అన్వేషించండి

Trinayani Serial Today August 27th: ‘త్రినయని’ సీరియల్‌: గజగండను దించిన తిలొత్తమ్మ – విశాల్ ప్రమాదాన్ని పసిగట్టిన గురువుగారు

Trinayani Today Episode: విశాల్ చేయిని పూర్తిగా లేకుండా చేయాలని తిలొత్తమ్మ గజగండను పిలవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Trinayani Serial Today Episode:  గాయత్రీ పాప నిద్ర లేస్తుంది పూతని చూసి నవ్వుతుంది. డబ్బులు వేస్ట్ అయ్యాయని తిలోత్తమ, వల్లభలు ఫీలవుతారు. నయని, హాసినిలు అక్కడికి వచ్చి సెటైర్లు వేస్తారు. తర్వాత తిలొత్తమ్మ, విక్రాంత్‌ వాళ్లకు పెట్టే జోలికి రావొద్దని నయని వార్నింగ్‌ ఇస్తుంది. దీంతో అందరి మధ్య చిన్నపాటి గొడవ జరుగుతుంది. ఆస్థి కోసం మీరు విశాల్‌ ను టార్గెట్‌ చేస్తున్నారని నాకు పెళ్లి అయిన రెండు రోజులకే తెలిసిందని హాసిని చెప్తుంది. దీంతో నయని షాక్‌ అవుతుంది. నేను వచ్చే వరకు బాబు గారిని జాగ్రత్తగా చూసుకున్నందుకు చాలా థాంక్స్‌ అని నయని చెప్తుంది. మరోవైపు విక్రాంత్‌, సుమన మాట్లాడుకుంటారు.

విక్రాంత్‌: ఏం ఆలోచిస్తున్నావు.

సుమన: సంస్కృతం నేర్చుకోవాలా? వద్దా అని..

విక్రాంత్‌: ఇంత సడెన్‌గా నిర్ణయం మారింది ఏంటి? నిన్న నా లాప్‌ టాప్‌ తీసుకుని ఇంటర్‌నెట్‌లో సంస్కృతం పాఠాలు బట్టి పట్టావు కదా?

సుమన: అన్ని తెలిసే అడుగుతారెందుకు బుల్లి బావగారు. పెద్దత్తయ్య గారి ఆత్మ వచ్చి ఒక మనిషిని పెట్టెతో కొట్టింది కదా?

విక్రాంత్‌: సంస్కృతం రాదని అతడు పారిపోయాడు. కానీ నువ్వైతే వచ్చిన సంస్కృతాన్ని పిలకేస్తావు. అప్పుడు పెద్దమ్మ నిన్ను చెక్కపెట్టేతో కాదు. ఇనప పెట్టెతో బాధేస్తుంది.

సుమన: అమ్మో ఇక చెప్పకండి ఊహించుకుంటేనే భయమేస్తుంది.

విక్రాంత్‌: అందుకే చెప్పేది మనది కాని దాని కోసం ప్రయత్నం చేయడం అంటే పాపం చేయడం అని.

సుమన: మరి విలువైన పంచకమణిని తీసుకొచ్చేది ఎలా?

విక్రాంత్‌: బయటకు వెళ్లి గొ పంచకం తీసుకురాలేవు కానీ నీకు పంచకమణి కావాలా?

సుమన: నాకని కాదండి అందరికీ ఉపయోగపడుతుంది.

విక్రాంత్‌: అబ్బా చా నువ్వు తీర్తం తాగాక వెంటనే ఎందుకు కడిగేసుకుంటావు.

సుమన: కాస్త జిడ్డుగా ఉంటుందని..

విక్రాంత్‌: వాస్తవానికి అందుకు కాదు ఎక్కడ ఏ కుక్కో, పిల్లో వచ్చి నీ చెయ్యి నాకేస్తుందని..

సుమన: నాకు బాగానే చెప్తున్నారు కానీ మీ పెద్దమ్మ గారి గురించి మాత్రం ఏం చెప్పరు.

విక్రాంత్‌: ఆమె గురించి చరిత్ర చెప్తుంది.

సుమన: అది కాదు నేను అనేది. మరి సంస్కృతం తెలిసి ఆవిడ ఆత్మగా ఇంటికి వచ్చి బెదిరించిపోయిందే తప్పా.. కొడుకు ఆరోగ్యం కోసం అయినా సంస్కృతం గురించి చెప్పొచ్చు కదా?

విక్రాంత్‌: ఇప్పుడు చెప్పకూడదు అనుకుందేమో..?

 అని విక్రాంత్‌ చెప్పగానే వాయిదాలు వేసుకునే టైం లేదని.. విశాల్‌ రోజురోజుకు నరకం అనుభవిస్తున్నారని సుమన అంటుంది. దీంతో విక్రాంత్‌ సుమనకు వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతాడు. మరోవైపు తిలొత్తమ, వల్లభ గార్డెన్ లో గజగండ కోసం ఎదురుచూస్తుంటారు. ఇంట్లో ఎవరైనా చూస్తే అని వల్లభ భయపడతాడు. గజగండను ఎవ్వరూ చూడలేదని తిలొత్తమ్మ చెప్తుంది. ఇంతలో గజగండ గురువు గారు చూశారని వస్తాడు. వల్లభ ఎందుకు వచ్చారని అడుగుతాడు. విశాల్‌ చెయ్యి నయం చేయడానికి వచ్చానని గజగండ చెప్తాడు. దీంతో గజగండ లోపలికి ఎలా రావాలో ప్లాన్‌ చెప్పి వెళ్తారు.

    లోపల విశాల్‌ చెయ్యి పట్టుకుని బాధపడుతుంటాడు. ఇంతలో తిలొత్తమ్మ లోపలికి వచ్చి గజగండ గురించి చెప్తారు. అప్పుడే గజగండ లోపలికి వస్తాడు. పూజారిలా ఉన్నారు మీరు వైద్యం చేస్తారా? అని దురందర అడుగుతుంది. మా వంశపార్యపరంగా విద్య నేర్చుకున్నానని గజగండ చెప్తాడు. మరోవైపు గురువుగారు నయని ఇంట్లో ఏదో జరగబోతుంది వెంటనే వెళ్లి జాగ్రత్తగా ఉండమని చెప్పాలని వెళ్తుంటాడు. మరోవైపు గజగండ విశాల్‌ కు వైద్యం చేస్తుంటే గురువుగారు గట్టిగా విశాల్‌, నయని అంటూ ఇంట్లో వస్తుంటాడు. వెంటనే వల్లభ, గురువుగారికి ఎదురుగా వెళ్లి కళ్లల్లో పౌడర్‌ వేస్తాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: ‘సీతే రాముడి కట్నం సీరియల్‌ : ఇంటి తాళాల కోసం సీత ప్రయత్నం – నాటకం ఆడి రామ్ ను కూల్ చేసిన మహా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Embed widget