అన్వేషించండి

Trinayani november 9the - పెట్టెను దాచిపెట్టిన గాయత్రీదేవి.. షాక్‌లో ఫ్యామిలీ!

రెండు పుష్కరాల క్రితం ఆ పెట్టెను నాగులాపురంలో గాయత్రీ దేవి దాచిపెట్టిందని గురువుగారు చెప్పడంతో ఇవాళ్టి ఏపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

వల్లభ రంపంతో పెట్టెను కోసే ప్రయత్నం చేయడంతో వల్లభకు షాక్ కొట్టింది. ఈ విషయాన్ని పావనమూర్తి అందరికీ చెప్పడంతో అందరూ వల్లభకు చీవాట్లు పెట్టారు. తప్పు చేయాలని చూస్తే అమ్మవారు ఎవరినీ వదలదని నయని సీరియస్ అయింది. ఆ పెట్టె చాలా పవర్‌ఫుల్ అని విశాల్, నయని అందరికీ జాగ్రత్తలు చెప్పారు. దీంతో తిలోత్తమ తన పెద్దకొడుకును అక్కడి నుంచి తీసుకెళ్లిపోయింది. ఇక రాత్రి నయని, విశాల్, హాసిని, దురంధర, పావనమూర్తి అందరూ ఓ చోట కూర్చొని ఆ చెక్క పెట్టెను ఎలా తెరవాలా అని, చెక్క పెట్టె షాక్ కొట్టడం ఏంటని రకరకాలుగా ఆలోచించారు.  

నయని: ఆ పెట్టెకు నా భవిష్యత్తుకు ఏదో సంబంధం ముడిపడి ఉందనిపిస్తుంది. గురువుగారు, విశాలాక్షి, డమ్మక్క వీరందరూ పరోక్షంగా అదే విషయాన్ని మరీ మరీ చెప్తూ గుర్తుచేస్తున్నట్లు అనిపించింది.
విశాల్: నయని అలాంటప్పుడు స్వామి వారిని ఇంటికి పిలిపించి అడిగితే ఎలా పెట్టెను ఓపెన్ చేయాలో చెప్పారు కదా.
పావనమూర్తి: ఐడియా బాగుంది అల్లుడు. మనం రిస్క్‌ తీసుకుని గాయాలపాలవ్వడం కంటే పెద్దల సలహాలు తీసుకొని శాంతిపూజలు జరిగి పెట్టెను తెరవవచ్చు. రేపు గురువుగారు ఇంటికి వస్తున్నారు అంతే. 

ఇక మరోవైపు వల్లభ భయంతో గజగజ వణికిపోతుంటాడు. వాళ్ల అమ్మ వల్లభకు ధైర్యం చెప్తుంది. వల్లభ, తిలోత్తమ కూడా పెట్టె గురించే మాట్లాడుకుంటారు. తనకు చెప్పకుండా వెళ్లావని తిలోత్తమ చీవాట్లు పెట్టింది. 
తిలోత్తమ: ఆ పెట్టె నయనికి కలలో కనిపించిందని.. అది దొరికితే తనేంటో, తన భవిష్యత్‌ ఏంటో తెలుసుకునే ఆస్కారం ఉందని చెప్పింది. ఇప్పటికే బంగారం లాంటి జీవితం గడుపుతోన్న నయనికి మిగతా వాళ్లతో పనేముంది. 

వల్లభ: మమ్మీ నయనికీ ఏదైనా కనిపించింది అంటే అది ఎవరికైనా వచ్చే ఆపదకు లింక్‌ అయి ఉంటుంది. ఆ పెట్టెకు ఇంకెవరి ప్రాణాలకు అయినా లింక్ ఉందా అనిపిస్తోంది
తిలోత్తమ: కరెక్టే.. అమ్మవారి శక్తి ఉన్న ఆ పెట్టెకు చితి పెట్టించుకునే వారికి సంబంధం ఉండే ఉంటుంది. కానీ అది ఎవరు ఏంటి అనేది తెలీదు. 
వల్లభ: ఓపిక పట్టి చూస్తే రెండు రోజుల్లో తెలుస్తుంది మమ్మీ..

మరోవైపు నాగులాపురం దగ్గర కనిపించి స్వామీజి పెట్టె తెరిసే సమయం ఆసన్నమైంది కాలా అంటూ నడుచుకుంటూ వస్తున్నారు. ఇక విశాల్ కుటుంబ సభ్యులందరినీ హాల్‌లోకి పిలిచాడు. పెట్టెను తెరవాలి అనుకుంటున్నానని చెప్తాడు. ఇంతలో గురువుగారు అక్కడికి వస్తారు.  
గురువుగారు: ఆ పెట్టె ఆట వస్తువు కాదు తిలోత్తమ.. విశాలాక్షి అమ్మవారు ఆడే ఆటకు ప్రతీకారం. 
వల్లభ: నా బలం చాలదనా గురువుగారిని రప్పించారు. నా అంత కండపుష్టి లేని మహర్షి గారిని రప్పించారు.
విశాల్: బ్రదర్ వారికి ఉన్నంత బుద్దిబలం మనకు లేకపోవచ్చు.
డమ్మక్క: మనకి అంటే నీకే పుత్ర(వల్లభను ఉద్దేశించి)
తిలోత్తమ: డమ్మక్క నువ్వు వివరించక్కర్లేదు. తాడే తెగడం లేదు. గొళ్లెమే తెరచుకోలేనప్పుడు గురువు గారు వచ్చి ఏం చేస్తారు అని అంటున్నాడు. అంతే
డమ్మక్క: అసలు ఎందుకు ఆ పెట్టె తెరచుకోవడం లేదు అది ఆలోచించారా. లేదు.. గురువయ్యా అది అర్ధమయ్యేలా చెప్పండి.
గురువుగారు: నయనికీ కలలో కనిపించిన ఈ పెట్టెను నాగులాపురం నాగలక్ష్మి గుడిదగ్గర రెండు పుష్కరాల పిమ్మటే అంటే 24 ఏళ్ల క్రితమే భద్రంగా దాచిపెట్టింది ఎవరో తెలుసా అని అడిగి గాయత్రీ దేవి అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. 
తిలోత్తమ: గాయత్రీ అక్క పెట్టెను అంత దూరం వెళ్లి దాచిపెట్టడం వెనక అర్థమేంటి గురువుగారు
గురువుగారు: భద్రత కోసం అని చెప్పారు. 
దీంతో అందరూ ఆ పెట్టె ఎలా తెరుచుకుంటుంది మరీ అని ఆలోచిస్తుంటే ఇంతలో డమ్మక్క గాయత్రీ దేవే వచ్చి తెరవాలి అంటుంది. దీంతో సుమన, తిలోత్తమ, వల్లభ గట్టిగా నవ్వుతారు. 
తిలోత్తమ: పొద్దు పొద్దునే ఇలా నవ్విస్తారు అనుకోలేదు గురువుగారు
గురువుగారు: హాస్యంగా నీకు ఏది అనిపించింది. 
తిలోత్తమ: గాయత్రి అక్కను ఏడాది అయినా వెతికి పట్టుకోలేనప్పుడు ఇప్పుడు అక్క వచ్చి పెట్టె తెరవాలి అంటే ఎలా గురువుగారు 
వల్లభ: రేయ్ .. విశాల్ మీ అమ్మని ఈ జన్మలో అయినా చూడాలని పరితపించేవాడివి కదా.. చూడు చూడు ఇప్పుడు మీ అమ్మే వచ్చి ఆ పెట్టె తెరుస్తుందంట 
నయని: బాబు గారు బాధ పడతారు అన్న ఇంకితం కూడా లేదు కదా మీకు 
సుమన: అక్క  గాయత్రి అత్తయ్య ఆత్మ వచ్చే ప్రసక్తే లేదు. ఇప్పుడు రావాలంటే అక్కడ ఆడుకుంటోంది చూడు ఆ పసి పాప వచ్చి పెట్టె తెరవాలి. 
తిలోత్తమ: సాధ్యమయ్యేది చెప్తే చెవులారా వింటాం. కనులారా చూస్తాం.  
దీంతో ఎద్దులయ్య ఏంటి పెద్దమాత గాయత్రి దేవిని చూడాలని ఉందా అని అడుగుతారు. దీంతో తిలోత్తమ చూపించు ఎద్దులయ్య 10 రూపాయలు ఇస్తా అని వెటకారం చేస్తుంది. దీంతో వల్లభ, సుమన నవ్వుతారు. ఇక నయని పరిహాసాలు ఆడకండి మంచిది కాదు అని హెచ్చిరిస్తుంది. ఇంతలో డమ్మక్క అద్భుతాలు జరగనున్నప్పుడు బుద్ధి లేని వారే ఇలా నవ్వుతారు అంటుంది. దీంతో సుమన అయితే ఇప్పుడు అద్భుతం జరగబోతుందా అని ప్రశ్నిస్తుంది. మా అక్క కన్న పెద్ద కూతురు ఆకాశం నుంచి ఊడి పడుతుందా అని సుమన ప్రశ్నించడంతో ఇవాళ్టి ఏపిసోడ్ పూర్తవుతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Pradeep Rawat Passes Away: ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
ప్రముఖ నటుడు ప్రదీప్‌ రావత్‌ కన్నుమూత.. తొలి సినిమాతోనే ఇండస్ట్రీలో గుర్తింపు
Jagadhatri Serial Today August 4th: మర్డర్‌ కేసులో మినిస్టర్‌ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ...పోలీసులపై అనుచరుల దాడి
జగద్ధాత్రి సీరియల్: మర్డర్‌ కేసులో మినిస్టర్‌ కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చిన జేడీ...పోలీసులపై అనుచరుల దాడి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
Godavari Serial Today August 4th: 'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
మయామి 'లాంజెవిటీ' పెంట్‌హౌస్: ఆయుష్షును పెంచుతుందా? వాస్తు ఏం చెబుతోంది?
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Embed widget