Seethe Ramudi Katnam Serial Today March 6th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీత కొంగులో బాంబ్.. మిధున, గౌతమ్‌లకు పెళ్లి చేసే ఆలోచనలో మహాలక్ష్మీ
Seethe Ramudi Katnam Today Episode మిధున యాటిట్యూడ్ అచ్చం తనలాగే ఉందని మురిసిపోయిన మహా గౌతమ్, మిధునలకు పెళ్లి చేయాలి అనుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode మిధున బ్యూటీ కాంపిటేషన్‌లో గెలుస్తుంది. మిధున దగ్గరకు మహాలక్ష్మీ వెళ్లి నువ్వు ఎవరమ్మాయివి ఎక్కడ ఉంటావు అని అడిగితే దానికి మిధున అడ్రస్ సరిపోతుందా పాన్, రేషన్, ఆధార్ కార్డు కావాలా అంటూ పొగరుగా మాట్లాడుతుంది. అర్చన అంత పొగరు ఎందుకమ్మా అని అడిగితే మహాలక్ష్మీ అర్చనతో తను నాలాంటిదే అని అంటుంది.
మహాలక్ష్మీ తనతో ఊరికే నీ వివరాలు అడిగామని చెప్పి కంగ్రాట్స్ చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తే మిధున డోంట్ టచ్ అని చేతికి శానిటైజర్ వేసుకుంటుంది. తను అచ్చం సీతలా ఉన్నా నాకు బాగా నచ్చిందని మహాలక్ష్మీ అంటుంది. ఇక తను మిధుననా లేక నిజంగా సీత ఏనా అని తేల్చుకోవడానికి రేవతి ఇంటికి వెళ్లాలని అనుకుంటారు. ఇంతలో సీత అందాల పోటీలు ఆపాలి అని కొంతమంది అమ్మాయిల్ని తీసుకొచ్చి ధర్మా చేస్తుంది. సీత ఇక్కడే ఉందని కాని ఇద్దరూ వేరని అనుకుంటారు. మహాలక్ష్మీ సీతతో నువ్వు ఊహించని ట్విస్ట్ నేను నీకు ఇస్తాను అని అంటే దానికి సీత నేను ఊహించని ట్విస్ట్ మీరు ఇవ్వడం కాదు మీ మతులు పోయే దెబ్బ నేను కొడతా అని సీత అంటుంది.
అత్తా కోడళ్లు ఇద్దరూ ఛాలెంజ్ చేసుకుంటారు. ఇక మహాలక్ష్మీ మిధునని తన దారిలోకి తెచ్చుకొని సీత పని చెప్తా అనుకుంటుంది. ఇక మిధున ఇంటికి వెళ్లి తాను మిస్ హైదరాబాద్ అయ్యానని చెప్తుంది. ముఖర్జీ కూతురికి సపోర్ట్ చేస్తే తల్లి మాత్రం అనుకువగా ఉండాలి అంటుంది. దానికి మిధున తనకు అహంకారమే అందం అని అంటుంది. సీత కిరణ్, రేవతిలతో గతంలోలా ప్రవర్తిస్తుందని అందాల పోటీలకు వెళ్లిందని మళ్లీ అందమైన అమ్మాయిల వేటలో పడిందని అంటుంది. ఇప్పుడు ఎందుకు ఇలా పోటీలు పెట్టారని కిరణ్ అడిగితే దానికి రేవతి సీతని పంపేసింది కాబట్టి రామ్‌కి మరో పెళ్లి చేయడానికి ఆ వేటలో పడిందని అంటుంది. తన మేనత్త చావుకి కారణమై రామ్‌ని తనని విడిదీసిన మహాలక్ష్మీని అల్లాడిస్తామని సీత అంటుంది. ఇప్పటికే రంగంలోకి దిగానని ఆట ఎప్పుడో మొదలైందని సీత అంటుంది. మహాలక్ష్మీ మిధున ఆలోచిస్తుంది. అర్చన వచ్చి ఏం ఆలోచిస్తున్నావ్ మహాలక్ష్మీని అడిగితే మహాలక్ష్మీ మిధునని పొగిడితే అర్చన తనని మహా పొగుడుతుందని పొంగిపోతుంది.
మిధునని ఇంటికి తీసుకొస్తానని గౌతమ్‌తో పెళ్లి చేస్తానని మహాలక్ష్మీ అంటుంది. నా కొడుకు గౌతమ్‌కి ఇచ్చి పెళ్లి చేసి మిధునని నా కోడల్ని చేసుకుంటానని మహాలక్ష్మీ నోరు జారుతుంది. అర్చన నోరెళ్ల బెడుతుంది. ఇక మహాలక్ష్మీ కవర్ చేస్తుంది. మరోవైపు సీత మహాలక్ష్మీ ఇంటికి వస్తుంది. చీర చెంగుని మూటలా కట్టుకొని వచ్చి తిప్పుతూ సాంబతో బాంబ్ తీసుకొచ్చానని తిప్పుకుంటూ వస్తుంది. అర్చన సీతని చూసి మహాలక్ష్మీకి చెప్తుంది. ఏం పని మళ్లీ వచ్చావ్ అని అంటే దానికి మహాలక్ష్మీ మీతో నాకేం పని చెత్త అత్తలు, దరిద్రపు ముఖాలు అత్తలు అని అంటుంది. ముఖం పచ్చడి అయిపోతుందని మహాలక్ష్మీ అంటుంది. ఇక సీత ముత్యాల హారం కోసం వచ్చానని వెళ్తుంది. ఇంతలో సాంబ వచ్చి సీత చీర కొంగులో బాంబ్ ఉందని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్ టెన్షన్!





















