Satyabhama Serial Today March 7th: సత్యభామ సీరియల్: తండ్రీ కొడుకుల సమరం.. మహదేవయ్యని క్రిష్ చంపేస్తాడా!
Satyabhama Today Episode తన కన్నతల్లిని చంపింది బాపునే అని తెలుసుకున్న క్రిష్ మహదేవయ్యని చంపడానికి వెళ్లడం అక్కడ ఇద్దరూ గొడవ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Satyabhama Serial Today Episode మహదేవయ్యకి ప్రాణ గండం ఉందని మృత్యుంజయ హెమం చేయాలని సంజయ్ పంతులుతో చెప్పిస్తాడు. భైరవి టెన్షన్ పడి పంతులు రమ్మన్నాడని సంజయ్‌తో చెప్తే సంజయ్ తల్లి, వదిన, బామ్మల్ని వెళ్లమని చెప్తాడు. భైరవి మహదేవయ్య దగ్గరకు వెళ్లి జాగ్రత్తగా ఉండమని బాపుని జాగ్రత్తగా చూసుకోమని సంజయ్‌కి చెప్తుంది.
మహదేవయ్య: ఇది మారదు దీంతో వేగుడు కష్టం.
సంజయ్: వదిలేయండి డాడ్ ఎవరి ఇది వాళ్లకి ఇప్పుడే ఒక కాల్ చేసి వస్తాను. రేయ్ నీతో ఒకటి చెప్పాలి క్రిష్ తల్లిని దారుణంగా చంపింది మా డాడ్ మహదేవయ్య. ఈ నిజం క్రిష్‌కి తెలిస్తే మరోక్షణమే మా డాడ్‌ని చంపేస్తాడు. నాకు కావాల్సింది అదే. నువ్వు వెళ్లి ఈ విషయం వాడికి చెప్పు. ఈ దెబ్బతో మా డాడ్ పైకి క్రిష్ గాడు లోపలికి .
సంధ్య: అర్జెంటుగా ఈ విషయం అక్కకి చెప్పాలి.
సంజయ్: చేప గాలానికి చిక్కుకుంది.
మైత్రి హర్ష ఇంటికి వస్తుంది. హర్ష చూసి షాక్ అయిపోతాడు. మైత్రి మాటలకు హర్ష మైత్రిని కొట్టబోతే నందిని రావడంతో ఆగిపోతాడు. ఇక మైత్రి నందినితో హర్షలో గిల్ట్ చూశావా నందిని ఏదో తప్పు చేసినట్లు భయపడటం ఇన్నీ గమనించావా అని అంటే నా మొగుడుని నేను చూసుకుంటా అంటుంది. మైత్రి విశ్వనాథం, విశాలాక్షిలను చూసి అత్తయ్యా మామయ్య అని పలకరిస్తుంది. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నావ్ అంటే కాబోయే కోడలిని మామయ్య హర్ష నందిని మెడలో తాళి కట్టినా నాతో ఒక రాత్రి గడిపాడు అని చెప్తుంది. నందిని తిట్టి మైత్రిని గెంటేస్తే రాసలీలల వీడియోలు ఉన్నాయి కంప్లైంట్ ఇస్తాను అని మైత్రి అంటుంది. దాంతో సత్య వచ్చి కంప్లైంట్ ఇచ్చుకో అంటుంది. అన్నయ్య ఏం చేయలేదు వదినా అని చెప్పి హర్ష తప్పు చేయలేదు అని చెప్పిన వీడియో చూపిస్తుంది. ఇక నందిని చీరుపుతో మైత్రిని తరిమి తరిమి కొడుతుంది. ఇక సత్య నానమ్మతో వేడి వేడి కాఫీ ఇవ్వమని అంటుంది. ఇంతలో సంధ్య ఏడుస్తూ పుట్టింటికి వస్తుంది. ఏడుస్తూసత్య కాళ్ల మీద పడుతుంది.
సత్య: ఏమైంది సంధ్య.
సంధ్య: మోసపోయా అక్క నీ మాట వినకుండా ఆ సంజయ్ చేతిలో మోసపోయా అని సంజయ్ చేసిన మోసం చేసి బెదిరించడం గురించి చెప్తుంది. నేను అతనితో బతకలేను అక్క.
సత్య: తప్పమ్మా అలా అనకూడదు. తెగ తెంపులు చేసుకోకూడదు నెమ్మదిగా తనని మార్చుకోవాలి.
సంధ్య: నా సంగతి వదిలేయ్ అక్క వాడు బావగారికి ద్రోహం చేస్తున్నాడు. హాస్పిటల్‌లో బావగారి కన్నతల్లిని మామయ్య గారే దారుణంగా హత్యచేశారంట. క్రిష్ వింటాడు.
సత్య: నాకు తెలుసు ఈ విషయం మీ బావగారికి తెలిస్తే వాళ్ల బాపుని బతకనివ్వడు. అందుకే దాచాను.
అందరూ షాక్ అయిపోతారు. క్రిష్ ఆ మాటలు వినేస్తాడు. ఆవేశంగా బయటకు వెళ్లడం సత్యతో పాటు అందరూ చూస్తారు. సత్య, సంధ్యలు మహదేవయ్య ఇంటికి పరుగులు తీస్తారు. సంజయ్ తన తండ్రిని క్రిష్ చంపేస్తాడనని కలలు కంటూ ఎంజాయ్ చేస్తుంటాడు. మహదేవయ్య చనిపోతే తనకు అడ్డులేదని ఈ సామ్రాజ్యం అంతా తనదే అని గెంతులేస్తాడు. క్రిష్ మహదేవయ్య ఇంటి తలపులు తన్ని లోపలికి వెళ్లడం చేతిలో కత్తి చూసిన మహదేవయ్య చిన్నా అని భయపడతాడు. ఎందుకు చంపినావ్ మా అమ్మని ఎందుకు చంపావ్ అని క్రిష్ అడిగితే క్రిష్‌కి నిజం తెలిసిపోయిందని మహదేవయ్య క్రిష్‌ని బతిమాలుతాడు. నా కన్న తల్లిని ఎందుకు చంపావ్ అని క్రిష్ అడుగుతూ నువ్వు చేసిన ద్రోహం తెలియగానే నా గుండె ముక్కలు అయిపోయిందని కేకలేస్తాడు.
క్రిష్ అటాక్ చేసేలా ఉన్నాడని కత్తి తీసుకెళ్లి మహదేవయ్య మెడ మీద పెడతాడు. నేను నిన్ను మోసం చేయను వెన్ను పోటు పోడవను అని ధర్మయుద్ధం చేస్తాను అని కత్త తీసుకొచ్చి మహదేవయ్యకి ఇచ్చి మన ఇద్దరిలో ఒకరికే ఈ భూమ్మీద నూకలు ఉన్నాయి అది ఎవరికో తేల్చుకుందామని అంటాడు. మహదేవయ్యని పొడవ బోయి గతంలో తాను చూపించిన ప్రేమ గుర్తొచ్చి ఆగిపోతాడు. ఇక మహదేవయ్య క్రిష్ మెడ మీద కత్తి పెడతాడు. క్రిష్ తనని చంపేయ్మని నీకు నన్ను చంపే అంత కోపం వస్తున్నా నాకు నిన్ను చంపే అంత కోపం రావడం లేదని చెప్తాడు. ఇదెక్కడి సంతరా ఎవరూ చంపుకోవడం లేదని సంజయ్ అనుకుంటాడు. నాకు నీ మీదే ప్రేమ ఎక్కువ అని అంటాడు క్రిష్. నువ్వు ఇష్టపడేవాళ్లు నీకు విలువ ఇవ్వకపోతే నువ్వు ఎంత బాధ పడతావో నేను అంతే బాధ పడతాను బాపు అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: సిద్ధాంతం సావిత్రీదేవి గారి బంగారు గాజులు కొట్టేసిన దేవా.. ఇంట్లో టెన్షన్ టెన్షన్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

