Trinayani July 27th: ‘త్రినయని’ సీరియల్: తిలోత్తమా మరోసారి కొట్టిన షాక్.. నయని ఇచ్చిన కుండను పగలగొట్టిన సుమన
తిలోత్తమా కు గాయత్రి పాప వల్ల మరోసారి షాక్ కొట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Trinayani july 27th: అందరూ పూజకు ఏర్పాట్లు చేస్తూ ఉంటూ కబుర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇక పావన మూర్తికి తన భార్య స్నానం చేయించిందని మాట్లాడుకుంటూ ఉండగా వెంటనే సుమన హాసినితో ఎప్పుడైనా నువ్వు బావకి స్నానం చేయించావా అని అంటుంది. దాంతో హాసిని నిద్రలేవకపోతే నీళ్లు పోసాను అంటూ భర్త పరువు తీసే విధంగా మాట్లాడుతుంది.
అప్పుడే వల్లభ ముఖానికి పౌడర్ వేసుకొని, తలపై గుడ్డ వేసుకొని రావటంతో అది చూసి పావన మూర్తి గట్టిగా అరుస్తాడు. ఇక వల్ల పని చూసి అందరూ ఆశ్చర్యపోవటంతో.. తనకు మంట వల్ల అలా వేసుకోవాల్సి వచ్చింది అని అంటాడు. ఇక తను రాను అంటే బలవంతంగా తీసుకొచ్చాను అని తిలోత్తమా అంటుంది.
ఈ పూజ ఎప్పుడు చేయలేదు అని ఇప్పుడు చేసేసరికి వల్లభకు ఇలా జరిగింది అని తిలోత్తమా అనటంతో అంత మంచే జరుగుతుంది అని డమక్క అంటుంది. ఇక దేవుడి దగ్గర ఉన్న కుండను చూసి అది ఎందుకు అని వల్లభ అడగడంతో.. పూజ అనంతరం బ్రాహ్మణులలో ఒకరికి శ్రీకృష్ణుడి విగ్రహంతో పాటు నీటి కుండను దానం చేయాలి అని చెబుతుంది.
విశాల్ పూజ ప్రారంభించమని చెప్పటంతో నయని పాట పాడుతూ పూజ ప్రారంభిస్తుంది. పూజ అనంతరం నయని దంపతులు శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తిలోత్తమా కు ఇస్తారు. ఇక తిలోత్తమా విగ్రహం గాయత్రి పాప ఉన్న దగ్గర పెట్టగా గాయత్రి పాపకుడి చేయి తగలడంతో వెంటనే విగ్రహం పట్టుకొని ఉన్న తిలోత్తమా కు షాక్ కొడుతుంది. దాంతో అందరూ ఏం జరిగిందో అని భయపడుతూ ఉంటారు.
వెంటనే విశాల్ గాయత్రి పాపని ఎత్తుకుంటాడు. తిలోత్తమా కింద పడిపోవటంతో వెంటనే నీరు చల్లి లేపుతారు. తిరిగి ఏం జరిగింది అని తను అడగటంతో షాక్ కొట్టింది అని చెబుతారు. మరోసారి అపశకునం లాగా జరిగింది అని అనటంతో ప్రాణాల నుండి బయటపడ్డారు కదా అని డమ్మక్క అంటుంది. ఆ తర్వాత నీటి కుండను కూడా ఇస్తానని నయని అనడంతో తిలోత్తమా వద్దంటుంది.
దాంతో ఆ నీటి కుండను సుమనకి ఇస్తుంది నయని. తనకెందుకు ఇచ్చావు అని సుమన అడగటంతో.. ఇక్కడ విజయం పరలోకంలో ముక్తి పొందడం కోసం అని అనడంతో వెంటనే ఆ కుండ పగలగొడుతుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. ఎందుకలా చేశావు అని అడగటంతో.. పరలోకం ముక్తి మోక్షమని మాట్లాడుతుంది.. అంటే నన్ను చంపాలని చూస్తుంది కదా మా అక్క అని అంటుంది.
కానీ నయని అలా కాదని నీ మంచి కోసం ఇచ్చాను అని అనడంతో సుమన కోపంగా అక్కడి నుండి వెళుతుంది. ఇక అందరూ ఎవరు గదిలోకి వాళ్ళు వెళ్ళగా.. విక్రాంత్ సుమన దగ్గరికి వచ్చి అక్కడున్న ఫ్లవర్ వాస్ ను కింద పడేస్తాడు. దానితో సుమన ఎలా ఎందుకు చేశావు అనటంతో.. నువ్వు ఇందాక ఎలా ప్రవర్తించావు అని గట్టిగా నిలదీస్తాడు. నయని వదిన నీ మంచి కోసం ఇస్తే ఇలా చేస్తావా అని తిడతాడు. కానీ తను మాత్రం నయనిని తిడుతూ ఉంటుంది. విక్రాంత్ కు కోపం రావడంతో తనను బాగా తిట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial