అన్వేషించండి

Satyabhama Serial Today October 22nd: సత్యభామ సీరియల్: పచ్చబొట్టేసినా ప్రయోజనం లేకున్నదే: మామని చూసి సత్య పాటలు, చిన్న కొడుకు ఎంట్రీ!

Satyabhama Today Episode మహదేవయ్య చిన్న కొడుకు సంజయ్‌ని చక్రవర్తి తీసుకొచ్చి ఇక నుంచి ఈ ఇంట్లోనే ఉంటాడని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode భైరవి రుద్రిని కలుస్తుంది. రుద్ర తండ్రితో మాట్లాడుతానని చెప్తాడు. కేసు మాఫీ చేయించి కాపాడమని తండ్రికి చెప్పమని తల్లితో చెప్తాడు. నీ బాపు, చిన్నా ఇద్దరూ మాట వినడం లేదని భైరవి చెప్తుంది.. దాంతో రుద్ర వాడెవడు వాడు నా తమ్ముడు కాదు అని చెప్పబోయి ఆగిపోతాడు. ఇక సత్య కనిపించకూడదని తాను ఇంటికి వచ్చే సరికి తన మీద పగ తీర్చుకోవాలని అంటాడు. భైరవి సరే అని తర్వాత కలుస్తాని వెళ్లిపోతుంది.

మరోవైపు సత్య మహదేవయ్య కోసం కాఫీ తీసుకెళ్తే మహదేవయ్య వద్దని తన కొడుకు క్రిష్‌కి ఇవ్వమని అంటాడు. నా కొడుకు గొప్పొడు. నా మాట జవదాటడు అని పొగిడేస్తాడు. ఇక క్రిష్ కూడా నా పేరు నీ గుండెల మీద పచ్చబొట్టు పొగిపించుకున్నా నీ రుణం తీర్చుకోలేనని అంటాడు. ఇక సత్య ఈ కాఫీ ఎవరికి ఇవ్వాలి అని మహదేవయ్యకి ఇస్తుంది. ఇక మహదేవయ్య రాజకీయంలో ఎప్పుడు ఏమవుతుందో తెలీదని నర్శింహని చంపేయాలని చెప్తాడు. ఈ రాత్రికే అది జరిగిపోవాలని అంటాడు.

క్రిష్: వాడు అడ్డు పడని అప్పుడు చూద్దాం.
మహదేవయ్య: కథ అక్కడి వరకు ఎందుకు తీసుకెళ్లాలి. ముందే వేసేస్తే అయిపోతుంది కదా.
క్రిష్: బాపు ఆవేశ పడితే మొదటికే నష్టం వస్తుందని సత్య చెప్పింది. ఈ పని అయినా ఆలోచనతోనే చేయాలని చెప్పింది.
మహదేవయ్య: చిన్నా సత్యకి రాజకీయం తెలీదురా.
క్రిష్‌:  కానీ గెలవడం తెలుసు బాపు.
మహదేవయ్య: అంటే ఈ బాపు అనుభవానికి విలువ లేదా.
క్రిష్: బాపు మీదకి అందరూ మనల్ని అభిమానిస్తున్నా లోపల భయపడుతున్నారు. కట్టుకున్న భార్యనే చంపాలని నీ పెద్ద కొడుకు ప్రయత్నించాడు. మాయని మచ్చ అది. ఇలాంటి టైంలో నర్శింహని మర్డర్ చేస్తే మన ఇంటికి చెడ్డ పేరు వస్తుంది. ప్రస్తుతం మనం కొత్త బురద అంటించుకోకూడు ఉన్నదాన్ని తొలగించుకోవాలి. ఎప్పుడు ఏం చేయాలో నేను చూసుకుంటా మీరు ఆరాంగా ఉండండి బాబు.
సత్య: క్లాప్స్ కొడుతూ పచ్చ బొట్టేసినా లాభం లేకున్నాదే. ఇప్పటి కైనా అర్థమైందా మామయ్య కాని మామయ్య చిన్నా మీ చేతిలో ఆయుధం కాదు. ఎప్పుడు పడితే ఎలా పడితే అలా వాడటానికి ఇప్పుడు ఆయుధం కూడా ఆలోచిస్తుంది. ఏది మంచో ఏది చెడో నోరు తెరిచి చెప్తుంది. ఈ మార్పునకు కారణం ఎవరు. మీరు క్రిష్ పేరు పచ్చబొట్టు వేయించుకున్నారు. కానీ క్రిష్ నా పేరు పచ్చబొట్టు వేయించుకున్నాడు. తేడా ఏంటో తెలుసా మామయ్య క్రిష్‌కి నామీద ఉంది గుండెల నుంచి వచ్చిన ప్రేమ మీకు గుండెల మీద ఉన్న దొంగ ప్రేమ. ఈ నిజం ఎంతో కాలం ఉండదు జాగ్రత్త పడండి మహదేవయ్య గారు. 

మరోవైపు మైత్రి హర్ష కోసం డైరీ రాస్తుంటుంది. పెళ్లి అయిన తర్వాత నా ప్రేమ నీకు తెలియాలని రాస్తున్నా అనుకుంటుంది. ఇక మైత్రికి ఫోన్ రావడంతో పక్కకు వెళ్తుంది. ఇంతలో హర్ష ఆ గదిలోకి వెళ్తాడు. డైరీ చూడబోతే మైత్రి వచ్చి లాక్కుంటుంది. ఇక హర్ష మైత్రి వీసా కోసం అప్లై చేస్తాడు. లోన్ కూడా ఓకే అని అంటాడు. ఆ మాటలు నందిని వింటుంది. ఈ విధంగా అయినా దీని పీడ విరగడ అయితే చాలు అనుకుంటుంది. ఇంతలో నందిని వచ్చి హర్ష నీ దోస్త్ అవ్వడం నీ అదృష్టమని వీసా సంగతి తేల్చుకో అని చెప్తుంది. మైత్రి ఇక నందినితో నీ లాంటి భార్య దొరకడం హర్ష అదృష్టం, నాకు నువ్వు సపోర్ట్ చేయడం నా అదృష్టం అని అంటుంది.

మరోవైపు మహదేవయ్య ఇంటికి చక్రవర్తి తన కొడుకుగా పెరుగుతున్న మహదేవయ్య చిన్న కొడుకు సంజయ్‌ని తీసుకొని వస్తాడు. ఫారెన్‌లో ఉన్న సంజయ్ బిగ్ డాడ్ అని మహదేవయ్యని హగ్ చేసుకుంటాడు. చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నావని సంజయ్ అంటాడు. ఇక జయమ్మని పట్టుకొని గ్రానీ నువ్వు ఇంకా ఉన్నావా అని జోకులు వేస్తాడు. భైరవిని చూసి ఏమైంది బిగ్ మామ్ డల్‌గా ఉన్నావని అంటాడు. ఇక చక్రవర్తి చదువు అయిపోయింది జాబ్ కూడా దాదాపు వచ్చేసిందని పెళ్లి చేద్దామంటే వద్దుంటున్నాడని అన్నయ్య దగ్గర వదిలేయడానికి వచ్చానని అప్పుడైనా మారుతాడని అంటాడు. ఇక సంజయ్, క్రిష్‌లు కలుసుకుంటారు. క్రిష్ని చూసి బ్రో పొట్ట వస్తుంది పెళ్లి అయిందా అని అడుగుతాడు. మహదేవయ్య ఇంట్లో ఉండనని ఎలాంటి పరిస్థితిలోనూ ఉండేదే లేదు అంటాడు. ఇంతలో సత్య రావడం చూసి సత్య అందానికి ముగ్దుడై నిల్చుండిపోతాడు.

ఎవరూ ఎంత అందంగా ఉన్నారని అంటే క్రిష్ నా భార్య అంటే సంజయ్ డిసప్పాయింట్ అవుతాడు. ఇక సత్యకి షేక్ హ్యాండ్ ఇస్తే సత్య నమస్కారం పెడుతుంది. విలేజ్ అమ్మాయా అని అంటాడు. ఇక సత్య అని పిలిస్తే సత్య ఇంగ్లీష్‌లో పేరుతో పిలవద్దు వదినా అని పిలవ మంటుంది. దానికి సంజయ్ నేను క్రిష్ నిమిషాల తేడాలో పుట్టాం నేను పేరు పెట్టి పిలుస్తా అంటాడు. క్రిష్‌ ఓకే అంటాడు. ఇక సంజయ్ సత్య కోసం ఇంట్లో ఉండిపోవాలని అనుకుంటాడు. సత్యని బెడ్ రూం చూపించమంటే మీ బ్రో చూపిస్తాడు అని చెప్తుంది. ఇక మహదేవయ్య చక్రవర్తితో వాడిని ఎందుకు తీసుకొచ్చావని అంటాడు. అప్పగించి పోవడానికి తీసుకొచ్చా అని చక్రవర్తి చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read:  సత్యభామ సీరియల్: గుండెల మీద చిన్నా పేరు పచ్చబొట్టు పొడిపించుకున్న మహదేవయ్య.. క్రిష్‌కి ఎమోషనల్ బ్లాక్ మెయిల్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget