Trinayani Serial Today January 9th: 'త్రినయని' సీరియల్: ముక్కోటిలో ఆత్మ చితక్కొట్టిన వల్లభ.. అఖండ ప్లాన్ తిప్పికొట్టిన గాయత్రీపాప!
Trinayani Today Episode అఖండ స్వామి ఆత్మని చూపిస్తాను అని విభూదితో ప్రయోగం చేయడం గాయత్రీ పాప అఖండకి షాక్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode అఖండ స్వామి ఇంటికి వచ్చి త్రినేత్రి ఇంటి నుంచి పారిపోలేదని నయని వెళ్లిందని అక్కడే ఉన్న నయనిని చూపించి త్రినేత్రి పాపని ఎత్తుకొని ఉందని చెప్తారు. విక్రాంత్, దురంధర అదేం కాదని నయనినే ఇంట్లో ఉందని చెప్తారు. అందరికీ మాటలతో చెప్తే వినరు సాక్ష్యాలు ఉండాలని వల్లభ అంటాడు. దానికి అఖండ స్వామి నిరూపిస్తానని అంటాడు.
ఇక ముక్కోటి నయని, త్రినేత్రి ఎవరో ఒకరు తేలిపోతే తమకు టెన్షన్ ఉండదని అంటాడు. దానికి బామ్మ అలా అంటావేంటి అంటే అదంతా వేరే కథ అని ముక్కోటి అంటాడు. అఖండ స్వామి నిరూపిస్తా అని వేరు గదికి వెళ్తాడు. నయని, దురంధర, విక్రాంత్ టెన్షన్ పడుతుంటారు.
దురంధర: అఖండ స్వామికి అనుమానం వచ్చి దేహం చెక్ చేస్తే కష్టం విక్కీ.
విక్రాంత్: అమ్మా వాళ్ల అనుమానం వేరు ఆ స్వామి ఆలోచన వేరు. పరిక్షించాలి అనుకుంటే సోదా చేయరు పిన్ని.
నయని: ఎలాంటి పూజ చేయనివ్వకూడదు. అద్దం పంపించినప్పుడు నా ఆత్మ కనిపించిన విషయం అఖండ స్వామికి చెప్పుంటారు. నేను అబద్ధం చెప్పడంతో వాళ్ల అహం దెబ్బతిని ఆయన్ను నేరుగా ఇంటికి తీసుకొచ్చారు. వాళ్లకి నా ఆత్మ కావాలి.
విక్రాంత్: ఆత్మని తీసుకెళ్లి బంధించాలని కాదు కానీ ఆత్మని చూపించి ఆయన శక్తి నిరూపించుకోవాలి అనుకొని ఉంటారు.
దురంధర: ఈ ఇగోలు దెబ్బతినే యుద్దాలు జరుగుతాయని అని అంటారు అందుకే.
నయని: అత్తయ్య విషయంలో అదే జరుగుతుంది.
దురంధర: అది ఫలించే టైంకి మనం ఎదురు దాడికి దిగుదాం
నయని: అలా చేస్తే వాళ్లే గెలిచినట్లు అవుతుంది.
అఖండ స్వామి హాల్ల్ మెట్టకు ముందు కూర్చొని కళ్లు మూసుకొని ఉంటారు. తిలోత్తమ అందరితో దివ్య దృష్టితో ఇంటి భవిష్యత్ చూస్తున్నారని చెప్తుంది. ఇంతలో గాయత్రీ పాప వచ్చి ఆఖండ స్వామి ఎదురుగా కూర్చొంటుంది. నయని వద్దని పాపని లేవమని చెప్తే అఖండ స్వామి ఉండమని చెప్తారు. అఖండ స్వామి అరచేతిలో విభూది పట్టుకుంటారు. అది ఆత్మ ఆవహించిన దేహం మీద పడుతుందని చెప్తారు. నయని, విక్రాంత్ వాళ్లు కంగారు పడతారు. బామ్మ నయనితో కంగారు పడొద్దని చెప్తుంది. అలా చెప్పారేంటి అంటే పాప ముఖం మీద పడుతుందని నయని కంగారు పడుతుందని అలా చెప్పానని అంటుంది. ఇక అఖండ స్వామి మనసులో మంత్రం చెప్తానని అప్పుడు ఆత్మ ఎవరి దేహంలో ఉందో ఆ శరీరం మీద విభూది పడుతుందని అంటారు. పాప మీద పడితే గాయత్రీ దేవి ఆత్మ వస్తుందని ఎవరూ ఏం అన్నా ఊరుకోనని అంటుంది.
అఖండ: తిలోత్తమ తెలుసుకోవాలి అనుకున్నది గాయత్రీ దేవి ఆత్మ గురించి కాదు నయని గురించి.
విక్రాంత్: మా వదినను పట్టుకొని పరాయి మనిషిలా మాట్లాడుకోవడం ఏం బాలేదు స్వామి.
బామ్మ: మా త్రినేత్రి అయితే మేం ఈ రోజు సాయంత్రమే వెళ్లిపోతాం.
దురంధర: నయని కాకపోతే అది త్రినేత్రి అయితే నయని ఆత్మ అయితే తన బాడీ ఏమైనట్లు.
విక్రాంత్: అత్తయ్య వాళ్ల పిచ్చి అనుమానాలకు నువ్వు మరో అనుమానం చెప్పకు.
అఖండ స్వామి మంత్రం చెప్పి విభూతి ఊదుతా అనే టైంకి గాయత్రీ పాప ఊదేస్తుంది. అది వెళ్లి ముక్కోటి మీద పడుతుంది. దెయ్యం ముక్కోటికి పట్టిందని వల్లభ చీపురుతో ముక్కోటిని చితక్కొడతాడు. నయని, విక్రాంత్, దురంధరలు ఊపిరి పీల్చుకుంటారు. అఖండ స్వామి ఆత్మ ముక్కోటిని ఆశ్రయించలేదని కొట్టొద్దని చెప్తాడు. నయని పాపని తీసుకొని వెళ్లిపోతుంది. అఖండ స్వామి సాయంత్రం వస్తానని చెప్పి వెళ్లిపోయారని వల్లభ తల్లితో చెప్తాడు. అఖండ స్వామి ఈ విషయాన్ని అంతగా విడిచిపెట్టరని అంటుంది. నయని చనిపోయి ఉంటే విశాల్ బతకడని తిలోత్తమ అంటే దానికి వల్లభ నయని ఇంట్లోనే ఉంటే మరి విశాల్ త్రినేత్రిని వెతకడానికి వెళ్లడం ఏంటి అని అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది..
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్, దీపల ధర్నా - జ్యోత్స్న మీద తాత సీరియస్.. తల వంచిన దశరథ్!