అన్వేషించండి

Trinayani Serial Today December 14th Episode - 'త్రినయని' సీరియల్: తను తీసిన గోతిలో తానే పడ్డ సుమన - విశాలాక్షిని కాపాడిన నయని!

Trinayani Serial Episode : సుమన విశాలాక్షి మీద పూలకుండీ వేయాలని అనుకోవడంతో అది కాస్త సుమన నెత్తిమీదే పడుతుంది దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Today Serial Episode :

నయని: మళ్లీ నెల తప్పాలి అని కాదు గానీ.. తప్పిపోయిన నా కూతురు, గాయత్రీ అమ్మగారు వచ్చి నన్ను అమ్మా అని పిలిస్తే చాలు నేను సంతానవంతురాలుని అయినట్లే.. 
విశాలాక్షి: నమ్మని వాళ్లు అమ్మ అవ్వలేరు.. కోటి జన్మల పుణ్యమే మానవ జన్మ. ఇంకో జీవికి జన్మనిచ్చే భాగ్యమే వదులుకున్నవారు దురదృష్టవంతులు.

వల్లభ: చిన్న మరదలా అంటూ సుమన గదిలోకి వస్తాడు.. కంగారు పడకు ఈసారి నేను ఒక్కదాన్నే రాలేదు. వెంట మా అమ్మ కూడా వచ్చింది
తిలోత్తమ: ఏమ్మా అప్పుడప్పుడు వీడు వచ్చి నిన్ను బెంబేలెత్తిస్తుంటాడా.. 
సుమన: అలా ఏం లేదు అత్తయ్య సడెన్‌గా వచ్చేసరికి కొంచెం భయం వేసింది.
తిలోత్తమ: భయానికి ఒళ్లు అలా జలదరించి ఇలా వెళ్లిపోవచ్చ. కానీ మర్యాద పోతేనే జీవితకాలం బాగోదు.
వల్లభ: ఇప్పుడు ఎవరి మర్యాద పోయింది మమ్మీ.
తిలోత్తమ: చిన్న కోడలు పరువు తీయాలి అనుకుంది కదరా.. విశాలాక్షి.. ఏమో చెప్పలేం.. నయనే అలా మాట్లాడమని ఈ ఫైల్ ఇచ్చి మాట్లాడించొచ్చు కదా
సుమన: ఏ ఫైల్ అత్తయ్య
తిలోత్తమ: నువ్వు ఎవరికీ తెలీకుండా గర్భాశయాన్ని నీ ఒంట్లోకి మార్చుకొన్న అన్నీ ఉన్న హాస్పిటల్ ఫైల్ 
సుమన: ఇది మీకు ఎక్కడ దొరికింది.. ఇది నా రూమ్‌లో భద్రంగా ఉండేది
తిలోత్తమ: నిజం చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావ్.. ఈ ఫైల్ మాకు ఇచ్చింది ఎవరో కాదు.. విశాలాక్షి ఇచ్చింది.. శ్రీశైలం, కైలాసం అని పట్టుమని రెండు రోజులు ఉండని ఆ విశాలాక్షికి ఇలాంటి ఫైల్ ఇస్తే నీ గురించి గుడి కొచ్చిన భక్తులందరికీ మైకు పట్టుకొని చెప్పదా చెప్పు
వల్లభ: ప్రసాదం పంచుతూ.. నీ మర్యాద తీస్తూ నువ్వు దిగజారిపోయావు అన్నట్లుగా చిత్రీకరించడానికి పనిగట్టుకున్నారు మీ అక్క ఆ గాయత్రీ పిల్ల, విశాలాక్షి
సుమన: ఇప్పుడే వెళ్లి మా అక్కని కడిగిపారేస్తా
తిలోత్తమ: నువ్వు నయని మీద కోప్పడకు సుమన. దెబ్బతీయ్.. అయితే మీ అక్కని కాదు పది మందికి పబ్లిసిటీ చేసే ఆ విశాలాక్షికి
సుమన: తనకి ఏం చెప్పినా అర్థం కాదు ఒకటి చెప్తే ఇంకోటి మాట్లాడుతుంది
వల్లభ: నువ్వు తనని విడిచి పెడితే నీ మాన మర్యాదల్ని గంగలో విడిచిపెట్టాల్సి వస్తుంది
తిలోత్తమ: చీర కట్టుకొని గర్భవతిగా ఇంట్లోకి అడుగుపెట్టిన ఆ పిల్ల ఇన్ డైరెక్ట్‌గా నువ్వు నిజాయితీగా ఉలూచిని కనలేదు అని దెప్పి పొడవడానికి.. 
సుమన: అలా అంటారా.. అయితే అలా వచ్చిన దాన్ని ఎలా పంపిస్తానో మీరే చూస్తారు కదా
తిలోత్తమ: మన చేతులకు మట్టి అంటకుండా విశాలాక్షి మీద మన్ను పోసేలా సుమనను రెచ్చగొట్టేశాం

నయని: (విశాలాక్షి బొమ్మతో ఆడుకుంటుంటే అక్కడికి ప్లేట్‌తో భోజనం తీసుకొస్తూ..) భోజనం చేయమంటే ఇక్కడ బొమ్మతో ఆడుకుంటున్నావా విశాలాక్షి.. 
విశాలాక్షి: నేను తినకపోతే నువ్వే వచ్చి తినిపిస్తావు అనుకున్నా అమ్మా..
నయని: నువ్వు అనుకోవడం కాదు అమ్మా మీ నాన్న నన్ను అనడం మొదలు పెట్టారు. పొద్దున్న ఎప్పుడు తిన్నదో ఏంటో తనకు పులిహోరా అంటే ఇష్టం కదా అని పెట్టి పట్టుకెళ్లమని ఆయనే ఇచ్చారు 
విశాలాక్షి: అలాగా సరే అమ్మా ఈ బొమ్మ బాగుందా నేను బాగున్నానా.. 
నయని: బొమ్మే 
విశాలాక్షి: అదేంటి అమ్మా అలా అనేశావ్
విశాల్: విశాలాక్షి దానికి సమాధానం నేను చెప్తాను.. నేను ఇంటికి ఏ బొమ్మ పట్టుకొచ్చినా దానికి మా అమ్మ గాయత్రీ అని పేరు పెట్టేసింది.. అందుకే తన స్వార్థంతో నీ కన్నా బొమ్మా బాగుంది అంటుంది
విశాలాక్షి: అవునులే భగవంతుడి కన్నా భక్తుడే బాగుండాలి ఎప్పుడూ
నయని: తమాషాగా అన్నానులే విశాలాక్షి ఏం అనుకోకు
విశాలాక్షి: అబ్బే ఎందుకు అనుకుంటాను. పైగా తలచుకుంటాను కూడా
విశాల్: ఏమని
విశాలాక్షి: నిన్ను కన్న గాయత్రీ దేవి గొప్ప భక్తురాలు కదా నాన్న దైవ స్మరణ చేసే వారి మొహం కలగా ఉంటుంది
నయని: ఆ మాట అన్నావ్ బాగుంది. ఇలా మాట్లాడితేనేమో నీకు ఎంతో తెలుసు అనిపిస్తుంది. ఇదిగో ఇలా చీర కట్టి మాసాలు మోస్తున్న దానిలా కనిపిస్తేనే అయ్యో విశాలాక్షి ఎందుకు ఇలా చేస్తుంది అని కాస్త కంగారు కొంచెం బాధగా అనిపిస్తుంది
విశాల్: అవును అమ్మా బొమ్మలు పట్టుకొని ఆడుకునే వయసులో నువ్వు పెద్దరికాన్ని మోసేదానిలా ఎందుకు చేస్తావు
విశాలాక్షి: జరగబోయే దాన్ని కొందరు చెప్తారు ఇంకొందరేమో రాసిస్తారు. నాలాంటి శివభక్తులేమో గ్రహించండి అని ఇలా వేషం కడుతుంటారు. 
నయని: ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఉందని నాకు అనిపించడం లేదు
విశాలాక్షి: ఇప్పుడు తేలికగా తీసుకోవచ్చుకానీ రాబోయే రోజుల్లో ఇదే బరువుగా  మారుతుంది అప్పుడు నువ్వే గ్రహిస్తావు అమ్మా. 
విశాల్: విశాలాక్షి మీ అమ్మ ఉద్దేశం ఏంటంటే నువ్వు చిన్న పిల్లలాగే ఉంటే ఇప్పుడు తినిపిస్తున్నట్లు గోరుముద్దలు తినిపిస్తూ నిన్ను పెద్దదాన్ని చేయొచ్చు అని
విశాలాక్షి: ఓహో అలా అనుకున్నారా.. అయితే ఒక్క నిమిషం.. అంటూ నయని చేతిలోని ప్లేటు తీసుకొని విశాల్, నయనిలకు తినిపిస్తుంది విశాలాక్షి. నువ్వు నాకు తినిపిస్తున్నప్పుడు నేను మీకు చిన్నపిల్లలా కనిపించాను కదా.. అదే నేను మీకు తినిపిస్తే మీ తల్లి స్థానంలో ఉన్నట్లు అనిపించింది నాకు. 
నయని: ఏదైనా అంటే ఇలా
విశాల్: నయని ఊరుకో
విశాలాక్షి: నాకు నిద్రోస్తుంది ఎద్దులయ్యని పిలిచి ఏర్పాట్లు చూడమంటాను
నయని: విశాలాక్షిని ఎక్కడైనా చూపిస్తే మంచిదంటారా బాబు
విశాల్: నయని వైద్యం చేసే హాస్పిటల్స్ కన్నా అభిషేకం చేసే ఆలయాల్లోనే విశాలాక్షికి ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటా.. తనకు నచ్చినట్లే ఉండని.. పిల్లల సంతోషమే కదా మనకు కావాల్సింది. 

సుమన: (హాల్‌లో విశాలాక్షి పడుకుంటుండగా చూసి తిలోత్తమతో) చూడ్డానికి చిన్నపిల్లలా ఉన్న ఈ విశాలాక్షి అన్నీ తెలిసినదానిలా మాట్లాడటమే కాదు నన్ను అవమానిస్తూ మాట్లాడినందుకు మీరన్నట్లు బదులు తీర్చుకోవాలి అనిపిస్తుంది అత్తయ్య.. అల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేశాను.
తిలోత్తమ: ఏంటది
నయని: విశాలాక్షి గదిలో పడుకోవచ్చు కదా అమ్మా
విశాలాక్షి: ఇక్కడే పడిపోవాలి అమ్మా.. 
నయని: పడిపోవాలా
సుమన: అదేంటి అలా అన్నది
తిలోత్తమ: పుష్టిగా భోజనం చేసింది కదా ఒళ్లు అలా పడేసి గురకలు పెట్టేయాలని ఉందని అలా చెప్పింది
నయని: చిన్న పిల్ల చాపమీద పడుకోవడం కష్టం.. పైగా చీర కట్టుకుంది. కడుపుమీద ఏదో పెట్టుకుంది.. 
విశాలాక్షి: ఇది ఏంటో తెలుసా అమ్మా
నయని: దిండా పండా
విశాలాక్షి: కాదమ్మా.. ఇది గర్భ గుడి.. (ఇంతలో వల్లభ పూలకుండి తీసుకొని సుమన దగ్గరకు వస్తాడు.. ఇది నవ్వే తీసుకో అని అంటాడు)
ఎద్దులయ్య: అమ్మ మాటలు అయోమయానికి గురిచేస్తున్నాయి కదా మాతా
నయని: అవునయ్యా ఈ మధ్యనే ఎందుకలా తయారైందో ఏంటో.. సర్లే విశాలాక్షి నిద్ర వస్తుందని అన్నావు కదా పడుకో
తిలోత్తమ: ఇప్పుడు నిద్ర వస్తుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి సుమన ఈ పూలకుండీని గారడి పిల్లమీదకు వేస్తుంది. అప్పుడు తెలుస్తుంది గర్భగుడిలో దర్శనం ఇచ్చేది ఎవరా అని.. 
వల్లభ: హమ్మయ్య.. పైకి తిరగి పడుకొని మనల్ని గానీ సుమన ప్లాన్‌ని గానీ తెలుస్తుందని భయమేసింది. 
ఎద్దులయ్య: అమ్మా కాస్త మెలకువగా ఉండాలి 
విశాలాక్షి: మేలకువతో ఉండాల్సింది మనుషులే ఎద్దులయ్య 
తిలోత్తమ: సుమన పూలకుండీ తీసుకో
సుమన: గర్భాశయాన్ని కొనుక్కొని మరీ తల్లినయ్యానని పది మందికి ప్రచారం చేసే ఈ పిల్ల ఇంకోసారి నోరు ఎత్తకూడదు అనే ఈ పూలకుండీ పడేస్తున్నా
తిలోత్తమ: వల్లభ ఏమీ తెలినట్లు మనం కిందకి వెళ్లే లోపు ఆ పూలకుండి ఆ పిల్లమీద పడి కెవ్వు మంటుంది. 

ఇంతలో హాసిని వచ్చి ఏంటి విశాలాక్షి మళ్లీ కిందే పడుకున్నావు అంటుంది. మరోవైపు సుమన పూలకుండీ విశాలాక్షి మీద పడేలా కిందకి వదిలేస్తుంది. అయితే అది గాల్లోనే ఉంటుంది. సుమన వాళ్లు హడావుడిగా వచ్చి కింద ఏదో పడినట్లు శబ్దం వచ్చిందని అంటుంది. ఇక ధురందర, హాసిని వాళ్లు అంతా ఏమీ పడలేదు.. ఏం పడింది అని మీరు వచ్చారు అని అడుగుతారు. అప్పుడే విశాల్, విక్రాంత్ కూడా అక్కడికి వస్తారు. మరోవైపు గాల్లో పూలకుండీ ఉండడం చూసి సుమన షాకైపోతుంది. ఇక దూరం నుంచి నయని ఆ పూలకుండీని చూసి విశాలాక్షిని పక్కకు లాగేస్తుంది. దీంతో అది సుమన నెత్తిమీద పడుతుంది. సుమన నొప్పితో విలవిల్లాడిపోతుంది. అందరూ షాకైపోతారు. ఇక సుమనకు కట్టు కట్టమని ఎద్దులయ్య అంటారు. నయని సుమన తలకు కట్టు కడుతుంది. ఇక ఇదంతా ఎలా జరిగిందా అని అందరూ చర్చిస్తారు. ఇక విశాలాక్షి సుమనతో నొప్పిగా ఉందా సుమన అని అడుగుతుంది. విశాల్ తిలోత్తమతో అమ్మా పూలకుండీ పడక ముందు ఏదో పడింది అని వచ్చారు కదా ఏం పడింది? అని అడిగితే వల్లభ పూలకుండీనే పండింది అని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.

Also Read: ఆ సినిమాలు చూస్తే నరకాలనిపిస్తుంది - ‘యానిమల్’ మూవీపై జేపీ పరోక్ష వ్యాఖ్యలు
 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపుఆ ఒక్క నిర్ణయమే అల్లు అర్జున్ అరెస్ట్ వరకూ వచ్చిందా..?అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కన్నీళ్లు పెట్టున్న స్నేహపాతిక లక్షల పరిహారం ఇచ్చినా అరెస్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Embed widget