అన్వేషించండి

Trinayani Serial Today August 9th: 'త్రినయని' సీరియల్: విశాలాక్షి పనికి బిత్తర పోయిన తిలోత్తమ, సుమమ, వల్లభ.. అంత పని నిజంగా చేశారా!

Trinayani Today Episode విశాలాక్షిని అవమానించిన తిలోత్తమ, సుమన, వల్లభలతో విశాలాక్షి సామాన్లు తోమే పని వాళ్లకు తెలీకుండానే చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Trinayani Serial Today Episode మీరు ఏ పని చెప్పినా చేస్తాం నామూషీ లేదు అని డమ్మక్క అంటే సిగ్గు లేకుండా ఏ పని చేయడానికి అయినా రెడీ అని అంటున్నారని తిలోత్తమ అంటుంది. చిన్న పిల్లలు అలా అనొద్దని విశాల్ అంటాడు. దానికి దురంధర విశాలాక్షి చిన్న పిల్ల కానీ డమ్మక్క మాత్రం మా వయసుదే అని అంటుంది. ఇక నయని విశాలాక్షి వాళ్లని టిఫెన్ చేయడానికి పిలుస్తుంది. దానికి తిలోత్తమ వచ్చిందే దానికి అని అంటుంది.

విశాలాక్షి: ఈ పూట పని చేస్తే తప్ప తినడానికి ఏమీ పెట్టేలా లేరు అనుకుంటా. 
విక్రాంత్: వాళ్ల మాటలకు ఏంటిలే కానీ మీరు రండి వదిన వడ్డిస్తారు.
డమ్మక్క: అలాగే పుత్ర.
సుమన: కొంచెం అయినా సిగ్గు ఉండాలి చెప్పగానే మెక్కుతా అనడానికి.
నయని: సుమన నోరు మూసుకో.
విశాలాక్షి: సుమన ఈ పనులు మాకు చేతకాక కాదు ఎవరు చేయాల్సిన పనులు వారు చేయాలని ఊరుకున్నాం.
తిలోత్తమ: అంటే ఏంటి మీ ఉద్దేశం మీరు మాత్రం దర్జాగా కూర్చొంటారు మేం పనులు చేయాలా.
విశాలాక్షి: ఇదేం పెద్ద పనో నాకు అర్థం కావడం లేదు. 
వల్లభ: చెప్పడం కాదు చేయాలి.
విశాలాక్షి: చేస్తాం.
విక్రాంత్: మీరు వెళ్లి తినండి.
సుమన: ఈ పని చేసి తింటారులే.
నయని: మీరు ఎవరూ చేయొద్దులే నేను పిన్ని చేసుకుంటాం.
దురంధర: నయని నా వల్ల కష్టమే. అసలే ఇప్పుడు ఒట్టి మనిషిని కూడా కాదు నేను.

సుమన, తిలోత్తమలు కూడా మేం చేయలేం అని అంటారు. పని వాళ్లు రేపు వచ్చి చేస్తారని విశాల్ అంటాడు. ఇక విశాలాక్షి మేం పని చేస్తాం అంటుంది. దానికి నయని వద్దని అంటుంది. అలిసి పోతావ్ అంటే తిలోత్తమ అలిసిపోతుందో పైకే పోతుందో అని అంటుంది. ఇక సుమన విశాలాక్షి ఒక్కర్తే చేసేస్తుందని అంటుంది. విశాల్ సుమనని కోప్పడతాడు. నా వల్ల అవుతుందని విశాలాక్షి అంటుంది. ఇక విక్రాంత్ సుమన విశాలాక్షిని ఇబ్బంది పెట్టినందుకు తిడతాడు. చిన్న పిల్లతో పని చేయించావని నీ మీద కేసు పెడతానని అంటాడు. ఇక సుమన తన అక్క మీద కంప్లైంట్ ఇస్తా అంటుంది ఎందుకని విక్రాంత్ అడిగితే అనాథల్ని చేరదీస్తుందని అంటుంది. విక్రాంత్ లాగి పెట్టి ఒక్కటిస్తాడు. మరోవైపు నయని ఒక్కర్తే కూర్చొంటే విశాల్ వెళ్లి ఏమైందని అడిగితే విశాలాక్షి ఒక్కర్తే ఎలా చేస్తుందని టెన్షన్ పడుతుంది.

దురంధర, పావనా మూర్తి హాల్ లోకి వచ్చే సరికి విశాలాక్షి ధ్యానం చేస్తుంటుంది. డమ్మక్క వచ్చి విశాలాక్షి పనంతా చేసేసిందని అంటుంది. ఇద్దరూ షాక్ అయిపోయి అందర్ని పిలుస్తారు. ఇంత తక్కువ టైంలో ఎలా అయిపోయిందని బిత్తర పోతారు. ఇంతలో తిలోత్తమ, సుమన, వల్లభలు వస్తారు. ముగ్గురి ముఖాలకు సామాను తోమిన మరకలు అంటుకుంటాయి. అందరితో పాటు ముగ్గురు ముఖాలు ఒకర్ని ఒకరు చూసుకొని బిత్తర పోతారు. ఇక విశాలాక్షి మీ ముగ్గురే పని చేశారని అంటుంది. ఇక డమ్మక్కకి సామాను చూపించమని అంటే వాటిని చూపిస్తే ధగధగ మెరిసిపోతుంటాయి. వాటిని చూసి అందరూ షాక్ అయిపోతారు. 

వాటిని సుమన, తిలోత్తమ, వల్లభలే చేశారని అంటుంది. మీరే వాటిని శుభ్రం చేయడానికి కష్టపడ్డారని అంటుంది. ఇక డమ్మక్క మీ ముగ్గురు చేయకపోతే చేతులకు మసి ఎలా అంటిందని అడుగుతుంది. ముగ్గురు చేతులకు మసి చూసి షాక్ అవుతారు. చేతులు కూడా కడుక్కోకుండా ఉన్నారు అంటే మీ కష్టాన్ని గుర్తించాలని అన్నారు కదా అని నయని అంటుంది. ముగ్గురు సామాను క్లీన్ చేశారు కానీ గుర్తు లేదని విశాలాక్షి అంటుంది. అంత స్ఫృహ లేకుండా ఉన్నారా అని విశాల్ అడుగుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్: చెల్లి చేతిలో ఆది కేశవ్ మోసపోతాడా.. కనక మహాలక్ష్మిని కోడల్ని చేసుకుంటుందా, విహారి అడుగుల్లో కనకం!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Barroz Review - బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?
Embed widget