Trinayani Serial Today December 19th: 'త్రినయని' సీరియల్: ఆ నయని వేరు ఈ నయని వేరు అని హాస్పిటల్ బిల్స్‌తో ఫ్రూవ్ చేసిన తిలోత్తమ!
Trinayani Today Episode నయని వేరే నయని కోసం హాస్పిటల్‌లో బిల్ కట్టిందని ఇంట్లో ఉన్నది త్రినేత్రి అని తిలోత్తమ అందరితో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Trinayani Serial Today Episode నయని పేరు మీద హాస్పిటల్ నుంచి బిల్ వస్తుంది. బెటర్ ట్రీట్‌మెంట్ కోసం వేరే హాస్పిటల్‌కి మార్చాం కదా ఆ బిల్ అని విక్రాంత్ అంటాడు. ఇక తిలోత్తమ అయితే గతంలో ట్రీట్‌మెంట్ అయి నయని ఇంటికి కూడా వచ్చేసింది కదా మరి సగం బిల్ అయినా కడితేనే ట్రీట్‌మెంట్ చేస్తామని ఎందుకు అన్నారని అడుగుతుంది. పొరపాటున అలా అనుకుంటారని నయని అంటుంది. ఇక విశాల్ బిల్ మొత్తం కట్టేస్తా అని అంటే నయని నేను మాట్లాడి కడతానని అంటుంది. ఇక హాసిని వచ్చిన అతను ఎదురుగా ఉన్న నయనిని ఎందుకు గుర్తు పట్టలేదని అడుగుతుంది. మళ్లీ అందరికీ అనుమానం వస్తుంది. పేషెంట్ ఎవరో వాడికి తెలియకపోయింటుందని వల్లభ అంటాడు. ఇక హాసిని తిలోత్తమ, వల్లభల దగ్గరకు వెళ్లి వాళ్లని హగ్ చేసుకొని మాటలతో కన్ఫ్యూజ్ చేస్తుంది.
తిలోత్తమ వల్లభతో అది మనల్ని కావాలనే డిస్ట్రబ్ చేయడానికి వచ్చిందని చెప్తుంది. లిల్లీస్ హాస్పిటల్‌లో నయని పేరిట బిల్ వచ్చిందంటే అక్కడే ఏదో లొల్లి ఉందని తిలోత్తమ వల్లభతో చెప్తుంది. ఇక తన ప్లాన్‌ని వల్లభతో చెప్తుంది. తిలోత్తమ మాటలకు వల్లభ తల ఊపి అలాగే చేద్దామని అంటాడు. ఇక విశాల్ బిల్ తీసి చూస్తుంటే నయని వచ్చి తీసుకొని వాటి గురించి నేను చూసుకుంటాను కదా అని అంటుంది. దానికి విశాల్ మాట్లాడటం కాదు వాళ్లని నిలదీయాలని అంటాడు. నీకు యాక్సిడెంట్ అయిన నాటి నుంచి ఇంకా నీకు వైద్యం అవుతున్నట్లు బిల్ పంపారంటే మోసం చేస్తున్నట్లే కదా అని అంటాడు. ఆ హాస్పిటల్ మీద కంప్లైంట్ ఇస్తానని విశాల్ అంటే నయని వద్దంటుంది. నేనే వాళ్లతో మాట్లాడుతా కదా ఇంకెందుకు అని అంటుంది. నయనితనలో తాను బాబు గారు నేను మీ కళ్ల ముందు కనిపిస్తున్నాను కానీ నా దేహం హాస్పిటల్‌లోనే ఉందని అనుకుంటుంది.
సుమన విక్రాంత్ దగ్గరకు వెళ్లి బిల్ గురించి మాట్లాడుతుంది. మా అక్క హాస్పిటల్‌లో ఉన్నప్పుడు బిలింగ్ పేరుతో లక్షలు కొట్టేయలేదని విక్రాంత్ మీద తన డబ్బు పిచ్చి గురించి చెప్తుంది. విక్రాంత్ సుమనను తిడతాడు. నయని వదిన ముందు నేను చిల్లర గాడినని తెలుసుంటే ఏదో హోటల్‌లో పనికి వెళ్లాల్సి వచ్చుండేదని అంటాడు. సుమనను తిట్టి పంపేస్తాడు. ఇక విశాల్, హాసిని ఫైల్స్ చూస్తుంటే తిలోత్తమ వచ్చి అందరినీ పిలవమని చెప్తుంది. అందరూ అక్కడికి వస్తారు.
తిలోత్తమ: లిల్లీస్ హాస్పిటల్ వాళ్లకి ఈ నయని డబ్బులు కట్టింది.
హాసిని: బ్యాలెన్స్ డబ్బు కట్టడం మంచిదే కదా.
సుమన: డబ్బు ఏమైనా తగ్గించారా అక్క పైగా నువ్వు ఆడ్మిట్ అయిన రెండు రోజులకే కోలుకొని వచ్చేశావ్ కదా.
దురంధర: రెండు రోజులకే అంత బిల్ ఎందుకని సుమన ఉద్దేశం.
నయని: ఆ గొడవ వదిలేయండి అయిపోయిన దాని గురించి ఎందుకు మాట్లాడుకోవడం.
తిలోత్తమ: నువ్వు అంత తేలికగా చెప్తే ఎలా నయని నువ్వు హాస్పిటల్‌లో ఎవరికి బిల్ కట్టావో తెలియాలి కదా. హాస్పిటల్‌లో ఈ నయని ఇంకో నయని కోసం డబ్బు కట్టింది విశాల్. అందరూ నోరెళ్ల బెడతారు.
విశాల్: నయని ఇంకో నయనికి సాయం చేసిందంటోంది అమ్మ.
విక్రాంత్: అమ్మ మాటలు వింటుంటే పిచ్చెక్కిపోతుంది బ్రో
తిలోత్తమ: రేయ్ విక్రాంత్ మనందరిని పిచ్చోళ్లని చేసి ఆడుకుంటుందిరా దేవీ పురం త్రినేత్రి.
పావనా: మళ్లీ మొదటకి వచ్చావా అక్క.
హాసిని: వీళ్లకి కాలక్షేపం కాదనుకుంటా మా ఆయన మిస్ అయ్యాడు.
తిలోత్తమ: వాడు వస్తాడు మీకు సాక్ష్యాలు కావాలి కదా వాటిని తీసుకొని వస్తాడు.
నయనికి ఇంకా మెరుగైన వైద్యం అందించమని లిల్లీస్ హాస్పిటల్‌కి 50 లక్షల చెక్ ఈ నయని ఇచ్చిందని తిలోత్తమ చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. మీకు ఎవరు చెప్పారని నయని అంటుంది. దానికి నువ్వు బ్యాంక్ చెక్క ఇచ్చావు కదా అని నెంబరు చెప్తుంది. తనే నయని అయితే నయనికి మెరుగైన వైద్యం అందించమని చెప్పడం ఏంటి అని అంటుంది. ఇక దానికి సుమన ఈమె త్రినేత్రి అయితే మరి మా అక్క హాస్పిటల్‌లో ఉందా అని సుమన అంటే ఆ విషయం చెప్పడానికే వల్లభ వెళ్లాడు వచ్చి చెప్తాడని అంటుంది. ఇంతలో వల్లభ వచ్చి నయని అనే పేరుతో ఎవరూ లేరని చెప్తాడు. తిలోత్తమ షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.