంటలమ్మ కూర్చొంటారు. నలుగురి మీద దుప్పటి కప్పుతారు. విశాల్ మీద వెంకన్న పౌడర్ మంత్రించి వేస్తాడు. విశాల్కి మెల్లగా మూర్ఛ వస్తుంది. విశాల్ చేతికి దారం కట్టడానికి రెడీ అవ్వగా ఈ లోపు గాయత్రీ పాప తండ్రి చేతిని పట్టుకొని గజగండ పీక మీదకు పెట్టి నొక్కేలా చేస్తుంది. విశాల్ ఎవరు మీరు అని పీక నొక్కుతాడు. దాంతో గజగండ, గంటలమ్మలు పంచకమణి పట్టుకొని పారిపోతారు. గాయత్రీ పాప బయటకు వస్తుంది. అందరూ దుప్పటి తీసి చూస్తే విశాల్ కళ్లు తిరిగిపోతాడు. విక్రాంత్ నీళ్లు చల్లితే విశాల్ లేస్తాడు. లేచి వాళ్లు తన మీద మత్తు మందు చల్లి గాయత్రీ పాపని ఎత్తుకొని తీసుకెళ్లిపోవడానికి వచ్చారని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: త్రినయని' సీరియల్: పాపని కిడ్నాప్ చేయనున్న గజగండ.. ఆ వాగుడుకి సుమన తల పగలగొట్టిన ఫొటో!