అన్వేషించండి

Satyabhama Serial Today January 16th: నడిరోడ్డు మీద కాలర్లు పట్టుకొని కొట్టుకున్న క్రిష్, మాధవ్.. టెన్షన్‌లో సత్య!

Satyabhama Serial Today Episode మాధవ్ కారును క్రిష్ వాళ్ల బైక్ ఢీ కొట్టడంతో మాధవ్, క్రిష్ కాలర్లు పట్టుకొని కొట్టుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode: సత్య డల్‌గా ఉండటం చూసి ఎందుకు అలా ఉన్నావని సత్యను వాళ్ల నాన్న అడుగుతాడు. దానికి సత్య జరిగేది పెళ్లి చూపులే కదా నాన్న పెళ్లి ఇంకా ఫిక్స్ అవ్వలేదు కదా అని అడుగుతుంది. దానికి విశ్వనాథం ఇంట్లో వాళ్ల మాటలు బట్టి అలా అనుకుంటున్నావ్ కానీ నీకు ఇష్టం లేకుండా ఏం జరగదు అని చెప్తాడు. 

విశ్వనాథం: చూడమ్మ ఈ పెళ్లి అయిన తర్వాత అమెరికా వెళ్లాల్సి వస్తుందేమో అని ఆలోచిస్తున్నవ్ ఏమో కానీ శేఖర్ నాకు మంచి ఫ్రెండ్ 25 ఏళ్లుగా నాకు తెలుసు. పుట్టింట్లో నువ్వు ఎంత స్వేచ్ఛగా సంతోషంగా ఉన్నావో నీ అత్తింట్లో కూడా నువ్వు అంతే ఫ్రీగా ఉంటావ్ అమ్మా దానికి నేను గ్యారెంటీ.. 

మరోవైపు బాబీ క్రిష్‌ని మినిస్టర్ ఇంటి నుంచి బైక్‌పై నుంచి తీసుకొస్తుంటాడు. క్రిష్ వెనక్కి తరిగి కూర్చొని ఫోన్‌లో సత్య ఫొటో చూస్తూ ఉంటాడు. ఏం మాట్లాడటం లేదని బాబీ అడిగితే మీ వదినతో మాట్లాడుతున్నారా అని క్రిష్ బాబీకి చెప్తాడు. మరోవైపు మాధవ్ కార్ డ్రైవింగ్ చేస్తూ ఎయిర్ పోర్ట్‌ నుంచి ఇకంటికి వస్తుంటాడు. మాధవ్ కారు, క్రిష్ వాళ్ల బైక్ ఢీ కొట్టుకుంటాయి. మాధవ్ బాబీని తిడతాడు. ఇక మాధవ్ బాబీ కాలర్ పట్టుకుంటే క్రిష్ మాధవ్ కాలర్ పట్టుకుంటాడు.  

మాధవ్: రేయ్ ఎవడ్రా నువ్వు.
క్రిష్: నన్నే ఎవడ్రా నువ్వు అని అడిగావ్ అంటే ఈ ఊరికి కొత్త అయింటావులే అందుకే మా వోడి మీద చేయి వేశావ్.. ఇది నీ మొదటి తప్పు అని క్షమిస్తున్నా..  ఈ మొఖాన్ని బాగా చూడు. ఈ సారి ఎదురు పడినప్పుడు బుద్ధిగా తలదించుకొని పక్కకు వెళ్లిపో. గొంతు లేపొద్దు.
బాబీ: మా అన్న ఇంత మర్యాదగా చెప్పినా కూడా అర్థంకాలేదా.. పోయి కారు అడ్డంగా తీయ్ మా బండి పోవాలి.
మాధవ్: బెదిరిస్తే బెదిరిపోవడానికి పారిపోవడానికి నేను అల్లాటప్పావాడిని కాదు.
క్రిష్: ఓ అయ్యో.. మీరు ఎవరో తెలీక నేను నోటి కొచ్చినట్లు మాట్లాడేశా ఏమనుకోకండి సార్ నీ బాంఛన్ సార్.. ఈ ఒక్క సారికి నా తప్పు క్షమించేయండి సార్.. అని అంటాను అనుకున్నావా.. బిడ్డా రెండు దినాలు ఈ ఊర్లో ఉంటే నా చరిత్ర తెలుస్తాది నీకు. అప్పుడు నీ ప్యాంట్ తడుస్తాది. 
మాధవ్: రేయ్ తప్పు చేసింది కాకుండా ఇంకా రెచ్చిపోతున్నారు ఏంట్రా.. అసలు నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా చూపించు. 
బాబీ: క్రిష్‌ని చూపిస్తాడు. మా అన్న నా పక్కన ఉంటే అన్నింటికి లైసెన్స్ ఉన్నట్లే. ఇప్పుడు నీ కాలు విరక్కొట్టడానికి కూడా నా దగ్గర లైసెన్స్ ఉంది చూస్తావా..
క్రిష్: ఓరేయ్ బాబీ ఊరికి కొత్త కదరా వదిలేయ్.. ఏ తమ్మీ ఎందుకురా పోరా..
మాధవ్: తప్పు చేసిందే కాకుండా సారీ చెప్పకుండా నన్నే బెదిరిస్తారా.. మిమల్ని..

మాధవ్, క్రిష్ ఒకర్ని ఒకరు కొట్టుకునేంత వరకు వెళ్లారు. ఇంతలో అటుగా పోలీసులు వెళ్తూ వీళ్లని చూసి జీపు ఆపి దగ్గరకు వస్తారు. పోలీసులు క్రిష్‌కు నమస్తే చెప్పి మీరేంటి సార్ ఇక్కడ ఉన్నారు అని అడుగుతారు. మాధవ్ అయితే ఇన్‌స్పెక్టర్ వీళ్లే నా కారుకు గుద్ది గొడవ చేస్తున్నారు ఫైన్ కట్టించమని అంటాడు. దానికి క్రిష్ కొడతాను అంటాడు. పోలీసులు మాధవ్‌ను పక్కకు తీసుకొని వెళ్లి వాళ్ల గురించి చెప్తారు. ఇక క్రిష్ తన మూడ్ అంతా కరాబ్ అయిందని వెంటనే సత్యను చూడాలి అని వాళ్ల ఇంటికి బయల్దేరుతాడు. 

మరోవైపు సత్య వాళ్లు గుడికి వెళ్లడానికి రెడీ అవుతారు. అయితే సత్య గుడికి రాను అని అంటుంది. బామ్మ సత్యకు క్లాస్ తీసుకుంటుంది. చివరకు సత్య గుడికి వెళ్లడానికి ఒప్పుకుంటుంది. క్రిష్ సత్య వాళ్ల ఇంటికి వస్తాడు. సత్య వాళ్లు గుడికి వెళ్తున్నారు అని మనం కూడా వెళ్దామని అంటాడు బాబీ. దానికి క్రిష్ ఇంట్లో ఉన్న మామకు కాక పడతానని అంటాడు. ఇక సత్య వాళ్లు వెళ్లిన గుడికి కాళీ కూడా వస్తాడు. సత్య అందాన్ని నాశనం చేయాలి అని ఓ ఇంజక్షన్‌ను తీసుకొస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  

Also Read: నాగ పంచమి జనవరి 16th: పంచమిలా మారి ఫణేంద్రని మోసం చేసి మంత్రం చెప్పించుకున్న మేఘన!

టాప్ హెడ్ లైన్స్

Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
Jagadhatri Serial Today JULY 17th: మీనన్‌ను ఎన్‌కౌంటర్‌ చేసేందుకు జేడీ ప్లాన్..పోలీసుస్టేషన్ నుంచి తప్పించుకున్న మీనన్‌
జగద్ధాత్రి సీరియల్: మీనన్‌ను ఎన్‌కౌంటర్‌ చేసేందుకు జేడీ ప్లాన్..పోలీసుస్టేషన్ నుంచి తప్పించుకున్న మీనన్‌
Anil Ravipudi: అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?
అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల వర్సెస్ విహారి! లక్ష్మీ జాడ విహారికి తెలుస్తుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల వర్సెస్ విహారి! లక్ష్మీ జాడ విహారికి తెలుస్తుందా!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashant Kadiyam: ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ చందు.. క్రికెట్ అంటే పిచ్చి.. సాఫ్ట్ వేర్ నుంచి బుల్లితెర వైపు
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
కుప్పం vs మంగళగిరి: మా నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది - నారా లోకేష్
YS Jagan Digital Politics: డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
డిజిటల్ లూప్‌లో వైఎస్సార్‌సీపీ - ఫీల్డ్ వదిలి యాప్స్‌ను నమ్ముకుంటే రాజకీయాల్లో రాత మారుతుందా?
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
సోనమ్‌ వాంగ్‌చుక్ దీక్ష భగ్నం - ఆరోగ్యం క్షీణించంతో ఆసుపత్రికి తరలింపు 
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Hydrogen Cars and Buses:హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
హైడ్రోజన్‌తో నడిచే రైలు మాదిరిగానే కార్లు, బస్‌లు, టూవీలర్స్‌ వస్తాయా? సీఎన్జీతో పోల్చుకుంటే వ్యత్యాసం ఏంటీ?
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Allu Sirish Wife Nayanika: గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
గోవాలో అల్లు వారి కోడళ్ళు... శిరీష్ భార్య నయనిక, బన్నీ వైఫ్ స్నేహను చూశారా?
Embed widget