అన్వేషించండి

Trinayani Serial Today December 19th Episode నాగులాపురం గవ్వతో మరోసారి తిలోత్తమను ఇబ్బంది పెట్టిన గాయత్రీపాప!

Trinayani Today Episode: తిలోత్తమ గాయానికి కట్టే కట్టులో నాగులాపురం గవ్వను గాయత్రీ పాప ఉంచేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode: 

విక్రాంత్: బ్రో విశాల్ బ్రోకి తెలీదు అంట నాన్న రివాల్వర్ తీసుకొస్తాడని.. 
తిలోత్తమ: ఎవడ్రా నాన్న.. నా ప్రాణం తీయాలి అనుకున్నవాడిని నాన్న అంటావా. 
విక్రాంత్: అమ్మా నాన్నకి నిన్ను చంపే ఆలోచన ఎందుకు వచ్చిందో ఇక్కడ నీకు తప్ప ఇంకా ఎవరికీ తెలీదు.
హాసిని: చెప్పండి అత్తయ్య మొదటి మామయ్య మిమల్ని సుమంగళిగా పంపించి ఎందుకు పుణ్యం కట్టుకోవాలి అనుకున్నారు.
తిలోత్తమ: గాయత్రీ అక్కయ్యని చంపింది తనే అని నేను నిజం చెప్పినందుకు నన్ను చంపాలి అని కక్ష కట్టుకున్నాడు. విశాల్ గుడ్డిగా నమ్మి ఇంట్లోకి తీసుకొచ్చినందుకు నన్ను టార్గెట్ చేశాడు.
విశాల్: అమ్మా నేను గంగాధర్ ఏం తప్పు చేయలేదు అని నమ్మినట్టే నిన్ను కూడా మా అమ్మ నమ్మే సెక్రటరీని చేసుకుంది కదా.
తిలోత్తమ: షాక్ అయి మనసులో.. ఇదేంటి వీడు ఇలా అంటున్నాడు. హత్యా నేరం చేసింది నేనే అని తెలిసిపోయిందా ఏంటి. 
విశాల్: నీకన్నా ముందే గంగాధరం మా అమ్మ దగ్గర డ్రైవర్‌గా పనిచేశాడు. నువ్వు ఎందుకు ఆ గంగాధరం భార్యవి అని మా అమ్మ దగ్గర దాచావో చెప్తే నయని ఆ మల్లెపూలు మ్యాటర్ చెప్తుంది. 
నయని: బాబు గారు 20 ఏళ్ల క్రితం జరిగిన విషయాలు ఇప్పుడు ఎందుకు.
విశాల్: సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. నువ్వు అయినా.. నేను అయినా.. అమ్మ అయినా.. కారణాలు ఎందుకు దాస్తున్నామో అందరికీ తెలిస్తే మనస్పర్థలు పోతాయి అని నా ఉద్దేశం. 
విక్రాంత్: చెప్పు అమ్మా.. చిన్న పిల్లలు అయిన మాకు నాన్న చనిపోయాడు అని ఎందుకు అబద్ధం చెప్పావు. బంగ్లాలో సెటిల్ అయిపోవచ్చు అనా..
పావనా: ఏంటి అక్కయ్య మర్చిపోయావా.. గుర్తు చేసుకోవాలి అనుకుంటున్నవా.. 
తిలోత్తమ: ఏంటి అందరూ నన్ను తప్పు పట్టాలి అనుకుంటున్నారా..
సుమన: నేను అయితే ఏం అనుకోవడం లేదు అత్తయ్య. విశాల్ బావగారి వల్లే మీకు ఇలా జరిగింది అని.
తిలోత్తమ: ఆపేయ్.. సుమన.. నేను అయితే ఇప్పుడు చనిపోలేదు కదా.. రేయ్ పదరా..
హాసిని: ఒక్క నిమిషం అత్తయ్య.. గండం మీకు మాత్రమే గాయత్రీ పాపకు కూడా పోయినట్లే.. మనం ముచ్చట్టు ఆడుకుంటుంటే ఎంచక్కా పాలు తాగి పడుకుందో. 

మరోవైపు సుమన సెల్ చూసుకుంటుంటే.. విక్రాంత్ కోపడ్డతాడు. దీంతో సుమన తన కూతురు ఉలూచి రాత్రి పూట ఆడపిల్లలా ఉండదు కాబట్టి తనకు బిడ్డతో ఏ ఇబ్బంది ఉండదు కనుకే టైం దొరికి సెల్ చూస్తున్నా అంటుంది. అయితే విశాల్‌ను తన తల్లి తిలోత్తమ బ్లేమ్ చేయడం వల్ల తనకు ప్రశాంతత లేదు అని విక్రాంత్ అంటాడు. ఇక మరోవైపు తిలోత్తమ హాల్‌లో కూర్చొని ఉంటుంది. వల్లభ తనకి కట్టు కట్టాలని అన్ని సిద్ధం చేస్తుంటాడు. ఇంతలో ఏదో మందు తీసుకురావడానికి లోపలకి వెళ్తాడు. ఇంతలో గాయత్రీ పాప అక్కడికి వచ్చి తిలోత్తమ కట్టు కట్టడానికి ఉంచిన క్లాత్‌లో గవ్వను పెట్టేస్తుంది. అది తెలీక వల్లభ తిలోత్తమకు కట్టు కడితే తిలోత్తమ నొప్పితో విలవిల్లాడిపోతుంది. 

విశాల్: అన్నయ్య కట్టు మరీ గట్టిగా కట్టావా..
తిలోత్తమ: కట్టు కాదు.. ముళ్లులు గుచ్చినట్లు ఉంది.. గునపంతో గుచ్చినట్లు ఉంది.. తట్టుకోలేకపోతున్నాను. నొప్పి ఎక్కువ అవుతుంది విశాల్.. నా చేయి పడిపోయి పక్షవాతం వచ్చేలా ఉంది. (ఇక అది చూసి గాయత్రీ పాప నవ్వుకుంటుంది. మరో వైపు సుమన తన చేతిలో ఉలూచిని ఎత్తుకుంటూ వెళ్లి తిలోత్తమకు ధైర్యం చెప్తుంది. ఇంతలో ఉలూచి తిలోత్తమకు గాయం అయిన చోట తన చేతితో తాకితే ఒక్కసారిగా నొప్పి తగ్గిపోతుంది.) సడెన్‌గా నొప్పి ఆగింది.. ఇప్పుడు నొప్పి లేదు. 
విక్రాంత్: ఉలూచి అమ్మ చేతికి ఉన్న కట్టుని పట్టుకుంది.( ఉలూచి చేయి తీయగానే తిలోత్తమ నొప్పితో విలవిల్లాడిపోంతుంది.)
నయని: ఉలూచి పట్టుకున్నప్పుడే నొప్పి తగ్గుతుంది అంటే ఆ కట్టులోనే ఏదో ఉంది బాబు. 
ఇక విశాల్ కట్టు విప్పుతాడు. అందులో గవ్వ ఒకటి ఉంటుంది. అందరూ వల్లభ కట్టాడు అనుకుంటారు. 
సుమన: ఉలూచి పట్టుకోగానే నొప్పి ఆగిపోయింది అంటే గవ్వలో ఏదో శక్తి ఉంది.
నయని: అసలు నాగులాపురం పెట్టెలో ఉండే గవ్వను ఎవరు బయటకు తీశారు. 
విక్రాంత్: వదినా నేను తీసుంటే చెప్తే వాడిని.. అయినా ఐదు గవ్వలకు బదులు ఒకటే ఉంది. 
పావనా: పిల్లలు తీసేసుంటారు లేమ్మా.
విశాల్: ఆ పెట్టే తెరవాలి అంటే బలం కావాలి. 
హాసిని: (విశాల్‌కు గాయత్రీ పాపే అని సైగ చేస్తూ) కండ బలం కంటే బుద్ధి బలం ఉండేవాళ్లే ఇలా చేసుంటారు విశాల్.
విక్రాంత్: ఉలూచి పాపకి ఆ గవ్వకు ఏం సంబంధం ఉందో తెలుసుకోవాలి. 

మరోవైపు గాయత్రీపాపను అక్కడి నుంచి తీసుకెళ్లిన నయని.. పాప దగ్గర బొమ్మలు పెట్టి ఆడుకోమని చెప్పి.. తిలోత్తమ అత్తయ్య ఉండే దగ్గరకు వెళ్లొద్దు అని చెప్తుంది. ఇక అప్పుడే అక్కడి వచ్చిన హాసిని.. నువ్వు అలా ఎందుకు అంటున్నావో తెలుసు చెల్లి. తిలోత్తమ అత్తయ్యకు ఏం జరిగినా అక్కడ గాయత్రీ పాప ఉండటం వల్ల అందరూ పాప మీద నింద వేస్తారు అనే కదా నీ భయం అని అడుగుతుంది. దీంతో అవును అని నయని చెప్తుంది. ఇక సుమన అక్కడికి వచ్చి ఉలూచికి, నాగులాపురం గవ్వలకు ఏదో సంబంధం ఉంది అని విక్రాంత్ అడిగితే ఎందుకు ఏం చెప్పలేదు అని తన అక్క నయనిని అడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.

టాప్ హెడ్ లైన్స్

UDID Card Apply Online: దివ్యాంగుల సేవలకు సింగిల్ కార్డు.. యూడీఐడీ దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!
దివ్యాంగుల సేవలకు సింగిల్ కార్డు.. యూడీఐడీ దరఖాస్తు విధానం, అర్హతలు ఇవే!
Godavari Serial Today July 2nd: 'గోదావరి' సీరియల్: జానుకి నగలు ఇచ్చేసిన నందు! నందుని కొట్టిన శాంతి! జాను ఎమోషనల్!
'గోదావరి' సీరియల్: జానుకి నగలు ఇచ్చేసిన నందు! నందుని కొట్టిన శాంతి! జాను ఎమోషనల్!
Nindu Manasulu Serial Today July 2nd: నిండు మనసులు: సాహితి కోసం ఇంటికొచ్చిన వరుణ్ తల్లి! వరుణ్‌ తల పగలగొట్టేసిన గణ!
నిండు మనసులు: సాహితి కోసం ఇంటికొచ్చిన వరుణ్ తల్లి! వరుణ్‌ తల పగలగొట్టేసిన గణ!
Karthika Deepam 2 Serial Today July 2nd: కార్తీకదీపం 2 సీరియల్: సింపథీతో ఏ మగాడు కాపురం చేయడు..! సూరజ్ మాటలకు జ్యోత్స్న మారుతుందా!
కార్తీకదీపం 2 సీరియల్: సింపథీతో ఏ మగాడు కాపురం చేయడు..! సూరజ్ మాటలకు జ్యోత్స్న మారుతుందా!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Basara Temple Theft Case: బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !
KTR Latest News:సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
సవాళ్లు విసిరి పారిపోయారు, అసెంబ్లీలోనైనా చర్చ పెట్టండి! ప్రభుత్వానికి కేటీఆర్ ఛాలెంజ్‌ 
Sky High Marriage Proposal New York: ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
ఆకాశమే హద్దుగా సాహసాల జంట ప్రేమకథ.. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌పై రోమాంచిత ప్రపోజల్! వైరల్ వీడియో
Kalvakuntla Kavitha Uppal Bhagayat Protest: ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
ఉప్పల్ భగాయత్ లో తీవ్ర ఉద్రిక్తత.. తెలంగాణ రక్షణ సేన భూపోరాటంలో కవితకు గాయాలు.. అరెస్ట్!
Balan The Boy OTT : ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి బాలన్ ది బాయ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Breaking News: అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి ఆపడం ఎవరితరం కాదు, గొడ్డలి పార్టీ రోజుకో డ్రామా ఆడుతోంది: ముఖ్యమంత్రి చంద్రబాబు
Amarnath Yatra 2026 : అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
అమర్‌నాథ్ యాత్ర 2026.. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే అనుమతి ఉండదు, కచ్చితంగా తీసుకెళ్లాల్సిందే
Ketan Agarwal Lohagad Fort death case: కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
కేతన్‌ను సియానే తోసేసిందన్నదానికి ఆధారాల్లేవంటున్న పోలీసులు - ఇక తప్పించుకున్నట్లేనా ?
Embed widget