Seethe Ramudi Katnam Serial Today April 3rd: 'సీతే రాముడి కట్నం' సీరియల్: రామ్‌ని మరో పెళ్లి చేసుకోమన్న మహా.. మిధున గౌతమ్‌ని పెళ్లి చేసుకుంటుందా!!
Seethe Ramudi Katnam Today Episode గౌతమ్‌ని మిధునకు ఇచ్చి పెళ్లి చేయాలని మహాలక్ష్మీ ఇంట్లో వాళ్లతో చెప్పడం సంబంధం మాట్లాడటానికి ముఖర్జీ ఇంటికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Seethe Ramudi Katnam Serial Today Episode సీత ఇంటి నుంచి వెళ్తుంటే మహాలక్ష్మీ క్లాప్స్ కొట్టి సీతని ఆపి సీత దగ్గరకు వెళ్లి నువ్వు సూపర్ సీత నీ తెలివికి హాట్సాఫ్ అని అంటుంది. అర్చనని భలే పట్టుకున్నావ్. ఈ ఇంట్లో అడుగు పెట్టాలి అనుకున్నావ్ కానీ నేను ఎప్పటికీ నిన్ను ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వను. నీ జీవితం ఆ గేటు బయటే అని అంటుంది.
త్వరలోనే మీరు గేటు బయట ఉంటారు..
సీత మహాలక్ష్మీతో అంత లేదు అత్త ఈ రోజు నీ టైం బాగుండి తప్పించుకున్నావ్ లేదంటే ఈ పాటికి నువ్వు గేటు బయట ఉండేదానివి అని అంటుంది. నాగు అర్చన అత్తయ్యల వెనక ఉంది నువ్వు అని నాకు తెలుసు అత్త. పాపం అర్చన అత్తయ్య దొరికిపోయింది. రెండో సారి నువ్వు దొరికిపోవాల్సింది కానీ నువ్వు ఫోన్ కట్ట చేశారు. అప్పుడు మీరు ఆ ఫోన్ ఎత్తుంటే మీకు చిత్తడి చిత్తడి అయ్యుండేది. ఈ రోజు మీ చావు తప్పి కన్ను లొట్ట పోయింది అత్తయ్యా. ఈ రోజు మీరు తప్పించుకున్నా త్వరలోనే మీ గుట్టు రట్టు చేస్తా. నాగు ఫోన్ దొరికితేనే ఇంత చేశాను నాగు దొరికితే ఇంకెంత చేస్తానో అర్థం చేసుకోండి. నువ్వు ఎన్ని చేసినా నీకు ఈ ఇంట్లో ఎంట్రీ ఉండదు. నాకు నచ్చిన కోడలు ఎంట్రీ ఇస్తుంది. మహాలక్ష్మీ వెళ్లిపోయిన తర్వాత ఆ ఎంట్రీ ఇచ్చేది ఎవరో కాదు అత్త నిన్ను మిధునలా నమ్మిస్తున్న ఈ సీతే..
మెయిన్ సూత్రధారి ఆవిడే..
సీత కిరణ్, రేవతిలకు విషయం చెప్తుంది. అర్చన దొరికిపోయిందని కొంచెంలో మహాలక్ష్మీ అత్తయ్య తప్పించుకుందని చెప్పి ఇంట్లో జరిగిన సీన్ మొత్తం చెప్తుంది. నాగు దొరికితే మెయిన్ సూత్రధారి అయిన మహాలక్ష్మీ అత్తయ్యని అల్లాడించొచ్చని సీత అంటుంది. నాగుని ఎలా అయినా పట్టుకోవాలని సీత అంటుంది. రామ్ అర్చనకు షేర్లు ఇవ్వలేదని చెప్తుంది.
ఫ్రింగర్ ప్రింట్స్ సంగతేంటి..
సీత తండ్రికి కాల్ చేసి వేలిముద్రలు మ్యాచ్ అయ్యావా అంటే ఇంట్లో ఎవరి వేలిముద్రలు మ్యాచ్ అవ్వలేదని శివకృష్ణ చెప్తాడు. గౌతమ్ మీద అనుమానం ఉందని అవి కూడా మ్యాచ్ అవ్వలేదా అని సీత అడుగుతుంది. లేదని నిజం నిలకడ మీద తెలుస్తుందిలే అని శివకృష్ణ సీతకి చెప్తాడు.
బతికున్న శవంలా ఉన్నాను..
అర్చన జరిగిన అవమానం తలచుకొని బాధపడుతుంది. మహాలక్ష్మీ రావడంతో నువ్వు తప్పించుకోవడానికి నన్ను ఇరికించేశానని అంటుంది. నా గురించి కాకుండా నీ కోసం కూడా తెలియాల్సింది అని అర్చన అంటే నా గురించి తెలిసేది కానీ కాస్తలో జనా వచ్చి నన్ను కాపాడారని అంటుంది. నా వల్లే మీరు ఇళ్లు నుంచి వెళ్లకుండా అయ్యారని మహాలక్ష్మీ అంటుంది. నాకు రావాల్సిన షేర్స్ రాలేదని అర్చన ఏడిస్తే నేను నీకు ఎంత కావాలి అన్నా అంత డబ్బు ఇస్తా నీకు నేను ఉన్నాను అంటుంది. సీత వల్లే ఇదంతా అని అనుకుంటారు. ఈ సారి సీతని ఇంట్లోకి రానివ్వను మిధునని కోడలిగా తీసుకొస్తానని అంటుంది.
మిధునని బెదిరించి తాళి కట్టేస్తా..
గౌతమ్ చాకు పట్టుకొని బయటకు వెళ్తుంటే మహాలక్ష్మీ ఆపి ఎక్కడికి వెళ్తున్నావ్ అంటుంది. దాంతో గౌతమ్ నువ్వు నాకు మిధునకు పెళ్లి చేయడం లేదు నేనే వెళ్లి మిధునని బెదిరించి భయపెట్టి ఏ గుడిలోనో తాళి కట్టేస్తా. వెంటనే అది నా పెళ్లాం కావాల్సిందే. అని అంటాడు. ఇప్పుడే నీ పెళ్లి సంగతి తేల్చేస్తా ఇక్కడే ఉండు అని మహాలక్ష్మీ చెప్పి కిందకి వెళ్తుంది. రామ్ దగ్గరకు వెళ్లి మిధున మీద నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతుంది. తన మీద నాకు అభిప్రాయం ఏంటి పిన్ని అని రామ్ అడుగుతాడు. మిధున సీతలా ఉంటుంది కదా అందుకే అడిగాను అంటుంది. గౌతమ్ చాటుగా వింటుంటాడు. సీత చాలా మంచిది అని రామ్ సీత గురించి చెప్తాడు.
మళ్లీ పెళ్లి చేసుకో రామ్..
సీత గురించి ఆలోచించొద్దని నువ్వు మళ్లీ పెళ్లి చేసుకోవాలని మహాలక్ష్మీ రామ్‌తో చెప్తుంది. జనార్థన్, గిరి, అర్చనలు కూడా రామ్‌కి మరో పెళ్లి గురించి మాట్లాడమంటుంది. నాకు ఇంకో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు సీతకు విడాకులు ఇచ్చే ఉద్దేశం లేదని అంటాడు. సీతని మళ్లీ తీసుకొస్తావా అంటే సీత రాదు నా మనసు నుంచి పోదు అని రామ్ చెప్పి వెళ్లిపోతాడు. గౌతమ్ మహాలక్ష్మీకి చాకు చూపించడంతో మహాలక్ష్మీ జనార్థన్ వాళ్లతో మిధునకు గౌతమ్‌కి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అని అడుగుతుంది. గౌతమ్ గురించి మనకు ఎందుకు మీ అక్క చూసుకుంటుంది కదా అంటే నాకు మా అక్క బాధ్యత ఇచ్చిందని మహాలక్ష్మీ అంటుంది. మనతో ముఖర్జీ సంబంధం కలుపుకుంటారా అని గిరి అంటే మహాలక్ష్మీ ఒప్పుకుంటారని అంటుంది. ఇప్పుడే వెళ్లి మట్లాడుదామని ముఖర్జీ ఇంటికి మహాలక్ష్మీ, జనార్థన్ వెళ్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: తండ్రి కాలర్ పట్టుకున్న కార్తీక్.. శ్రీధర్ చెప్పిన నిజం దీప మాయం!





















