అన్వేషించండి

Satyabhama Serial Today February 13th - సత్యభామ సీరియల్: కాళీ గురించి క్రిష్‌తో నిజం చెప్పిన బాబీ.. మాధవ్‌తో నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకున్న సత్య!

Satyabhama Serial Today Episode తనవల్ల ఇబ్బందులు ఎదురవుతాయి అని మాధవ్ ఇంటికి వెళ్లి సత్య నిశ్చితార్థం క్యాన్సిల్ చేయమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Today Episode సత్య క్రిష్ ఇంటికి వెళ్లి అందరి మీద సీరియస్ అవుతుంది. క్రిష్ తన తండ్రికి పరిచయం చేస్తానని సత్యని తీసుకెళ్తే సత్య క్రిష్ చేయి వదిలించుకొని తిడుతుంది. ఇక సత్య మాట్లాడుతుంటే మహాదేవయ్య మాట్లాడొద్దు ఇప్పటికే ఎక్కువ మాట్లాడావ్ అని అంటాడు. ఇంకా మాట్లాడుతా అయితే ఏం చేస్తావ్ అని ప్రశ్నిస్తుంది.

సత్య: నువ్వు నీ కొడుకును జంతువులా పెంచావు. అందుకే మాలాంటి వారిని వేధిస్తూ పీక్కుతుంటున్నాడు. 
మహదేవయ్య: నా కళ్ల ముందే నా కొడుకును అంత పెద్ద మాట అంటావే.. అంటూ గన్ తీస్తాడు. ఇంతలో విశ్వనాథం సత్య అంటూ అరుస్తూ నిద్ర లేస్తాడు. 
విశాలాక్షి: ఏమైంది అండీ.. ఎందుకు అండీ అలా అరిచారు. 
విశ్వనాథం: సత్యని చూడాలి.. సత్య.. సత్య..  సత్యని చూస్తారు. సత్య పడుకొని ఉంటుంది. 
విశాలాక్షి: ఇంట్లో జరిగే సంఘటనలు కంటే మిమల్ని చూస్తుంటే నాకు ఎక్కువ భయంగా ఉందండి.. ఏమైంది. 
విశ్వనాథం: ఆ రౌడీ సత్యను షూట్ చేసినట్లు కల వచ్చింది. అది నిజం అవుతుందేమో అని భయంగా ఉంది. 
విశాలాక్షి: సత్య మీకు మాట ఇచ్చింది కదా మీకు తెలీకుండా.. చెప్పకుండా ఏం చేయను అని తన మీద మీకు నమ్మకం లేదా..
విశ్వనాథం: నా బిడ్డను నమ్మకుండా ఎలా ఉంటాను విశాలాక్షి.. నా బాధ ఎవరికీ చెప్పుకోలేను గుండె బాధ తగ్గేలా ఏడ్చేయాలి అని ఉంది విశాలాక్షి.  సత్య దూరం నుంచి చూస్తుంది. సత్య నిశ్చితార్థం సంతోషంగా జరగాల్సింది ఎంత గందరగోళంగా మారింది. అన్ని చోట్లా అవమానాలే.. అడ్డంకులే. చిన్న పిల్ల ఎలా తట్టుకొని నిలబడుతుంది. మాధవ్ మంచోడు కాబట్టి సత్యకు అండగా నిల్చొంటున్నాడు. ఇంత జరిగినా సత్యను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాడు. 
విశాలాక్షి: మాధవ్ లాంటి మంచి భర్త దొరకడం సత్య అదృష్టం. ఒక పని చేద్దామా ముహూర్తానికి ముందే ఏదైనా గుడి దగ్గర పెళ్లి చేసేద్దామా.. శేఖర్ అన్నయ్య వాళ్లతో మాట్లాడండి. గుడిలో పెళ్లికి ముహూర్తాలతో పనిలేదు అని చెప్పండి. త్వరగా పెళ్లి చేసేసి అమెరికా పంపేస్తే ఏ సమస్య ఉండదు. 
విశ్వనాథం: మనం శేఖర్‌ని అడుగుతాం సరే వాడు వాళ్ల బంధువులకు ఏం సమాధానం చెప్తాడు. ఎందుకు గుట్టుగా పెళ్లి చేస్తున్నారు అని అడిగితే వాడు సమస్యలో పడతాడు కదా. మన సమస్యని వాడి మెడకు చుట్టునట్లు అవుతుంది కదా.. విశాలాక్షి మనం ఇలా ఆలోచిస్తున్న సంగతి పొరపాటున కూడా సత్యకు తెలీకూడదు. బాధపడుతుంది. ఏ ఆడపిల్లకు రాని కష్టం సత్యకు వచ్చింది. దీన్ని మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. 

కాళీ: మీ మామకి బామ్మర్దికి చుక్కలు చూపించావ్ అన్న. స్టేషన్‌లో నువ్వు ఇచ్చిన షాక్‌కి మీ వారి నోటిలో మాట రాలేదు అన్న. ఇప్పుడు నీ పవర్ ఏంటి తెలిసినట్లుంది అన్న.
క్రిష్‌: మనకు కావాల్సింది కూడా అదే కదరా. వాళ్లు భయపడాలి. వాళ్లలో భయం చూసి సత్య భయం పోవాలి. నన్ను ఎవరూ ఏం చేయలేరు అని తెలిసి నా మీద తనకున్న ప్రేమని భయటపెట్టాలి. 
కాళీ:  చచ్చిపోతావ్ అనే కదా అన్న వదిన భయపడేది. మరి ఎలా భయం పోతుందే..
క్రిష్‌: ఓరేయ్ పిచ్చోడా ఇలా జరిగాకకూడా ఇంకా నన్ను చంపేస్తాం అని ఎలా బెదిరిస్తారురా. వాళ్లకి ఈ పాటికి నేను ఏంటో అర్థమైపోయింటుంది.
 కాళీ: అన్నా ఈ ప్లాన్ అంతా బాగుంది కానీ నువ్వు అనుకున్నట్లు వాళ్లకి భయం మాత్రం పోలేదు అన్న. నువ్వు కోపంగా చూసినా నిజం అదే అన్న. మీ మామ భయపడి ఉంటే ఈ పెళ్లి ఎప్పుడో క్యాన్సిల్ చేసేవాడు కదా. 
క్రిష్‌: ఎట్లా క్యాన్సిల్ చేసుకుంటాడురా ఆ అమెరికా వాడు ఇంకా పెళ్లి చేసుకుంటా అంటున్నాడు కదా.
కాళీ: వాడికి నువ్వు వార్నింగ్ ఇచ్చినా కూడా ఇంకా పెళ్లి చేసుకుంటా అంటున్నాడు అంటే.. ఇంకా ఏం చేసి పెళ్లి ఆపుతావ్.
క్రిష్‌: వార్నింగ్‌తో భయం పోలేదు అంటే చావుతో భయం పోతుంది కదా.. వాడిని చంపేస్తే సత్య దృష్టిలో హీరో అయిపోతాడురా. అందుకు వాడిని చంపక్కర్లేదురా చావుని పరిచయం చేస్తే చాలు. వాడే అమెరికాకు పారిపోతాడు. 

కాళీ: రేయ్ క్రిష్ గాడు అలా చేసేవరకు మనం ఆగుతామా ఏంటి వాడి కంటే ముందే ఆ మాధవ్ గాడిని సత్యని లేపేస్తా.. ఇప్పుడు అందరి ముందు ఆ మాధవ్‌ గాడికి సత్యకి అఫీషియల్ శత్రువు అయినాడు ఈ క్రిష్ గాడు. వాళ్లు చస్తే వీడే చంపాడు అనుకుంటారు కదా.. అక్కడ అది చచ్చిపోతుంది. వీడు జైలుకు పోతాడు. అది కదా మనకు కావాల్సింది. కాళీ మాటలంతా బాబీ చాటుగా వింటాడు. 
బాబీ: ఈ కాళీ గాడు వెనకే ఉండి ఇంత నడిపిస్తున్నాడా.. వెంటనే అన్నకి ఈ విషయం చెప్పాలి.  

సత్య: తనలో తాను.. నాన్న నీ సంతోషానికి కారణం అవ్వాలి అనుకున్నా కానీ నీ బాధకు కారణం అవుతున్నా. అందుకే నా నిర్ణయం నేను తీసుకొని మీకు చెప్పకుండా ఇలా మాధవ్ గారి ఇంటికి వచ్చాను.
సునంద: సత్య.. నువ్వు ఎప్పుడు వచ్చావ్. మాధవ్ ఎవరు వచ్చారో చూడు.
మాధవ్: హాయ్ సత్య వాటే సర్‌ప్రైజ్.
శేఖర్: ఏంటి అమ్మా ఒక్కదానివే వచ్చావా.. మావాడు ఏడి.
సత్య: ఎవరికీ చెప్పకుండా వచ్చాను. చెప్పి వస్తే నాకు అడ్డుపడతారు అని చెప్పలేదు. అమ్మా నాన్న నా సంతోషం కోసం ఒక నిర్ణయం తీసుకున్నారు. అది మాధవ్‌ గారితో పెళ్లి. కానీ నేను అదే అమ్మానాన్నల సంతోషం కోసం ఇంకో నిర్ణయం తీసుకున్నాను. నిశ్చితార్థం రింగ్ చేతి నుంచి తీసి మాధవ్ చేతిలో పెడుతుంది. తీసుకోండి మాధవ్ గారు. 
మాధవ్: ఏంటిది సత్య.
సత్య: ఇది తొందరి పడి తీసుకున్న నిర్ణయం కాదు బాగా ఆలోచించి తప్పనిసరి పరిస్థితిలో తీసుకున్న నిర్ణయం. 
మాధవ్: ఆ రౌడీకి భయపడి ఇలాంటి నిర్ణయం తీసుకున్నావ్ కదూ. 
సత్య: నా పెళ్లి చాలా మంది కష్టాలకు కారణం అవుతుంది. మా అమ్మానాన్నలకు నిద్రలేని రాత్రులను మిగుల్చుతుంది. ఇటు మీకు కూడా పైకి చెప్పుకోలేని సమస్యగా మారింది. 
మాధవ్: సత్య అసలు ఇప్పుడు ఏం జరిగింది. ఎవరు ఏం అన్నారు. డాడీ ఒకసారి అంకుల్‌కి కాల్ చేయండి. 
సత్య: ఎవరు ఏం చెప్పినా నా నిర్ణయం మారదు మాధవ్ గారు. పెళ్లి పీటలు మీద కూర్చొనే వరకు నన్ను ఎలా కాపాడుకోవాలా అని ఇంట్లో అందరూ బాధపడుతున్నారు. ఎవరికీ సంతోషం లేదు. ఎందుకు నేను వాళ్లని అలా బాధ పెట్టాలి. మిమల్ని ఇంకో సమస్యకు ఎందుకు గురిచేయాలి. 
మాధవ్: సత్య నేను నీకు మాటిస్తున్నాను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నీ చేతిని వదలను. ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మీ అమ్మానాన్నలు సంతోషపడరు. పైగా కుమిలిపోతారు. బయటకు వచ్చి ఎవరికీ ముఖం కూడా చూపించుకోరు. నువ్వు చేసిన పని వల్ల సంతోషం పక్కన పెట్టు మరింత బాధ పెట్టినదానివి అవుతావ్. సత్య నీ సంతోషంలోనే కాదు నీ బాధలోనూ నేను తోడు ఉంటా నన్ను నమ్ము.
శేఖర్: ఇది వాడు ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదమ్మా. మనస్ఫూర్తిగా చెప్తున్న మాట. 
సునంద: నువ్వు మనసు మార్చుకోకపోతే మీ వాళ్లు ఎంత బాధపడతారో అంతకంటే ఎక్కువ నా కొడుకు బాధ పడతాడు అమ్మా. ఆ బాధలో వీడు పిచ్చోడు అయిపోతాడు అమ్మా. 
మాధవ్: ప్లీజ్ సత్య నీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకో. ఈ రింగ్ తీసుకో సత్య. అంటూ సత్య చేతికి మళ్లీ మాధవ్ రింగ్ పెడతాడు. మాటిస్తున్నాను సత్య జీవితంలో నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎంతటి కష్టం వచ్చినా నేను నీ చేయి వదిలిపెట్టను. సత్య నేను నిన్ను ఎప్పటికీ నా జీవితం నుంచి డ్రాప్ చేయను. కానీ ఇప్పటికి మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. పద.. 

మరోవైపు క్రిష్ తన ఇంటికి వస్తాడు. అప్పుడే బాబీ హడావుడిగా పరుగున వస్తాడు. మనం మోసం పోయామని.. కాళీ మనల్ని వెన్నుపోటు పొడిచాడు అని చెప్తాడు. మనతో ఇన్నాళ్లు మంచిగా నటించింది వదిన మీద పగ తీర్చుకొనే అవకాశం కోసమే అన్న. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది వదినను చంపాలి అనుకుంటున్నాడు అన్నా అని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 

Also Read: కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫిబ్రవరి 13th: ముకుంద దాచుకున్న ఫొటోలు చూసేసిన ఆదర్శ్.. కృష్ణకు రొమాంటిక్‌గా ప్రపోజ్ చేసిన మురారి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
Embed widget