అన్వేషించండి

Trinayani Serial Today May 9th: 'త్రినయని' సీరియల్ : విక్రాంత్‌ చెంప పగలగొట్టిన తిలోత్తమ.. రమణమ్మ బతికే ఉందన్న నిజం తెలుసుకున్న కుటుంబం!

Trinayani Serial Today Episode : వాయు పేరుతో తిలోత్తమకు లెటర్లు రాసింది విక్రాంత్ అని ఇంట్లో అందరూ తెలుసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Episode : వాయుని చంపింది నువ్వే అని ఎందుకు ఒప్పుకున్నావని తిలోత్తమని వల్లభ ప్రశిస్తాడు. దీంతో తిలోత్తమ వాయు చనిపోయినప్పుడు గాయత్రీ అక్కయ్య ఎలా డీలా పడిపోయింది. నేనే చంపాను అని తెలిసిన విశాల్ కూడా సందిగ్ధతలో పడిపోతాడు. 

తిలోత్తమ: దాని వల్ల నాకు వచ్చిన నష్టం, భయం ఏమీ లేదు. పైగా అది జరిగి చాలా ఏళ్లు అయింది. 

వల్లభ: నువ్వు సెక్రటరీగా పని చేసినప్పుడు చాలా సీక్రెట్‌లు ఉన్నాయని చెప్పావు కదా మమ్మీ.  

తిలోత్తమ: ఉన్నాయిరా కానీ అవేంటి అన్నది నాకు కూడా సరిగా తెలీదు. 

వల్లభ: కానీ అందరి దృష్టిలో నువ్వు చెడ్డదానివి అవుతావు కదామ్మ. 

తిలోత్తమ: అది నాకు కొత్త కాదు. నయని పెట్టిన పసుపు, కుంకుమ ఎలా తుడి చేసుకున్నానో అలాగే తుడిచేసుకుంటా. 

వల్లభ: అవునులే పెద్దమ్మ రక్తాన్నే తుడి చేసిన దానివి ఇవి ఒక లెక్క. 

తిలోత్తమ: రేయ్ ఒక్కటి గుర్తు పెట్టుకో నేను ఏంటి అన్నది అందరికీ తెలుసిపోతుంది.  అందరి దృష్టి మారుతుంది. నయని వేగంగా ఆలోచిస్తుంది. ఆరా తీస్తుంది. ఈ లోపే మనం వాయుకి సంబంధించిన రహస్యాలు సంపాదించి వాటి వల్ల ప్రయోజనాలు పొంది ఎవరికీ తెలీకుండా ఎవరికీ దొరకనంత దూరంగా వెళ్లిపోవాలి. అక్క, దాని కోడలు దాని మొగుడు అందరూ స్వాహా. 

విశాల్ ఇంటికి ఓ లెటర్ వస్తుంది. అందరూ హాల్‌లోకి వచ్చి ఎవరికి వచ్చిందా అని  అనుకుంటారు. తిలోత్తమకే వచ్చిందని విశాల్ అంటాడు. తిలోత్తమ లెటర్ తీసుకుంటుంది. ఇక తిలోత్తమ లెటర్ ఓపెన్ చేసి చదువుతుంది.

లెటర్‌లో ఏముంది అంటే..

" ప్రియాతి ప్రియమైన శత్రువు తిలోత్తమకు రాయునది.. రమణమ్మ భర్త చనిపోయాక తను ఏమయ్యిందో ఎవ్వరికీ తెలీదు. ఒక్క నీకు తప్ప. నీ గురించి లోకానికి తెలిసిపోతుందన్న భయంతో రమణమ్మ జోలికి వస్తే మాత్రం". ఇట్లు వాయు..

నయని: అంటే.. మీకు..

హాసిని: ఈ రమణమ్మ ఎవరు. 

తిలోత్తమ: నాకు ఆల్ మోస్ట్ క్లారిటీ వచ్చేసినట్లే. 

సుమన: దేని గురించి..

తిలోత్తమ: చెప్తానులే..  

విక్రాంత్: క్లారిటీగా రాయనే లేదు ఇలా ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.  

తిలోత్తమ: వాయు పేరు మీద వచ్చే వన్నీ ఎవరో ఒక మనిషి రాస్తున్నారు అనే కదా. ఈ అవసరం ఎవరికి ఉంది. 

హాసిని: అది మీకే తెలియాలి. 

తిలోత్తమ: తెలుసు.. 

డమ్మక్క: తెలిస్తే చెప్పాలి కదా.

తిలోత్తమ: చెప్తే ఫీలవుతారు. ముఖ్యంగా నేను. 

హాసిని: మీరు ఎందుకు ఫీలవుతారు. 

తిలోత్తమ: ఫీలవ్వరా.. ఏ ఒక్కరూ ఫీలవ్వరా అని విక్రాంత్‌ని కొడుతుంది. అందరూ షాక్ అవుతారు. 

తన భర్తని ఎందుకు కొట్టారని సుమన తిలోత్తమను ప్రశ్నిస్తుంది. దీంతో తిలోత్తమ కొడుకు మీద తల్లికి కక్ష ఉండదు. కానీ కొడుకు తల్లి మీద కక్ష కట్టాడు. తిలోత్తమ విక్రాంత్‌ కాలర్ పట్టుకొని ఎందుకు ఉత్తరాలు రాశావని అడుగుతుంది. 

తిలోత్తమ: అంతో ఇంతో నా గురించి ఆరా తీసిన వాడు నా గురించి ఉత్తరాలు రాస్తున్నాడు. రాయడం లేదని విశాల్ తల మీద చేయి వేసి చెప్పమను.  

విశాల్: చెప్పరా.

విక్రాంత్: సారీ బ్రో. ఎస్.. నేనే. గాయత్రీ పెద్దమ్మ అపురూపంగా చూసుకున్న వాయుని మా అమ్మ ఎందుకు చంపేసిందో నాకు తెలీదు. దాని వెనక కుట్ర తెలుసుకోవాలని నయని వదిన ప్రయత్నించడం చూసి ఇలా ప్లాన్ చేశాను. (ఫ్లాష్ బ్యాక్‌లో కషాయం రంగు చీర కట్టుకున్న ఆవిడ నయనితో మాట్లాడటం విక్రాంత్ వింటాడు) 

విశాల్: రేయ్ రిస్క్ తీసుకోవద్దు అని నీకు చాలా సార్లు చెప్పాను. వాయు పేరుతో లెటర్లు వస్తున్నాయని తిలోత్తమ అమ్మ ఏమైనా చేసుకున్నా ఏమైనా చేసున్నా నీతో పాటు సుమన కూడా నష్టపోయిండేది కాదు. 

ఇక విక్రాంత్‌నే లెటర్‌ రాశాడని ఎలా తెలిసిందని పావనా మూర్తి అడిగితే విక్రాంత్‌కు ప్రియాతి ప్రియమైన అని రాయడం రాదు అని అంటుంది. 

విశాల్: రమణమ్మని నా చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. నాకే సరిగ్గా గుర్తులేదు. 

డమ్మక్క: విక్రాంత్ బాబుకి ఇవన్నీ ఎలా తెలుసు అనుకుంటున్నారు. నీ వల్లే తెలిసింది నయని. 

నయని: నా వల్లనా ఎలా.. బాబు గారు కూడా చెప్పలేదు కదా.

డమ్మక్క: నువ్వు గుడి నుంచి వచ్చినప్పుడు ఎవర్నైనా కలిశావా.

నయని అవును అంటుంది. ఇక విక్రాంత్ ఆవిడే రమణమ్మ అని చెప్తాడు. నయని షాక్ అవుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: ‘ఛీ.. నీ బ్రతుకు’ అంటూ స్వాతిపై నెటిజన్ నెగిటివ్ కామెంట్ - ఆమె రిప్లై చూస్తే ఫ్యాన్ అయిపోతారు!

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 7th: పనివాళ్ల ప్లేట్‌లో కేదార్‌కు భోజనం పెట్టి అవమానించిన యువరాజు...మరిదిని దులిపేసిన ధాత్రి
జగద్ధాత్రి సీరియల్: పనివాళ్ల ప్లేట్‌లో కేదార్‌కు భోజనం పెట్టి అవమానించిన యువరాజు...మరిదిని దులిపేసిన ధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 7th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సిరిని పాము కాటేసిందా! పిల్లలు సుభాష్‌కి దొరికిపోయారా!
Godavari Serial Today August 7th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
'గోదావరి' సీరియల్: కల్యాణ్‌ని చెప్పుతో కొట్టిన గౌతమి! చెల్లి పరిస్థితికి తల్లడిల్లిపోయిన నందు, జాను!
Nindu Manasulu Serial Today August 7th: నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!
నిండు మనసులు: సివిల్స్ ఇంటర్య్యూ అదరగొట్టిన ప్రేరణ.. కానీ! ఐసీయూ దగ్గర మరో కుట్ర!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget