Trinayani Serial Today January 12th: అక్కాచెల్లెల్లు ప్రెగ్నెంట్స్ కాదని ఫ్యామిలీలో రచ్చచేసిన తిలోత్తమ, వల్లభ!
Trinayani Serial Today Episode నయని, హాసినీలు ప్రెగ్నెంట్స్ కాదని తిలోత్తమ ఇంట్లో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Today Episode: హాసిని సుమనతో.. గాయత్రీ అత్తయ్య పునర్జన్మ ఎత్తింది అంటే లేదు అన్నావ్.. ఇప్పుడు గాయత్రీ అత్తయ్య చెల్లి గర్భంలో చేరింది అంటున్నావ్ అని అంటుంది.. నీ లెక్క ప్రకారం అదే అనుకోవచ్చు అయితే నీకు అసలు విషయం చెప్పాలి అని అంటే విశాల్ వదినా అంటూ హాసినిని ఆపే ప్రయత్నం చేస్తాడు.
హాసిని: చెల్లి కన్న తొలి బిడ్డ అలియాస్ గాయత్రీ అత్తయ్య ఎక్కడ ఉందో నాకు తెలుసు.
నయని: అక్కా ఏమంటున్నావ్ నువ్వు నిజంగా నీకు తెలుసా.. ఇన్నాళ్లు నాతో కూడా చెప్పకుండా ఎందుకు ఉన్నావు అక్క.
తిలోత్తమ: ఏయ్ హాసిని ఉత్తిగే తమాషాగా అన్నాను అని అన్నావే అనుకో తాట తీస్తా.
హాసిని: కూల్ అత్తయ్య. ఫలానా చోట ఉంది అంటే ఎవరు ముందు వెళ్తారో ఎవరికీ తెలీదు. సో గాయత్రీ అత్తయ్యని నేనే మీ అందరికీ సంక్రాంతి రోజున చూపించబోతున్నాను. ఇట్స్ మై ప్రామిస్.
విశాల్: వదినా....
వల్లభ: చెప్పండి స్వామి మేము జ్యూస్‌లో విషం కలిపినా నయని ఎందుకు చనిపోలేదు.
అఖండ: దైవసమానులు ఎవరో దాన్ని మార్చి ఉంటారు.
తిలోత్తమ: అంటే శివభక్తులు డమ్మక్క, ఎద్దులయ్య వీళ్లలో ఎవరో మార్చిఉంటారురా..
వల్లభ: ఓకే ఓకే నా భార్య కూడా బతికిపోయిందికదా నో ప్రాబ్లమ్. మరి వాళ్లింద్దరూ ఆ తర్వాత ఏమయ్యారు.
అఖండ: మాయం అవ్వడం ఏంటి.
తిలోత్తమ: ఆడవారి విషయంలో చెప్పడం కష్టమేమోరా.. మరేం లేదు స్వామి కడుపునొప్పితో విలవిల్లాడిపోయిన నయని, హాసినిలు నెలతప్పారు అని డమ్మక్క చెప్పింది.
అఖండ: నయని కానీ, హాసిని కానీ ఈ సంవత్సరం గర్భం దాల్చడం అసంభవం.
తిలోత్తమ: మరి అలా అన్నారు.
అఖండ: మీకు తెలివి ఉంటే నాదాగా వచ్చేవాళ్లు కాదు. తిలోత్తమ నా దివ్య దృష్టి కాదు నీకు దూర దృష్టి కూడా ఉండదా.. విషమే పక్కన పెట్టినప్పుడు కడుపునొప్పి ఏ విధంగా వస్తుంది. అంటే అబద్ధం చెప్పారు అనే కదా. నెలతప్పడం నాటకం. వాళ్ల జాతకంలో అలా లేదు అన్నాక వాళ్లు అలా చెప్పారు అంటే మీ అందరి కళ్లు కప్పారు.
మరోవైపు పెద్దబొట్టమ్మ ఉలూచి పాపను ఎత్తుకొని ఉంటుంది. ఆ విషయం పావనామూర్తి కంగారు పడుతూ హాసినికి చెప్తాడు. ఇక హాసిని పెద్దబొట్టమ్మ దగ్గర పాపని తీసుకుంటుంది. ఇక పావనా మూర్తి సుమన చూస్తే ఏమైనా ఉందా అని అడుగుతాడు.
పెద్ద బొట్టమ్మ: తను నన్ను చూడటం కాదు ముందు పిల్లని చూడమని చెప్పండి. ఉలూచిని ఒంటరిగా తాను వదిలేస్తే ఏడుస్తూ ఉంటే ఎత్తుకునేవాళ్లే లేరని నేను ఎత్తుకున్నాను.
డమ్మక్క: ఇక్కడ దాకా మంచి పనే చేశావు కానీ రాహుకాలం రాబోతుంది వెళ్లు పెద్ద బొట్టమ్మ.
ఎద్దులయ్య: అదీ కాకుండా తిలోత్తమ వాళ్లు బయటకి వెళ్లి తిరిగివస్తున్నారు. వాళ్లు వస్తుంది మామూలు వ్యక్తుల దగ్గర నుంచి కాదు. జాగ్రత్తగా ఉండాలి.
పావనా: అవును హాసిని నువ్వూ నయని అసలే ఒట్టిమనుషులు కూడా కాదు.
పెద్దబొట్టమ్మ: మళ్లీ నీల్లోసుకున్నారా అమ్మా.. అని పెద్దబొట్టమ్మ హాసినిని పరిశీలనగా చూసి పుట్టుక వాసన రావడం లేదు హాసిని అని అంటుంది.
సుమన: ఉలూచి పాప హాసిని అక్క దగ్గర ఉందా.. అక్కా.. అక్కా.. ఇక్కడేం చేస్తున్నావ్ అక్కా. ఇక పెద్దబొట్టమ్మ పాములా మారితే డమ్మక్క తనకి అడ్డంగా నిల్చొంటుంది.
నయని: ఏంటి అత్తయ్య మా కడుపుల మీద పడ్డారు.
తిలోత్తమ: ఏ విషయంలోనైనా పర్వాలేదు కానీ గర్భం పేరిట సుమన కడుపు మీద కొట్టకూడదు అంటున్నాను.
విశాల్: అర్థం కాలేదు అమ్మా. మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఇంకొకటి మాట్లాడుతున్నారు అనిపిస్తోంది. ఏమైనా ప్రాబ్లమా.
వల్లభ: డమ్మో డమ్మ.. డమరుకం మాట్లాడకుండా ఉందేంటి మమ్మీ.
తిలోత్తమ: గర్భాన్ని అయితే తొమ్మిది నెలల వరకు మోయాలి మూర్తి. అసలు విషయాన్ని అయితే ఎంత తొందరగా కక్కేస్తే అంత మంచిది. మరి ఎందుకు మీరు మామిడి కాయ అడగడం లేదు.
సుమన: పెద్దబావగారు నా కడుపు కొట్టకూడదు అంటున్నారు. మళ్లీ అక్కల గర్భం గురించి మాట్లాడుతున్నారు. కాస్త అర్థమయ్యేలా చెప్తారా..
వల్లభ: ఇప్పుడు నెలతప్పిన హాసిని, నయనిలు ఎప్పుడు కంటారు అనుకుంటున్నారు.
తిలోత్తమ: సారీ విశాల్ ఈసారీ డాక్టర్స్ కూడా చెప్పలేరు.
ఫ్లాష్‌బ్యాక్‌లో నయని దివ్య దృష్టితో విషం కలిపిన జ్యూస్ తాగి పడిపోవడం నయని చూస్తుంది. కంగారుగా అక్క అక్కా అంటూ వెళ్లి హాసినిని పట్టుకొని నువ్వేం తాగలేదు కదా అని అడుగుతుంది. ఇక నీ ప్రాణం పోయేలా ఉంది అక్క అని నయని చెప్తుంది. దీంతో ఇలా అన్నావ్ ఏంటి చెల్లి గండం ఏమైనా కనిపించి చచ్చిందా అని అడుగుతుంది. ఇక డమ్మక్క ఇద్దరినీ కంగారు పడొద్దు అని అసలు నీకు ఏం కనిపించిందో వివరంగా చెప్పు అని నయనిని అడుగుతుంది.
నయని: పళ్ల రసం ఉన్న స్టీల్ గ్లాస్ పడిపోయినట్లు కనిపించింది డమ్మక్క. దాని పక్కనే హాసిని అక్క నేలకొరిగింది.
డమ్మక్క: నయని ప్రమాదం తలపెట్టేది ఎవరు అని నీ సందేహం.
నయని: ఇంకెవరూ తిలోత్తమ అత్తయ్య మీదే నా డౌట్. నా అంచనా ప్రకారం ఈ రోజు పార్టీలోనే ఏదో చేయాలి అనుకుంటున్నారు. ఒకపని చేద్దాం అక్క.. పార్టీలో నేను పళ్ల రసం తాగుతాను అని స్టీల్ గ్లాస్ పెట్టిస్తాను. నా లెక్క ప్రకారం నీకు హాని జరిగితే నాకు ముందే తెలుస్తుంది కాబట్టి నన్ను టార్గెట్ చేసుంటారు. ఆ స్టీల్ గ్లాస్‌లో పళ్ల రసం ఉంచితే అత్తయ్య వాళ్లు అందులోనే ఏదో కలుపుతారు. అది తాగినట్లు నాటకం ఆడొచ్చు.
హాసిని: ఈ నాటకంతో పాటు వాళ్లని భయపెట్టేలా చేయాలి.
డమ్మక్క: అది తాగాక మీరు కడుపునొప్పి వచ్చినట్లు నటించండి నేను మీరు నెలతప్పారు అని చెప్తాను.
నయని: ఈ ఉపాయం ఏదో బాగుంది. గాయత్రీ అమ్మ గారి గురించి ఆలోచించే వారి దృష్టి కూడా మరలచ్చొచ్చు.
హాసిని: డమ్మక్క వాళ్లు తెచ్చే విషాన్ని మార్చాలి మర్చిపోవద్దు.
విక్రాంత్: ఇక్కడ ఎవరికీ మొహమాటం లేదు నిజం చెప్పండి.
తిలోత్తమ: నయని, హాసిని తోడికోడళ్లు ఇద్దరూ ఆడి పాడిన తర్వాత ఆడిన భూటకపు నాటకం కడుపు డ్రామా.
విశాల్: నయని అమ్మ అంటుంది..
హాసిని: అబద్దం విశాల్.. మేము నీళ్లోసుకోలేదు అని మళ్లీ మీకు అనుమానం వచ్చి చచ్చాందా..
విక్రాంత్: వీళ్లకి నమ్మకం లేకపోతే పోయింది వదినా. ఓ రెండు నెలలు ఆగితే సీమంతం. అప్పుడు నాలుగు నెలలు ఆగితే చంటి పిల్లలు వస్తారు. అప్పుడు తెలుస్తుంది వీళ్లకి.
తిలోత్తమ: రేయ్ విక్రాంత్ వీళ్లు గర్భం దాల్చారు అని నిర్ధారించింది ఎవరు.
విశాల్: డమ్మక్క నాడి పట్టుకొని చెప్పింది కదా అమ్మ.
ధురందర: ఆ తర్వాత మన వీధి లోని గైనకాలజిస్ట్ చెప్పింది అని చెప్పారు కదా..
వల్లభ: డాక్టరమ్మ అమెరికా వెళ్లి నెల అయింది. వీళ్లు నెల తప్పినట్లు ఆవిడ చెప్పింది అనుకోవడం అబద్ధం కాదా అని వల్లభ ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: Amardeep: తేజూను తీసుకెళ్లిపోతామంటూ బూతులు తిట్టారు - ఆకతాయిల దాడిపై అమర్‌దీప్ భావోద్వేగం