అన్వేషించండి

Seethe Ramudi Katnam Serial Today March 9th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: మహాలక్ష్మి కుట్రలో ఇరుక్కపోయిన మధుమిత.. తన భర్త రామ్‌తో సీత అక్కకు మళ్లీ పెళ్లి!

Seethe Ramudi Katnam Serial Today Episode తన భర్త రామ్‌తో నీ పెళ్లి చేయడానికే మా ఇంటికి తీసుకొచ్చారు అని సీత మధుమితతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Today Episode తన తండ్రితో వెళ్లాలా వద్దా అన్న విషయం మధుమితే డిసైడ్ చేసుకుంటుంది అని మహాలక్ష్మి అంటుంది. ఇక్కడుంతావా మీ అమ్మనాన్నలతో వెళ్తావా అని మధుమితని అడుగుతుంది. దీంతో మధుమిత నేను ఇక్కడే ఉంటాను అని చెప్తుంది. ఎక్కడికీ వెళ్లనని అంటుంది. 

మహాలక్ష్మి: విన్నారుగా ఇక బయల్దేరండి.. 
లలిత: నీది కాని ఇంట్లో నీ వాళ్లు కాని మనుషుల మధ్య నువ్వు ఎలా ఉంటావే.. ఎంతకు తెగిస్తున్నావే.. 
శివకృష్ణ: మర్యాదగా మాతో వస్తావా లాక్కొని తీసుకెళ్లమంటావా..
మహాలక్ష్మి: మిస్టర్ శివకృష్ణ.. ఇదేం నీ పోలీస్‌ స్టేషన్ కాదు. మీ ఇష్టానికి చేయడానికి ఒక పోలీస్ అయిండి చట్టాన్ని ఎలా అతిక్రమిస్తారు. ఓ ఆడపిల్లను బలవంతంగా ఎలా తీసుకెళ్తారు. అదీ నా ఇంట్లో నుంచి. మధుమిత నుంచి మీరు నా ఇంటి గుమ్మం దాటేలోపు మీ సస్పెన్షన్ లెటర్ మీ చేతిలో ఉంటుంది. కొడుకు అయినా కూతురైనా ఎరైనా బలవంతంగా తీసుకెళ్తే క్రైమే అవుతుంది. 
లలిత: చూడవే మీ నాన్నని ఎంతలా అవమానిస్తున్నారో.. ఎంతలా బాధపెడుతున్నారు. ఇందుకేనా నిన్ను కన్నది. ఇందుకేనా నిన్ను కష్టపడి పెంచింది. ఎందుకే ఇలా మా పరువు తీస్తున్నావ్.
సీత : అమ్మా నాన్నల మాట విను అక్క వెళ్లు.
మధు: ఎవరు ఎన్ని చెప్పినా నేను ఎవరి మాటా వినను ఇక్కడే ఉంటాను. 
మహాలక్ష్మి: మీకు సిగ్గు వచ్చేలా చెప్పింది కదా సిగ్గు లేకుండా ఇక్కడే ఉన్నారు ఏంటి బయల్దేరండి..
శివకృష్ణ: మిమల్ని వియ్యాల వారు అనుకుంటున్నాను కాబట్టి సైలెంట్‌గా ఉన్నాను. లేదంటే మీకు నేనేంటో చూపించే దాన్ని.
రామ్: అంకుల్ మీరు వర్రీ అవ్వకండి సూర్య రిలీజ్ అయ్యేవరకే మధు ఇక్కడుంటుంది. 
శివకృష్ణ: నన్నే సస్పెండ్ చేస్తుంది అంట. నా కూతుర్ని కిడ్నాప్ చేసింది అని కంప్లైంట్ ఇస్తే ఏం చేస్తుంది. 
సీత: నీ కోపం నాకు అర్థమైంది నాన్న కానీ మనం అక్క గురించి అర్థం చేసుకోవాలి కదా..
శివకృష్ణ: నీ మంచి తనం దానికి ఉండాలి కదా.. ఎవర్ని అయితే వద్దు అనిందో అతని చేయిపట్టుకొని మెట్లు దిగింది. ఏ అత్తారింటిని కాదు అనుకుందో అదే ఇంట్లో కాలు మోపింది. నువ్వు ఇలా ఉంటే అది అలా తయారైంది. 
సీత: అక్క మా అత్తయ్య మాయలో పడిపోయింది. ఆ మత్తు దిగితే అక్క సెట్ అవుతుంది. మామకు వాళ్ల పిన్ని ఎంత చెప్తే అంతే.
లలిత: అయితే మీ అత్తయ్య మధు మెడలో తాళి కట్టమంటే కట్టేస్తాడా..
సీత: ఆయన అలా చేయరు అమ్మ. ఆయన మంచోడు. ఆయన నాకు అన్యాయం చేయరమ్మా. ఎక్కువ రోజులు అక్క ఇక్కడ ఉండదు. 
శివకృష్ణ: నాకు అలా అనిపించడం లేదు సీత. నీ వెనుక ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది. 
సీత: ఆ కుట్ర చేస్తుంది మా అత్తయ్యనే నాన్న. అందులో అక్కకి, మామకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన వాళ్ల పిన్ని విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో ఆయన నాకు సపోర్ట్ చేస్తారు. నేను ఈ ఇంట్లోనే కాబట్టి ఎలాగోలా అక్క మనసు మార్చి మన ఇంటికి పంపిస్తాను. మీరు భయపడకండి. నేను సీతలానే కాదు అవసరం అయితే సత్యభామలా కూడా మారాలి మారి యుద్ధం చేయాలి. 

సీత: మధుమిత దగ్గరకు వచ్చి.. సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పు అక్క. నువ్వు ఇక్కడికి రావొద్దు అని నేను ఊరిలో చెప్పాను. అమ్మానాన్న తమతో వచ్చేయ్ మని చెప్పారు. వాళ్లతో మన ఇంటికి వెళ్లకుండా ఇక్కడ ఉండటంలో నీ ఉద్దేశం ఏంటి సీత..
మధు: వాళ్లతో వెళ్తే నా పరిస్థితి ఏమవుతుందో తెలిసే వెళ్లమంటున్నావా సీత. వాళ్లకి నీ మీద ఉన్న ప్రేమ నా మీద లేదు.
సీత: తప్పు చేస్తున్నావ్ అక్క. ఇరవై ఏళ్లు పెంచి అమ్మానాన్నల ప్రేమ కాదు అని సంవత్సరం పరిచయం అయిన సూర్య బావతో వెళ్లి అప్పుడు తప్పు చేశావ్. సంబంధం లేని వీళ్లతో వచ్చి ఇప్పుడు తప్పు చేస్తున్నావ్. మొదటి సారి నువ్వంటే నాకు కోపం వస్తుంది. బాధ వేస్తుంది. అక్క. 
మధు: మహాలక్ష్మి గారే నన్ను ఇక్కడ ఉండమంటే నీకు కోపం బాధ ఎందుకో నాకు అర్థం కావడం లేదు సీత. సంబంధం ఉంటేనే సాయం చేస్తారా.. మానవత్వంతో చేయకూడదా..
సీత: నీ గురించి ఆలోంచడానికి నేను ఉన్నాను. అమ్మానాన్నలు ఆదుకుంటారు. ఆవిడెవరో చేయి అందించారు అని ఈ ఇంటికి వచ్చి తిష్ట వేస్తావా..
మధు: నేనేమీ నీ సొమ్ము తినడం లేదు సీత. మీ అత్తగారి సొమ్మే కదా.. నీకు కోపం ఎందుకో నాకు అర్థమైందో నాకు తెలుసు. నీకు భయం, అభద్రతా భావం. నీ స్థానంలోకి నేను ఎక్కడ వస్తానో అని నీ భయం.
సీత: అవునే అవును.. అదే నా భయం. అలాగే జరిపించడానికే నువ్వు ఇక్కడికి రప్పించబడ్డావ్. సాయం కోసం నువ్వు ఇక్కడికి రప్పించబడ్డావు అనుకుంటున్నావా.. అది ఒక మోసం. మొదటి సారి నిన్ను ఈ ఇంటికి రప్పించింది కూడా మహాలక్ష్మి గారి ఆర్డర్ మేరకే. నీకు సూర్య బావకి రిసెప్షన్ కోసం నిన్ను ఇక్కడికి పిలవలేదు. నా భర్త పక్కన భార్య స్థానంలో ఉంచడానికి ఈ ప్రపంచానికి పరిచయం చేయడానికి. 
మధు: ఏం మాట్లాడుతున్నావ్ సీత నన్ను రామ్ గారి భార్యగా పరిచయం చేయడం ఏంటే..
సీత: పరిచయం చేయడమే కాదు నన్ను తప్పించి నా స్థానంలో నిన్ను మామ భార్యగా చేయాలని మహాలక్ష్మి ప్రయత్నిస్తుంది. ఎందుకుంటే నువ్వే తన కోడలు అని ఆవిడ ఫిక్స్ అయింది కాబట్టి. ఇప్పుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అందుకే. ఇవేవి తెలుసుకోకుండా నువ్వు అమాయకంగా ఇక్కడికి వచ్చావ్. నిన్ను సూర్య బావని విడదీసి, నన్ను నా భర్తను విడదీసి నిన్ను మామకి పెళ్లి చేయాలి అని చూస్తుంది. ఆవిడ మనిషి కాదే మానవ రూపంలో ఉన్న మృగం.
రామ్: స్టాపిట్ ఇక ఆపు సీత నీ పిచ్చితనంతో మా పిన్నిని అపార్థం చేసుకోవడమే కాకుండా మీ అక్కని కూడా పొల్యూట్ చేస్తున్నావా. మా పిన్ని కోసం పిచ్చిపిచ్చిగా మాట్లాడితే పళ్లు రాలుతాయ్. ఎన్ని సార్లు చెప్పినా వినవా మధుమిత ముందు మళ్లీ స్టార్ట్ చేశావా.. నువ్వు చెప్తున్నది నిజాలు కాదు. కట్టుకథలు అల్లి చెప్తున్నావు. నీ ఊహలను నిజం అని నమ్మించే ప్రయత్నం చేయకు సీత అని రామ్ అనడంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: 'నాగ పంచమి' సీరియల్ మార్చి 8th: మేఘనే కరాళి అని తెలుసుకున్న ఫణేంద్ర, పంచమి.. జ్వాల అండ్ కో కన్నింగ్ ప్లాన్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
Vizag News: విశాఖ రైల్వే స్టేషన్లో తెగిపడిన విద్యుత్ తీగలు, తృటిలో తప్పిన ప్రమాదం
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Embed widget